Dil Raju Lauches Kismat Trailer Review : దిల్ రాజు లాంచ్ చేసిన ‘కిస్మత్‌’ మూవీ ట్రైలర్  !

IMG 20240127 WA0239 e1706371079491

నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌’. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘కిస్మత్‌’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

రెండున్నర నిమిషాల నిడివి గల ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్ గా వుంది. విశ్వదేవ్, అభినవ్, నరేష్ అగస్త్య ఈ ముగ్గురి స్నేహితుల జర్నీని చాలా హిలేరియస్ గా ప్రజెంట్ చేశారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ ముగ్గురి ‘కిస్మత్’ సిటీకి వెళ్ళిన తర్వాత ఎలా మారిందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. ‘డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని దాచుకోవడం అంత కంటే కష్టం’ అంటూ అజయ్ ఘోష్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన సన్నివేశాలు చాలా థ్రిల్లింగా వున్నాయి.

IMG 20240127 WA0194

 

 

నరేష్ అగస్త్య, విశ్వదేవ్, అభినవ్ ..ఈ ముగ్గురి ఫ్రండ్స్ కెమిస్ట్రీ చాలా ఆర్గానిక్ వుంది. ముగ్గురూ మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వండర్ ఫుల్ టైమింగ్ తో చెప్పిన సింగిల్ లైనర్స్ వినోదాన్ని పంచాయి. హీరోయిన్ రియా సుమన్ ప్రెజెన్స్ ప్లజెంట్ గా వుంది. శ్రీనివాస్ అవసరాల మరో కీలక పాత్రలో ఆకట్టుకునారు. డైరెక్టర్ శ్రీనాథ్ బాదినేని అందరినీ అలరించే బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ అందిచబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

వేదరామన్ శంకరన్ అందించిన విజువల్స్, మార్క్ కె రాబిన్ నేపధ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ట్రైలర్ కిస్మత్ పై క్యూరియాసిటీని పెంచింది.

రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ‘కిస్మత్‌’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

తారాగణం:

నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని,నిర్మాత: రాజు,సహ నిర్మాత: సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి,బ్యానర్లు: కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్,డీవోపీ: వేదరామన్ శంకరన్,సంగీతం: మార్క్ కె రాబిన్,ఎడిటర్: విప్లవ్ నైషధం,ఆర్ట్: రవి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి,పీఆర్వో: వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *