Director Special Interview: ప్రేమ్ కుమార్ సిన్మా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమ్ అంటున్న దర్శకుడు అభిషేక్ మహర్షి*

IMG 20230813 WA0110

 

సంతోష్ శోభ‌న్ హీరో రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

IMG 20230813 WA0072

 

ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మా 18F మూవీస్ ప్రతినిధి తో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులల్లోని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ప్రచిలురిస్తున్నాము.

IMG 20230813 WA0105

మీ నేపథ్యం ఏంటి? ఈ సినిమా కథ ఎలా ప్రారంభమైంది?

సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. ఓటీటీలో షోలకి కూడా రాశాను. పేపర్ బాయ్ అయిపోయిన టైంలోనే సంతోష్ శోభన్‌ను కలిశాను.. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అలా చివరకు సినిమాను చేశాం. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు ప్రేమ్ కుమార్ కథ సెట్ అయింది. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు.

IMG 20230813 WA0101

ఇది వరకు మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌గా పని చేశారా?

కరోనా వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. ఈ మూవీ పాయింట్ కొత్తగా ఉంటుంది. నేను ఇది వరకు ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. కానీ నేను చాలా ప్రొడక్షన్ కంపెనీల్లో రైటర్‌గా పని చేశాను. నా యాక్టింగ్ కెరీర్ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.

IMG 20230813 WA0111

ఏ దర్శకుడి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది?

హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్ ఇలా అందరూ ఎంతో పర్ఫెక్ట్‌గా సినిమాను ప్లాన్ చేసి తీస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. నేను నటుడిగా వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ అనుభవాలన్నీ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి.

IMG 20230811 WA0063

విశ్వక్ సేన్ నటించిన సినిమాతో పోలిక పెడుతున్నారు కదా?

సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్ లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ  మూవీ దర్శకుడితో మాట్లాడాక.. కాన్సెప్ట్ వేరని అర్థమైంది.

IMG 20230813 WA0112

స్క్రిప్ట్ పూర్తయ్యాక ఏమైనా మార్పులు జరిగాయా?

మా టీంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమీ రాలేదు. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అందులో ఎవ్వరూ ఏమీ వేలు పెట్టలేదు. సంతోష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే, స్క్రిప్ట్ ఓకే చేస్తే.. డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తాడు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తరువాత ఎలాంటి మార్పులు చేయలేదు.

IMG 20230813 WA0102

మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ శ్రీక‌ర్ చదువుకునే రోజుల నుంచి నాకు తెలుసు. శ్రీచరణ్ పాకాల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. కామెడీ జానర్ ఆయనకు కొత్త. ఈ సినిమాకు ఫ్యూజన్ స్టైల్లో మ్యూజిక్ కొట్టాడు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో సౌండింగ్ పరంగా కొత్త ఫీలింగ్ వస్తుంది.

IMG 20230813 WA0153

ఈ కథ, ఈ టైటిల్ ఎలా పుట్టింది?

కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథను రాశాను. మగాడికి పెళ్లి అయితే జీవితం నాశనం అవుతుంది. పీఠల మీదే పెళ్లి ఎలా ఆగిపోతుందని చాలా రకాలుగా ఆలోచించి రాశాను.. బయట కూడా అలాంటి ఘటనలే జరిగాయి.

IMG 20230813 WA0104

నిర్మాత శివ ప్రసాద్ గురించి చెప్పండి?

సినిమాల మీద మా నిర్మాత శివ ప్రసాద్‌కి ఎంతో ప్యాషన్ ఉంది. ఊరికే ఏదో సినిమా తీసేద్దామని అనుకోలేదు. సంతోష్, నేను, శివ ముగ్గరం కూడా ఎక్కడో ప్రారంభించి ఇక్కడి వరకు రావడమే సక్సెస్‌గా భావిస్తాం.

IMG 20230813 WA0158

మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఎక్కడా వల్గారిటీ, బూతులు ఉండవు. అమ్మానాన్నలతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడొచ్చు. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఇందులో నా భార్య, నేను కూడా గెస్ట్ రోల్స్‌‌లో కనిపిస్తాం. నెక్ట్స్ ఫుల్ లెంగ్త్ సీరియస్ సబ్జెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. స్టోరీ రెడీగా ఉంది. సెప్టెంబర్ కల్లా స్క్రిప్ట్ రెడీ అవుతుంది.

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్…

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *