DilRaju Hero Nithin New Movie opens: హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో “తమ్ముడు” సినిమా లాంఛ్

IMG 20230827 WA0066 e1693143682743

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “తమ్ముడు” సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

IMG 20230827 WA0064

దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రానికి “దంగల్, కహానీ,తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

IMG 20230827 WA0067

ఈ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా *ఎంసీఏ*, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తమ్ముడు సినిమా లాంఛ్ అవడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

IMG 20230827 WA0065

నటీనటులు : నితిన్

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ – సేతు,

పీఆర్వో – వంశీ కాకా,జీఎస్ కే మీడియా

బ్యానర్ – శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్

నిర్మాత – దిల్ రాజు,శిరీష్

రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు.

IMG 20230827 WA0063

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *