దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న చిత్రం దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుస్తున్న ఈ లేటెస్ట్ పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ మాస్ యాక్షన్ మూవీ ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుపుకొంటుంది.
యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం ఆవుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా ప్రస్తుతం మొదటి భాగం ఫైనల్ ఎపిసోడ్స్ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకొన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ దేవర (DEVARA Movie)మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీలో ఎన్టీఆర్ లీడ్ రోల్ చేస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం విశయం ఏంటంటే , ఈ మూవీ నుండి తంగం పాత్రలో కనిపించనున్న హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు.
చక్కగా తెలుగింటి అమ్మాయి లా, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లంగా ఓణీ తో జాన్వీ కపూర్ నాచురల్ గా మెరిసిపోతుంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు దర్శకుడు కొరటాల శివ చెప్పినట్టుగా దేవర మొదటి భాగం 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 4న పలు ఇండియన్ భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే.