DEVIL Movie Release postponed: కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ విడుదల వాయదా కి కారణం ఇదేనా !

devil kalyan e1698828021782

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, అభిషేక్ నామా  తెరకెక్కుస్తున్న చిత్రం పిరియాడిక్ చిత్రం డెవిల్ (Devil). ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు. అనివార్య కారణాల వలన అభిషేక్ నామా నే దర్శకత్వం వహించ వలసింది.

డెవిల్ మూవీ టీం పంపిన న్యూస్ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నాము. కొత్త డేట్ త్వరలోనే ఎనన్స్ చేస్తాము అని ప్రకటన విడుదల చేశారు. ఒరిజినల్ గా ఈ డెవిల్ చిత్రాన్ని నవంబర్ 24, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

devil nama e1698828054447

అయితే పలు సాంకేతిక కారణాల వలన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇదే మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ (Animal) చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.
రణబీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ (Animal) మూవీ డిసెంబర్ 1 న రిలీస్ అవుతుంది. ఆ చిత్ర BGM లో బిజీ గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్, డెవిల్ చిత్రానికి పూర్తిగా టైమ్ కేతంచయిలేక పోతున్నారు. అందుకే డెవిల్ మూవీ ని అభిషేక్ పిక్చర్స్ పోస్ట్ పోనే చేసినట్టుగా ఇన్శైడ్ టాక్.
devil glimps
 సక్సెస్ సినిమాలతో స్పీడ్ మీద ఉన్న సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ తో రెండవ సారీ ఈ డెవిల్ సినిమా లో  లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇప్పటికే విడుదల ఐన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టిజర్ ఈ డెవిల్ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
అలాగే బింబిసార హిట్ పెయిర్ కళ్యాణ్ రామ్ – సంయుక్త మీనన్ కలిసి నటించడం కూడా అంచనాలను పెంచేసింది.  చూద్దాం మరో మంచి డేట్ చూసుకొని డెవిల్ వచ్చి హిట్ కోడతాడేమో.. !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *