అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న  “ధూమ్ ధామ్”

IMG 20250131 WA0296 e1738341384920

నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ధూమ్ ధామ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్టీమింగ్ అవుతుంది.

చేతన్ కృష్ణ-హెబా పటేల్ నటించిన ఈ మూవీ కి ప్రముఖ రచయిత గోపీ మోహన్ కథను అందించగా, మచ్చ సాయికిషోర్ దర్శకత్వం వహించారు. ఎన్ఆర్ఐ అయినటువంటి హీరో తన స్నేహితుడి పెళ్లి కోసం ఇండియా ‌కి వచ్చి, కుటుంబ బాధ్యతలను స్వీకరించాల్సిన పరిస్థితిని ఆసక్తికరంగా తెరకెక్కించారు.

వెన్నెల కిషోర్, సాయి కుమార్, వినయ్ కుమార్, గోపరాజు రమణ, బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ‘మల్లె పూల టాక్సీ’ పాటకు విశేషమైన ఆదరణ లభించింది. యూట్యూబ్‌లో 7 మిలియన్‌కు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది.

సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహించగా, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టారు. ఎమ్.ఎస్. రామ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఫ్రైడే ఫ్రేమ్‌వర్క్స్ బ్యానర్‌పై రూపొందింది.

టెక్నికల్ టీమ్:

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ, కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను, లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రిఫైట్స్ – రియల్ సతీష్, పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను, ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి, ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల , సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి, మ్యూజిక్ – గోపీ సుందర్, స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్, పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్, డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *