విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, తులసి, అలీ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు
దర్శకుడు : త్రినాధరావు నక్కిన
నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ధమాకా తెలుగు రివ్యూ (Dhamakaa Movie Review):
మాస్ కా రాజా రవితేజ హీరోగా, త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన రవితేజ ధమాకా చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. రిలీజ్ కి ముందు ప్రచార చిత్రాలతో, ఫోక్, మాస్ నెంబర్ సాంగ్స్ తో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో మా 18 f టీం సమీక్ష లోకి వెళ్లి చదువుదామా !.
కధ ను పరిశీలిస్తే (story line):
మాస్ రాజా రవితేజా (ఆనంద్) గా, (స్వామి) గా డ్యుయల్ రోల్ లో నటించారు. సచిన్ ఖేద్కర్ మరియు తులసి ల కుమారుడు రవితేజ (ఆనంద్) బిజినెస్ మ్యాన్ గా, తనికెళ్ళ భరణి మరియు సంధ్య ల కుమారుడు రవితేజ (స్వామీ) కామన్ మ్యాన్ గా సినిమాలో కనిపిస్తారు. శ్రీలీల (ప్రణవి) రావు రమేష్ కి కూతురు గా నటించింది. అనుకోని పరిచయం లో తనకు ప్రపోజ్ చేసిన కామన్ మెన్ స్వామి కి ఓకే చెప్పేలోగా, తన తండ్రి బిజినెస్ మెన్ ఆనంద్ ను పరిచయం చేస్తాడు.
విలన్ జయరామ్ (jp orbit owner) నెగటివ్ షేడ్స్ లో ఆలోచిస్తూ తన కొడుకు పుట్టిన రోజుకి వివేక్ చక్రవర్తి కంపనీ అయిన పీపుల్స్ మార్ట్ ని గిఫ్ట్ గా ఇస్తాను అంటాడు. జయరాం ఆలోచనలు ప్రవర్తన వివేక్ చక్రవర్తి ( సచిన్ ఖేద్కర్) యొక్క పీపుల్ మార్ట్ కంపెనీ ని ఎలా సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.
జయరామ్ సచిన్ ఖేద్కర్ కంపెనీ ను దక్కించుకుంటారా?
దాన్ని అడ్డుకోవడానికి ఆనంద్ చక్రవర్తి (రవితేజ) ఏం చేశాడు?
శ్రీ లీల ప్రేమించింది ఎవరిని ? ఎవరి ప్రేమ లో నిజాయితీ ఉంది ?
బిజినెస్ మెన్ కి ఓకే చెబుతుందా ? కామన్మెన్ కి ఒకే చెప్పిందా ?
ఆనంద్ కి స్వామి కి ఉన్న సంబంధమ్ ఏమిటి ?
ఇప్పటి వరకూ సాఫ్ట్ పర్సన్ గా కనిపించిన జయరాం విలనిజం ఎలా ఉంది ?
లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే రవితేజ ధమకా వెండితెర పై సినిమా చూడాల్సిందే.
నటి నటుల, దర్శకుడు ప్రతిభ పరిసిసలిస్తే:
ధమాకా మూవీ కి ముందుగా ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది హీరో రవితేజనే. ఓక కేరెక్టర్ తో క్లాస్ గా మాస్ గా రెండు పాత్రలు చేస్తూ సినిమాను మొదటి నుండి చివరి వరకు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆక్ట్టుకున్నాడు. డైరెక్టర్ తను చూపించాలి అనుకొన్న మాస్ రాజా ను చాలా క్లియర్ గా చూపించారు.
కథ ను మొదటి నుండి చివరి వరకు రవితేజ లొని ఎనర్జీ తోనే కామన్ మెన్ కి ఎంటర్ టైన్మెంట్ డోరేకెలా చాలా బాగా హ్యాండిల్ చేశారు.
ధమాకా సినిమాలో శ్రీలీల కి మాస్ రాజాకి క్లాస్ రాజాకి జోడీగా ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. శ్రీలీల నటన సినిమాలో ఆకుట్టుకొనేలా ఉంది. తాను తెలుగు లో మొదటి సినిమా పెళ్లి సందd కంటే ఈ రవండో సినిమాలో డాన్స్ మరియు మాస్ రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది. శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అందం గా కనిపిస్తూనే, హీరో రవితేజ పక్కన అద్దిరిపొయే మాస్ స్టెప్పులు వేసింది.
సినిమా కి మరొక ప్లస్ పాయింట్ మ్యూజిక్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా కి మాస్ లుక్ ఫీల్ క్రియేట్ చేశాయి.
సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేద్ఖర్, జయరామ్, హైపర్ ఆది, ప్రవీణ్, పవిత్రా లోకేష్, తులసి, ఇతరుల నటన ఆకట్టుకుంది. సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ చాలా ప్లస్ అయ్యాయి.
కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):
ధమాకా సినిమా మాస్ వే లో ఇంట్రెస్టింగ్ గా సాగిన స్క్రీన్ ప్లే లో ఉన్న కొన్ని సీన్స్ చాలా పేలవంగా ఉన్నాయి. కొన్ని చోట్ల బెడిసి కొట్టింది. రెండవ అంకం ( సెకండ్ హాఫ్) లో కథ కొంచెం సీరియస్ గా సాగే టైమ్ లో లాజిక్ లేకుండా పాత హిట్ ఫ్లాప్ సినిమాల సీన్స్ రీ రైట్ చేసి కొత్తగా వ్రాసినట్టు సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్ లో స్టోరీ చెప్పే విధానం లో కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది.
మరి కొన్ని సీన్స్ ( సన్నివేశాల) కి సీన్స్ కి కనెక్టివిటీ అనేది క్లియర్ గా కనిపించదు. జయరామ్ ను నెగటివ్ రోల్ లో చూపించడమ్ కోసం అవసరం లేని హత్య డైలాగులు మరి దారుణంగా ఉన్నాయి. మిగతా పాత్రలు సినిమా ఫ్లో లో వెళ్లిపోతాయి. ఇంకొన్ని సన్నివేశాలు చాలా బాగా ఎమోషనల్ గా తీసే అవకాశం ఉన్న దర్శక రచయితలు రవితేజ ఎనర్జీ తో స్క్రీన్ ప్లే రాసి తియ్యడం వలన పలితం వేరేలా ఉండే అవకాశం ఉంది.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
ధమాకా సినిమా కి కథ కధనం లో ఏమి చెప్పాలి అనుకున్నారోకానీ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తాను రవితేజ మాస్ ఇమేజ్ తో దాదాపుగా విజయం సాధించారు. నటీనటుల నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టడం లో ముక్యంగా రావు రమేష్స, ఆది, జయరాం నుండి మంచి నటన రాబట్టి సక్సెస్ అయ్యారు. టెక్నికల్ టీం లో సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బీన్స్ పాటలు ఆల్రెడీ మంచి ఊపుమీద ఉన్నాయి.
కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ పరవాలేదు కానీ కలర్ ఫెడ్ అయ్యి గ్రే కలర్ లో కొంచెం ఎబ్బాట్టిగా కనిపించింది . ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి.
18f మూవీస్ టీం ఒపీనియన్:
ధమాకా మొత్తంగా చూస్తే మాస్ మహారాజా ఈ చిత్రం తో మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చేలా ఉన్నా చూడాలి తెలుగు ఆడియన్స్ మూడ్ ఎలాఉంది అనేది వీక్ డే సోమవారం నుండి తెలిసిపోతుంది. ఓవరాల్ గా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ తో క్లాస్ మరియు మాస్ ఆడియెన్స్ ను ధమాకా ఆకట్టుకుంటుంది.
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శ్రీలీల గ్లామర్, అలాగే సినిమాలో కామెడీ, పంచ్ డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కొన్ని లాజిక్ లేకుండా వచ్చే సన్నివేశాలు, ల్యాగ్ ను పట్టించుకోకపోతే ఈ వారాంతం సినిమాను థియేటర్ల లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
టాగ్ లైన్: కధ లేని మాస్ బ్రాండ్ క్రేకర్స్ ధమాకా..
18 f Movies రేటింగ్: 2.75 / 5
* కృష్ణ ప్రగడ.