DJ Tillu ‘s Sequal Tullu Square Release Date Locked : సిద్ధు జొన్నలగడ్డ, DJ టిల్లు కి సీక్వెల్ “టిల్లు స్క్వేర్”  విడుదల ఎప్పుడంటే!

20240126 141240 e1706274024756

  స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన “డిజె టిల్లు” సినిమాతో “టిల్లు“గా ప్రేక్షకులపై పెద్ద ప్రభావాన్ని కలిగించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించి, కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా పేరు పొందింది.

ప్రకటన వచ్చినప్పటి నుండి, “టిల్లు స్క్వేర్” సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై “టిల్లు”గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IMG 20240126 WA0088

ఈ విషయాన్ని రుజువు చేస్తూ, టిల్ స్క్వేర్ కోసం రామ్ మిరియాల స్వరపరిచిన ఆల్బమ్‌లోని “టికెట్టే కొనకుండా”, “రాధిక” వంటి పాటలు ఇప్పటికే వైరల్ చార్ట్‌బస్టర్‌లుగా మారాయి.

మేకర్స్ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఒరిజినల్ కు మించిన సీక్వెల్ చేయడానికి తగినంత సమయం తీసుకున్నారు.

కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు మేకర్స్ వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు.

“డిజె టిల్లు” అభిమానులను మాత్రమే కాకుండా అందరు ప్రేక్షకులను అలరించే “టిల్ స్క్వేర్”పై మేకర్స్ గొప్ప నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘టిల్లు ఫ్రాంచైజీ’ నుంచి వస్తున్న మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని గట్టిగా చెప్పవచ్చు.

ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. సినిమాలోని ఆమె “కిల్లర్” లుక్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్నారు.

శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *