*అభిమానులకు దేవరశాంటా ఫ్రీ వెకేషన్ గిఫ్ట్ ఇవ్వనున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ* 

SAVE 20221226 122218 e1672050551157

 

న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరుతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అభిమానులకు ఒక్కో సంవత్సరం ఒక్కో బహుమతి ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచం లో ఏ హీరో చేయని విధంగా చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది కూడా మరో సరికొత్త ఆలోచనతో దేవరశాంటాగా ముందుకొచ్చారు విజయ్.

SAVE 20221226 122225

100 మంది అభిమానులను ఫ్రీ హాలీడే టూర్ కు పంపించబోతున్నారు. దేవరశాంటా యాష్ ట్యాగ్ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వందమంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వెకేషన్ పంపించబోతున్నారు. ఇందుకు నాలుగు ఆప్షన్స్ విజయ్ సూచించారు.

మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా…ఇలా ఈ నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడికి టూర్ కు వెళ్లాలన్నా విజయ్ దేవరకొండ పూర్తిగా ఉచితంగా పంపించబోతున్నారు.

SAVE 20221226 122240

ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్ కు పంపించలేదు. సెలవుల్లో ఏదైనా టూర్ కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు దేవరశాంటా ఆలోచనను ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *