దండోరా’ సినిమా  ఇంత పెద్ద హిట్ కి కారణం కథే i – నటుడు శివాజీ

IMG 20251227 WA0021 scaled e1766799418689

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ స‌క్సెస్ మీట్‌లో…

శివాజీ మాట్లాడుతూ ‘‘హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయ‌టానికి వ‌చ్చారు. నీల‌కంఠ‌గారైతే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో షోలో బాగా పెరిగాయి. ఒక షో పెట్టిన‌వాళ్లు.. మూడు షోస్‌కు పెంచారు.

మ‌ల‌యాళ సినిమా డైరెక్ట‌ర్స్‌, మారి సెల్వ‌రాజ్ వంటి డైరెక్ట‌ర్‌తో పోల్చి ముర‌ళీకాంత్ గురించి మాట్లాడుతున్నారంటే.. మాకు చాలా గ‌ర్వంగా ఉంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ చూస్తే అద్భుత‌మైన న‌టులు వ‌స్తున్నార‌ని తెలుస్తుంది. ప్ర‌తి పాత్ర బాగా కుదిరింది. ఈ సినిమా షూటింగ్ చేస్తునన్ని రోజులు నేను రోజుకి 2 గంట‌లే ప‌డుకునేవాడిని. ఇందులో నాకు కొడుకు, కూతురు.. పాత్ర‌లుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయాలంటే పాత్ర‌లో ఆ లుక్ క‌నిపించాలి.

డైరెక్ట‌ర్ అడ‌గ‌క‌పోయినా నేను క‌ష్ట‌ప‌డ్డాను. అంద‌రూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. అంద‌రూ ఈ సినిమాను భుజాల‌కెత్తుకున్నారు. సినిమా లాంగ్ ర‌న్‌తో అంద‌రూ మాట్లాడుకునేలా ఉంది. థియేట‌ర్స్‌కు వచ్చి ఆడియెన్స్‌తో నేరుగా మాట్లాడుతాను. నిర్మాత‌కు ప్రేక్ష‌కుల స‌పోర్ట్ ఉండాలి’’ అన్నారు.

న‌వ‌దీప్ మాట్లాడుతూ ‘‘దండోరా రిలీజ్ ముందు వరకు ఇలా క‌ష్ట‌ప‌డ్డాం.. అలా క‌ష్ట‌ప‌డ్డాం అని అంద‌రూ చెప్పిన‌ట్లే మేమూ చెప్పాం. సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు రెండు షోస్ వేశాం. షోకు వ‌చ్చిన మీడియా ప్ర‌తినిధులు..అంద‌రూ బాగా రెస్పాండ్ అయ్యారు. పెద్ద హీరోలు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ప‌ర్లేద‌నే టాక్ వ‌స్తే.. ఓసారి అయినా చూడాల‌నుకుంటారు. అదే మంచి కంటెంట్ సినిమాల‌కైతే ఎంత కలెక్ష‌న్స్ వ‌స్తున్నాయి.

ఎంత మంది థియేట‌ర్స్‌కు వెళుతున్నార‌నే విష‌యాల‌ను చూస్తాం. ఇది రెండో కోవ‌కు చెందిన సినిమా. అయితే సినిమా చూసిన త‌ర్వాత..యూనానిమ‌స్‌గా సినిమా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. సినిమా రిలీజైన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ సినిమాను చూసే ప్రేక్ష‌కుల సంఖ్య పెరిగింది. సినిమా రిలీజ్ ముందు మంచి సినిమా తీశామ‌ని మేమెదైతే చెప్పామో.. ఆ ధైర్యం డ‌బుల్ అయ్యింది’’ అన్నారు.

నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మాట్లాడుతూ ‘‘సినిమాకు ప్రేక్ష‌కుల నుంచే కాదు..విమ‌ర్శ‌కుల నుంచి కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్స్‌కు వ‌చ్చి దండోరా సినిమాను చూసి ఆద‌రించండి’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ముర‌ళీకాంత్ మాట్లాడుతూ ‘‘సినిమా బావున్నప్పుడు మీడియా వాళ్లు ఇచ్చే స‌పోర్ట్ మామూలుగా ఉండ‌దు. అదే న‌న్ను మంచి సినిమా తీయాల‌ని మోటివేట్ చేసింది. మంచి సినిమా తీస్తే .. అంద‌రూ స‌పోర్ట్ చేస్తార‌ని న‌మ్మ‌కంతో తీశాను. సినిమాకు సంబంధించిన పాజిటివ్ టాక్ ఇంకా స్ప్రెడ్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. రాత్రి సినిమాకు వెళ్లిన‌ప్పుడు డైరెక్ట‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వెళ్లి నిల్చున్న‌ప్పుడు స్టాండింగ్ ఓవేష‌న్ ఇచ్చారు.

ఐటీ నుంచి మంచి సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న‌తో క‌సిగా వ‌చ్చాను. ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ తెలియ‌కుండా వ‌చ్చాను. అయితే ఇక్క‌డ నాకు మంచి స‌పోర్ట్ దొరికింది. మూడున్న‌రేళ్లుగా ఈ సినిమా గురించి ఆలోచిస్తూ వ‌చ్చాను. ఇప్పుడు సినిమా చూస్తున్న‌ప్పుడు వ‌చ్చిన ఫీలింగ్ నా క‌ష్టాన్ని మ‌ర‌చిపోయేలా చేసింది. అంద‌రూ ప‌వ‌ర్‌హౌస్ పెర్ఫామెన్సెస్ ఉంటాయి.

రోల‌ర్ కోస్ట్ రైడ్ ఉంటుంది. మూడున్న‌రేళ్ల క‌ష్టం. థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమా చూసి చెప్పండి. న‌న్ను న‌మ్మి అంద‌రూ టీమ్‌గా వ‌చ్చారు. మా టెక్నిక‌ల్ టీమ్ అయితే నిద్ర‌లేని రాత్రిళ్లు గ‌డిపాం. ఏదైనా జ‌రిగి ఉంటే దాన్ని ప‌క్క‌కు పెట్టి.. సినిమానే లోకంగా పని చేసిన మాకు స‌పోర్ట్ చేయండి’’ అన్నారు.

బిందు మాధ‌వి మాట్లాడుతూ ‘‘పదేళ్ల తర్వాత దండోరా రూపంలో నాకు తెలుగులో సినిమా చేసే అవకాశం వచ్చింది. మూడు నాలుగేళ్లుగా ఓటీటీల్లో చేస్తున్నాను. అయితే ఇక్క‌డ పుట్టి పెరిగిన నాకు ప‌దేళ్ల త‌ర్వాత తెలుగులో సినిమా రావ‌టం హ్యాపీ. బెన్నీ, ముర‌ళి గారికి థాంక్స్‌. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ ఆణిముత్యాలు. సినిమా క‌థ విని, ఈ టీమ్‌తో వ‌ర్క్ చేస్తాన‌ని తెలిసిన త‌ర్వాత ఎంత ఎగ్జ‌యిట్ అయ్యానో.. సినిమా రిలీజ్ త‌ర్వాత స్క్రీన్ మీద చూస్తుంటే అంత కంటే ఎక్కువ హ్యాపీగా అనిపించింది. క‌థ విన‌గానే చిన్న రోల్ అయినా, పెద్ద రోల్ అయినా ఇందులో భాగం కావాల‌ని అనుకున్నాను. ప్రివ్యూ చూసిన త‌ర్వాత సినిమా ఇంత బాగా వ‌చ్చింద‌ని హ్యాపీగా ఫీల్ అయ్యాను’’ అన్నారు.

ర‌వికృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమా చాలా బావుందని అందరూ అంటున్నారు. ప్రతీ క్యారెక్టర్ బావుందని డీటెయిల్డ్‌గా చెబుతున్నారు. నా చిరు మ్యాష‌ప్‌కి, సినిమాలో మా ల‌వ్ ట్రాక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాను చూసిన వాళ్లంద‌రూ అభినందిస్తున్నారు. దండోరా ముర‌ళీకాంత్‌గారి ఎన‌ర్జీ’’ అన్నారు.

మౌనిక మాట్లాడుతూ ‘‘దండోరా సినిమా నా వ‌ర‌కు రావ‌టం.. నేను యాక్సెప్ట్ చేయ‌టానికి గొప్ప‌గా భావిస్తున్నాను. మా త‌ల్లిదండ్రులు కులం గురించి ఎక్కువ‌గా ప‌ట్టింపులు ఉండే గ్రామం నుంచి వ‌చ్చారు. వాళ్లు సినిమా చూసిన త‌ర్వాత ఫోన్ చేసి మాట్లాడారు. సినిమా అయిన త‌ర్వాత రెండు నిమిషాలు కూర్చుని ఆలోచించుకునేలా సినిమా ఉంద‌ని అన్నారు. మానాన్న‌గారు త‌న ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లి సినిమాను చూపించారు. ద‌ర్శ‌కుడు ముర‌ళీకాంత్‌గారు నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు, నిర్మాత ర‌వీంద్ర‌గారికి థాంక్స్. ప‌త్రీ ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా’’ అన్నారు.

మ‌ణిక మాట్లాడుతూ ‘‘మా దండోరా సినిమా చూసి మంచి రివ్యూస్ రాసిన వారికి థాంక్స్. తొలి సినిమానే మంచి సినిమా చేశాంటూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్ట‌ర్‌గారికి, నిర్మాత‌గారికే చెందుతుంది. స‌పోర్ట్ చేసిన టీమ్‌కు, ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

అదితి భావ‌రాజు మాట్లాడుతూ ‘‘ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ దండోరా సినిమాను చూసి, అందరికీ సినిమా బాగా నచ్చింది. సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ప్ర‌తీ ఒక్క‌రూ అద్భుతంగా న‌టించారు. చిన్న క్యామియో అయినా చ‌క్క‌టి పాత్ర ఇచ్చినందుకు డైరెక్ట‌ర్‌గారికి, నిర్మాత‌గారికి థాంక్స్‌. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌’’ అన్నారు.

క‌మ‌ల్ మాట్లాడుతూ ‘‘జెన్యూన్ కంటెంట్ బ్లాక్ బస్టర్‌గా దండోరా మూవీ నిలిచింది. చూసిన వాళ్లంద‌రూ మౌత్ టాక్‌తో సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు. థియేట‌ర్స్‌కు వ‌చ్చి ఒక మంచి సినిమాను ఎంక‌రేజ్‌చేయాల‌ని కోరుతున్నాం’’ అన్నారు.

IMG 20251227 WA0019

దండోరా టీమ్ మీడియా తో చిట్ చాట్:

సెన్సార్ రిపోర్ట్ ఎందుకు ఆల‌స్య‌మైంది ?

 నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ మాట్లాడుతూ ‘‘అందరిలాగానే సినిమా 9-10 రోజుల ముందే సబ్మిట్ చేశాం. అయితే సెన్సార్ వాళ్లు సినిమాలో కొన్ని అంశాలపై కట్స్ చెప్పారు. దాన్ని ఎడిట్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాం. త‌ర్వాత కూడా ఇంకొన్ని మార్పులు చెప్పారు. దాన్ని చేసి మ‌ళ్లీ పంపాం.

రిలీజ్ రోజు ముందు మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు సెన్సార్ క్లియ‌రెన్స్ వ‌చ్చింది. మరీ అంత డిలే అవుతుంద‌ని అనుకోలేదు. నిజానికి జ‌నాల‌కు ముందుగానే సినిమాను చూపించాల‌ని అనుకున్నాం. కాంపీటీష‌న్ ఎక్కువ‌గా ఉంది. రూటెడ్ సినిమా కాబ‌ట్టి ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. కానీ ప్లానింగ్ మారింది’’ అన్నారు.

 రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసిన ఈ సినిమాలో చివ‌ర‌లో ఏమైనా పేప‌ర్ క‌టింగ్స్ చూపించి ఉండుంటే బావుండేది కదా?

 ముర‌ళీకాంత్ మాట్లాడుతూ ‘‘నిజానికి ఫ‌స్ట్ బీట్ ఆఫ్ దండోరా అనే వీడియోను సినిమా ప్రారంభంలో విడుద‌ల చేశాం. అందులో కొన్ని పేప‌ర్ కటింగ్స్‌ను పెట్టాం. రియ‌ల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సినిమా చేస్తున్నామ‌ని అక్క‌డే చెప్పాం. మ‌రీ డ్రెమ‌టైజేష‌న్ చేసిన‌ట్లు ఉంటుంద‌నిపించి సినిమాలో పేప‌ర్ క‌టింగ్స్ ను చూపెట్ట‌లేదు’’ అన్నారు.

సెన్సార్ వ‌ల్ల సినిమా ప్లానింగ్ దెబ్బ తింద‌నిపించిన‌ప్పుడు మీరెందుకు మాట్లాడలేదు?

 రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ ‘‘సినిమా సెన్సార్ అయిన త‌ర్వాత కాంపీటీష‌న్‌లో థియేట‌ర్స్ విషయం ఆలోచించుకోవాలి. సెన్సార్ డిలే కావ‌టంతో దానిపై ప్ర‌భావం ప‌డింది. చాలా మంది ఇంత మంచి సినిమా ప్రైమ్ టైమ్‌లో షోస్ లేదంట‌ని అడిగారు. దాని వ‌ల్ల లిమిటెడ్ షోస్ ఉన్నాయి. అంద‌రూ సినిమాను బావుంద‌నే అంటున్నారు. జ‌నాలు చూస్తే సినిమా డ్రైవ్ అవుతుంది.

శివాజీ క్యారెక్ట‌ర్‌పై ఇంత ఎఫ‌ర్ట్ పెడుతున్న‌ప్పుడు.. అంద‌రూ దండోరా గురించి మాట్లాడ‌కుండా వేరే విష‌యాలు గురించి మాట్లాడుతున్నారు..క‌దా

శివాజీ మాట్లాడుతూ ‘‘ఏమీ లేదు.. కాలం అన్నింటికీ స‌మాధానం చెబుతుంది.. మ‌నం ఏమీ మాట్లాడ‌కూడ‌దు’’ అన్నారు.

కుల వ్య‌వ‌స్థ‌లో మ‌రోలేయ‌ర్‌ను ట‌చ్‌చేసిన తీరు బావుంది.. !

ద‌ర్శకుడు ముర‌ళీకాంత్ మాట్లాడుతూ ‘‘సినిమాలో ఓ క్యారెక్ట‌ర్ ఉంటుంది. అది మాట్లాడుతూ కులం అనేది పులి మీద స్వారీలాంటిది. ఇప్పుడు నీ కులం నీ వెనుకుంద‌ని మాట్లాడుతున్నావు. వాళ్ల‌కు న‌చ్చ‌ని ప‌ని చేసి చూడు అప్పుడు తెలుస్తుంది అంటుంది. ఇది ఇంట‌ర్నెల్‌గా ఉండేది. దాన్నే చూపించే ప్ర‌య‌త్నం చేశాను’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *