Dhruva Nakshtharam Movie Release Date Locked: విక్రమ్ “ధృవ నక్షత్రం” సినిమా నుంచి ‘కరిచే కళ్లే…’ లిరికల్ సాంగ్ రిలీజ్, మూవీ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే ! 

druva nakshitram arr e1699108011375

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ధృవ నక్షత్రం”. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ “ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం” ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

druva nakshitram vikram

“ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం” నుంచి ‘కరిచే కళ్లే..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా..శ్రీలేఖ పార్థసారధి పాడారు. ‘కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా…గరుకు ఒళ్లే నన్ను లాగెనురా బాయ్యా…వయసిక ఆగనంది అట్టా ఇట్టాగుంది..యెంటనే తాంబూలాలు మార్చేసుకోమంది…’ అంటూ హీరోయిన్ లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట. బ్యూటిఫుల్ మెలొడీగా హ్యారీస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాట అమ్మాయిల లవ్ ఆంథెమ్ కానుంది.

నటీనటులు : 
చియాన్ విక్రమ్, రితూ వర్మ, ఆర్. పార్తీబన్, ఆర్. రాధిక శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్, దివ్య దర్శిని, మున్నా సైమన్, వంశీ కృష్ణ, సలీమ్ బేగ్, సతీష్ కృష్ణన్, మాయ ఎస్ కృష్ణన్ తదితరులు

టెక్నికల్ టీమ్: 

ఎడిటర్ – ఆంటోనీ, ఆర్ట్ – కుమార్ గంగప్పన్, యాక్షన్ – యానిక్ బెన్, లిరిక్స్ – రాకేందు మౌలి, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
మ్యూజిక్ – హ్యారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ – మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కతీర్, విష్ణు దేవ్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా
కో ప్రొడ్యూసర్ – ప్రీతి శ్రీవిజయన్, నిర్మాత, రచన, దర్శకత్వం – గౌతమ్ వాసుదేవ్ మీనన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *