Devara Movie Review & Rating: జూనియర్ సినీ అభిమానులను కూడా ఆకట్టుకోని దేవర కధనం !

devara review by 18fms 11 e1727540714735

చిత్రం: దేవర పార్ట్ -1 ,

విడుదల తేదీ : 27 -09 – 2024

నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు…,
దర్శకుడు : కొరటాల శివ,

నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్,

సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్,

సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు,

మూవీ: దేవర మూవీ రివ్యూ  (Devara Movie Review) 

జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ కథానాయిక గా ,సైఫ్ అలీఖాన్‌, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం, అత్యాదిక బడ్జెట్ తో ప్రముఖ కధ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎమోషనల్ డ్రామా గా నిర్మించబడిన  భారీ చిత్రం ‘దేవర’ పార్ట్ – 1 భారీ  అంచనాల నడుమ ఈ శుక్ర వారం రోజు థియేటర్లలో విడుదలైంది.

ప్రమోషనల్ కంటెంట్ తోనే సామాన్య సినీ ప్రేక్షకులను ఆకాశం ఎత్తుకి తీసుకెళ్ళి అదే రీతిలో ప్రవాస భారతీయుల , తెలుగు  రాష్ట్ర ప్రభుత్వాల  సహకారం తో అధిక రేట్స్ , మిడ్నైట్ షోలతో అత్యధిక కలెక్షన్స్ సాదించాలి అని విడుదల చేశారు.  మరి ఈ దే వర చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం  సమీక్ష చదివి తెలుసుకొందామా !

Devara review by 18fms 3

కధ పరిశీలిస్తే (Story Line): 

ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లోని రత్నగిరి ప్రాంతంలోని ఎర్ర సముద్రానికి అనుకొన్న కొండమీద నాలుగు గ్రామాలు ఉంటాయి. తమ జీవనోపాధి కోసం అధిక ఆధాయనికి ఆశ పడి, ఇల్లీగల్ ఆర్మ్స్ వ్యాపారం చేసే మురుగ (మురళీ శర్మ) కోసం పని చేయడం మొదలు పెడతారు. కార్గో షిప్పుల్లో అక్రమంగా వచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కంట పడకుండా ఒడ్డుకు తెచ్చి మురుగ కి ఇస్తుంటారు.

తాము తీసుకొచ్చిన వస్తువలు  వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసి మురుగ కోసం పని చేయకూడదని దేవర (ఎన్టీఆర్) నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయాన్ని బైరా (సైఫ్ అలీ ఖాన్)  వ్యతిరేకించినా, ఎర్ర సముద్రంలో దేవర ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు అని తెలుసుకొని, సమయం కోసం ఎదురుచూస్తూ మౌనంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మిగిలిన ఊర్ల నాయకుల సహకారం తో  దేవర ప్రాణం తీయడానికి ప్లాన్ వేస్తాడు బైరా (సైఫ్ అలీ ఖాన్).

ఆ తర్వాత దేవర కొన్ని నాటకీయ పరిణామాలలో ఎర్ర సముద్రం ఊరి నుండి  మాయం అవుతూ  ఒక భయాన్ని సృష్టిస్తాడు. తర్వాత దేవర కొడుకు వర పెద్దవాడు అయ్యి భయం భయం గానే ఎర్ర సముద్రంలో జీవనం సాగిస్తుంటాడు. దేవర సృష్టించిన భయాన్ని, దేవర ని చంపడం కోసం, భైరా తన మనుషులతో  ఎదురుచూస్తూ ఉంటాడు.

‘దేవర’ను చంపడం కోసం బైరా ఏం చేశాడు?,

‘దేవర కు బైరా మధ్య వైరం రావడానికి కారణం ఏమిటి ? 

దేవర ఎవరకి కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి?

ఎర్ర సముద్రం మీదకు స్మగ్లింగ్ కోసం వెళ్లడానికి భయపడేంతగా దేవర ఏం చేశాడు?

దేవర కొడుకు వర (యంగ్ ఎన్టీఆర్‌ పాత్ర) భయానికి కారణం ఏమిటి ?,

 సింగప్ప (శ్రీకాంత్), అతని కుమార్తె తంగం (జాన్వీ కపూర్) పాత్రలు ఏమిటి?,

వరతో తంగం (జాన్వీ కపూర్) ప్రేమ కథ ఎలా సాగింది?

చివరకు దేవర కథ ఎలా ముగిసింది ?, దేవర కోసం వర ఏం చేశాడు?

 చివరకు కధకుడు ఏమి చెప్పాలనుకొన్నాడు? అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే దేవర పార్ట్ -1  సినిమా మీ దగ్గరలొని థియేటర్ కి వెళ్ళి చూడండి.

Devara review by 18fms 2

 

కధనం పరిశీలిస్తే (Screen – Play):

బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు కొరటాల శివ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు.

Devara review by 18fms11 e1727509794127

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

కొరటాల శివ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేయలేక పోయాడు. చిన్న కల్పిత కధని అతి పెద్ద స్పాన్ లో చెప్పాలని ఎన్నో పాత్రలు ఇరికించి  ఒక్క పాత్రకి న్యాయం చేయలేక పోయాడు. బలమైన వైవిధ్యమైన పాత్ర ఏదైనా ఉంది అంటే అది దేవర పాత్ర మాత్రమే. కధ కు తగ్గ  కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.

ఒక కధని రెండు పార్టులుగా మరియు విజువల్ వండర్ గా చూపించాలనే ప్రయత్నం లో సన్నివేశాల మద్య కోర్ ఎమోషన్ ని వదిలేశారు. ప్రకాష్ రాజ్ కధ చెప్పడం, పార్ట్ 1 ముగింపు సీన్, కంటైనర్ ల దొంగతనం, జాన్వి పాత్ర స్వాభావం గతం లో వచ్చిన హిట్ సినిమా ల సన్నివేశాలను గుర్తి చేసేలా ఉన్నాయి. కొన్ని వందల కోట్లు బడ్జెట్, కొన్ని సంవత్స రాలు టైమ్ తీసుకొని ఒరిజినల్ సీన్స్ డిజైన్ చేసుకోవాలి కానీ, ఇలా తెలుగులోనే హిట్ అయిన సినిమాల సీన్స్ తో ఇన్స్పైర్ అయ్యి టాప్ హీరో తో సినిమా తీయడం ఏమనాలి !.

ఎన్టీఆర్‌ దేవర,వర (వరద) పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. దేవర లో  ద్విపాత్రాభినయం తో  తారక్ అభినయం బాగుంది. రెండు పాత్రల మద్య రూపం లో ఒకేలా ఉన్నా నటన తో వెరీయేషన్ చూపించాడు. దేవర పాత్రలో  ‘ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తి’గా నటించిన విధానం, నిజంగా ఆ స్థాయిలోనే ఉంది.

ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలా లేకపోయినా, భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో కొంతవరకూ బాగుంది.

Devara review by 18fms 8 e1727509818266

హీరోయిన్ జాన్వీకపూర్‌ దేవర’తో తెలుగు తెరకు పరిచయం అయిన ‘తంగమ్మ ’ పాత్ర చాలా చిన్నదే అయినా ఉన్నంతలో బాగా నటించింది. థియేటర్ బయట ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.. జాన్వి పాత్ర ఎలాఉంది అంటే కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర అని వర్ణించాడు.

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూడా ‘భైర’ పాత్రలో జీవించాడు. సైఫ్‌ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ పాత్రకు దీటుగా ఆయన పాత్రను కధకుడు కొరటాల శివ తీర్చిదిద్దారు. మిడిల్ ఏజ్, కొంచెం ఎజిడ్ పర్సన్ లా రెండు లుక్స్ లో వైవిద్యంగా నటించాడు.

మరాఠీ నటి శ్రుతి మరాఠే చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది.

తాళ్ళూరి రాజేశ్వరి గారు కూడా మంచి పాత్రలో నటించి మెప్పించారు.

శ్రీకాంత్, ప్రకాష్ రాజ్,మురళి శర్మ, షైన్ టామ్ చాకో, అజయ్ మరియు మిగిలిన నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించి అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

Devara review by 18fms10 e1727509845904

 

 

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

 సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌.రత్నవేలు దేవర కోసం అందించిన సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను కథాకథనాలకు అనుగుణంగా కాకపోయినా విజువల్ వండర్ గా అద్భుతంగా చిత్రీకరించారు.

శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మొదటి అంకం, రెండవ అంకం లో కూడా చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఎమోషన్ క్యారి చేయని అలాంటి సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే యన్టిర్ అభిమనులైనా కాలర్ ఎగరేసేవారు.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన పాటలు వినడానికి బాగున్నా థియేటర్ లో మాత్రం గందరగోళంగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ ప్రాబ్లం నా, లేక కొరియోగ్రఫీ ప్రాబ్లం నా అర్దం కాలేదు. డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది. ఇక నేపథ్య సంగీతం (BGM) కొంత వరకూ పరవాలేదు.

కొరటాల శివ గత సినిమాల మిర్చి , శ్రీమంతుడు, జనతా గారేజ్ భారత్ అనే నేను సినిమా ల హిట్ కు మెయిన్ కారణం సాంగ్స్. అలాంటి మంచి ట్యూన్ ఉన్న సాంగ్ ఒక్కటి దేవర లో లేకపోవడం నిరాశే !

 నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ముక్యంగా 1980-90 ల కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. కీలక సన్నివేశాల్లోని కలర్‌ టోన్‌ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సస్పెన్స్‌ బాగుంది.

Devara review by 18fms 4

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

 దేవర సినిమా ను తగినంత సమయం తో అత్యధిక బడ్జెట్ తో విజువల్ వండర్ గా నిర్మించే  ప్రయత్నం మంచిదే అయినా థియేటర్ లో 400, 500 రూపాయులు ఖర్చు పెట్టుకొని చూసే సామాన్య ప్రేక్షకుడిని మెప్పించాలి అంటే అంతకు మించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా ఉండాలి.

బాహుబలి బ్రమలో పడి !

దేవర పార్ట్ 2 కోసం, పార్ట్ -1 లో సీన్స్ ని గాలికి వదిలేశారా !. మొదటి పార్ట్ ని ఫాన్స్ కి వదిలి రెండవ పార్ట్ లో అసలైన ఎమోషనల్ డ్రామా చూపిద్దాము అని  అనుకొన్నారా !. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కానీ, ఈ మద్య తెలుగు ఫిల్మ్ క్రియేటర్స్ పాన్ ఇండియా ఉచ్చులో పడి  రాసుకొన్న మంచి కధలను గ్రాండియర్ గా చేద్దాం అని బడ్జెట్లు పెంచి, అవసరానికి మించి పర భాషా నటి నటులను దిగుమతి చేసుకొని సామాన్య తెలుగు సినిమా ఫ్లేవర్ ని ఫ్లవర్ గా మార్చుతున్నారు.

నటుల నటన ని ఎలా వాడాలి ? 

ఎన్టీఆర్ లాంటి పవర్ ఫుల్ నటడిని 50 నుండి 100 కోట్ల రూపాయుల రెమ్యూలేషన్ ఇచ్చి తెచ్చుకొన్నప్పుడు ఎలాంటి కధ – కధనం ఉండాలి ?.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు ఆరంగేట్రం అంటూ ప్రచారం చేసుకొని అత్యధిక రెమ్యూలేషన్  ఇచ్చిన దర్శకుడు ఎలా  వాడుకోవాలి, ఎలా చూపించాలి ?, ఈ దేవర పార్ట్ -1 లో ఎలా చూపించాడు !.

పాత్రల పరిది చిన్నది అయినా, పెద్ద -పర భాషా నటులను తీసుకోవడం దేనికొసం ! వ్యాపార విస్తరణ కోసమా ! సినిమా అంటే వ్యాపారమే కానీ, మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడే ప్రేక్షకుల మెప్పుతో పాటు కలెక్షన్స్ కూడా వస్తాయి. లేకపోతే ఫెక్ కలెక్షన్స్ తో పోస్టర్స్ వేసి తమకు అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవలసి వస్తుంది.

Devara review by 18fms

తప్పు ఎవరిది ?

టికెట్ రెట్లు, షోలు పెంచుకొని అత్యధిక వసూళ్లు అంటూ భాకా వహించుకోవడం తప్ప సామాన్య జూనియర్ ఫాన్స్ కి ఏమి ఇచ్చారు. ఇక్కడ కూడా మిడ్ నైట్ షోలు చూసిన కొందఉ హార్డ్ కోర్ ఫాన్స్ కూడా అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.. నిద్ర బొక్క, డబ్బులు బొక్క అని మొఖం చూపించడానికి ఇష్ట పడని అభిమానుల పరిస్థితి ఏమిటి ?

ఐతే, ఎన్టీఆర్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ దేవర సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో నిలబెట్టాడు అని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ దేవర చిత్రం ఎన్టీఆర్ వీర అభిమానులతో పాటు యాక్షన్ డ్రామా చిత్రాలు ఇష్ట పడే ప్రేక్షకులను అలరిస్తుంది.

Devara review by 18fms 6

 

చివరి మాట: యాక్షన్ తప్ప ఎమోషన్ లేని దే-వర పార్టు 1 !

18F RATING: 2.5  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *