చిత్రం: డిమోంటీ కాలనీ2
విడుదల తేదీ : ఆగస్టు 23, 2024,
నటీనటులు: అరుళ్నితి, ప్రియా భవానీశంకర్, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్..,
దర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తు,
నిర్మాతలు : విజయసుబ్రమణియన్, ఆర్సి రాజ్‌కుమార్,
సంగీత దర్శకుడు: సామ్ సిఎస్,
సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్,
ఎడిటర్ : కుమారేష్ డి.
మూవీ: డిమోంటీ కాలనీ2 రివ్యూ (DemonteColony2 Movie Review)
గత వారం తమిళంలో విడుదల అయ్యి మంచి హిట్ టాక్ పొందిన హర్రర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 2 తెలుగులోకి డబ్ చేయబడి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2015 లో ఎలాంటి అంచనాలు లేకుండా డిమోంటి కాలనీ వచ్చి తమిళ సినీ లవర్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోంది. ఇప్పుడు అదే దర్శకుడు హీరో కలిసి మరలా డిమోంటి కాలనీ 2 అంటూ మరో కధ తో వచ్చారు.
రిలీజ్ కి మూడు రోజుల ముందునుండే ప్రీమియర్స్ తో తెలుగు మీడియా కు, కొందరి ప్రేక్షకులకు పరిచయం అయ్యి, ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల అందరి ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ సమీక్ష చదివి తెలుసుకొందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
డెబ్బీ (ప్రియా భవానీ శంకర్) తన ప్రేమికుడు శామ్యూల్ రిచర్డ్ అలియాస్ సామ్ (సర్జానో ఖలీద్) విషాదకరమైన ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలని నిశ్చయించుకుంది. దావోషి (త్సెరింగ్ దోర్జీ) మార్గదర్శకత్వంతో, ఆమె సామ్ యొక్క ఆత్మను సంప్రదించే ప్రయత్నం లో కొన్ని ఆశక్తికర విషయాలు తెలుస్తాయి.
చిన్నప్పుడే విడిపోయిన కవల సోదరులు శ్రీని మరియు రఘు (అరుళ్ నిధి) ల మధ్య ఆశ్చర్యకరమైన సంబంధాన్ని మెరుగుపరచడం కోసం ఆత్మల కధ రఘు కి చెప్తుంది. ఈ క్రమంలో డెబ్బీ కొన్ని విషయాలను తెలుసుకుంటుంది. ఆమె శపించబడిన పుస్తకం, అన్సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్డమ్ మరియు ప్రతి ఆరు సంవత్సరాలకు పునరావృతమయ్యే దుర్మార్గపు శాపం ఉనికిని వెలికితీస్తుంది.
తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న ఆమె ఈ శాపాన్ని ఛేదించడానికి, ఒక మార్గాన్ని వెతకడానికి కొందరి సహాయం అవశ్యం అవుతుంది.
ఈ ఆత్మల కథ డిమోంటి కాలనీకి ఎలా కనెక్ట్ అవుతుంది?,
డెబ్బీ ప్రేమికుడు శామ్యూల్ రిచర్డ్ మద్య సంబంధం ఏమిటి ?
శామ్యూల్ రిచర్డ్ హాత్మా హత్య కు పేరేపించిన వారు ఎవరు ?,
బలిధానాలు కోరుకొంటున్న ఆ పుస్తకం ఎక్కడ ఉంది?,
డెబ్బీ, కవల సోదరులను ఎందుకు రక్షించలనుకొంటుంది ?,
డెబ్బీ సాహసానికి రఘు ఎంతవరకూ సహాయం చేశాడు ?,
వంటి ఆసక్తికర సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఈ ఉత్కంఠభరితమైన ఆత్మల అన్వేషణ సాహస ప్రయాణంలో ఊహించని ట్విస్టులతో పాటు సమాధానాలు ఇందులో ఉన్నాయి.
అవి పూర్తిగా తెలుసుకోడానికి ఈ డిమోంటి కాలనీ 2 సినిమాను థియేటర్స్ లో తప్పక చూడాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
డిమోంటి కాలనీ మొదటి పార్టు చూడని ప్రేక్షకులను ఈ రెండవ పార్టు యొక్క నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే గందరగోళానికి గురి చేస్తుంది. ఈ సంక్లిష్టత కారణంగా సినిమా పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ విజువల్ ఎఫెక్ట్స్ , సౌండ్ డిజైన్ మాత్రం కథలో లీనమయ్యే విధంగా కధనం నడపడం దర్శకుడి ప్రతిభ అని చెప్పవచ్చు.
కొన్ని సీన్స్ లో మాత్రం ప్రేక్షకులను భయపెట్టాలనే ఉద్దేశం తో కధనం (స్క్రీన్ – ప్లే) రాసుకొని ఎఫ్ఫెక్ట్స్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని పాత్రలు, ముఖ్యంగా అరుణ్ పాండియన్ మరియు కళాశాల విద్యార్థుల సీన్స్ మరింత ఎఫెక్టివ్ గా మార్చే అవకాశం వాదులు కొన్నట్టు అనిపించింది.
అంతేకాక రెండవ అంకం (సెకండాఫ్) లో వచ్చే కొన్ని సన్నివేశాలు కథ కధనానికి అడ్డంకిగా మారతాయి. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే కథ మరింత ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉండేది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం బాగుంది. కథను డీల్ చేసిన విధానం, ప్రీక్వెల్ కి సినిమాను కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అజయ్ జ్ఞానముత్తు, వెంకీ వేణుగోపాల్ మరియు రాజవేల్ స్క్రీన్ ప్లే, సినిమా సస్పెన్స్ టోన్‌ని ఎఫెక్టివ్‌గా మెయింటైన్ చేస్తూ చక్కటి నిర్మాణాన్ని అందించింది.
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డిమోంటి కాలనీ 2: వెంజియన్స్ ఆఫ్ ది అన్హోలీ తో డిమోంటి కాలనీ కథాంశాన్ని అద్భుతంగా అల్లుకున్నారు. రెండు చిత్రాల కధల మధ్య కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ కనెక్షన్ మొత్తం కథనానికి మరింత డెప్త్ ను కలిగించింది.
ఆద్యంతం సస్పెన్స్ మరియు సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ పై గట్టి పట్టును కొనసాగిస్తూ కధనాన్ని చక్కగా రాసుకొని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు టర్న్ లతో ప్రేక్షకులను కథలో లీనమయ్యేల చేసిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ని అభినందించాలి.
డిమోంటి కాలనీ 2 లో నటుల గురించి చెప్పాలి అంటే ముందుగా..
ప్రియా భవానీ శంకర్ నటన గురించి చెప్పాలి. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ తన అద్భుతమైన సహజ నటనను ప్రదర్శించింది. చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి బాగా ఆకట్టుకుంది. కథను ఎలివేట్ చేసే పాత్రతో చాలా కీలకంగా మారింది.
అరుల్ నిధి తనదైన నటనతో మొదటి పార్ట్ లనే రెండవ పార్టు లో కూడా బాగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా డిమోంటి కాలనీ 2 సినిమా లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. అలానే ప్రియా నటనకు బలమైన సపోర్ట్ ను అందించారు. సినిమాకి ఇతని నటన ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
మిగిలిన పాత్రలలో ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ వంటి వారు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సామ్ సిఎస్ మ్యూజిక్ స్కోర్ డిమోంటి కాలనీ 2 సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ప్రతి సీన్ లోను ప్రేక్షకులకు టెన్షన్ మరియు ఎగ్జైట్మెంట్ను పెంచేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. కొన్ని విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ని కూడా BGM తో న్యాచురల్ లుక్ లో ప్రెసెంట్ చేసిన విధానం బాగుంది.
హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఇంకా బెటర్ గా విజువల్ అప్పీల్‌ని పెంచి హారర్ ఫీల్ క్రియేట్ చేయవచ్చు.
కుమారేష్ డి ఎడిటింగ్ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. CGI వర్క్ మాత్రం ఇంకా బెటర్ గా చేసి ఉంటే సినిమా రిసల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. తెలుగు డబ్బింగ్ కూడా నీట్‌గా ఉండటంతో స్ట్రెయిట్ సినిమా అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
మొదటి పార్ట్ లనే డిమాంటి కాలనీ 2 సినిమా కూడా మొదటి నుండి చివరి వరకు థియేటర్ లో ఉన్న ప్రేక్షకులను డీఫెరెంట్ సౌండ్స్ తో కట్టిపడేసేలా ఉండే గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్. డీమోంటీ కాలనీ మొదటి పార్ట్ సినిమా లోలనే రెండవ పార్ట్ లో కూడా అరుల్ నిధి అద్భుత నటనతో ఆకట్టుకొన్నాడు. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ కూడా బాగుంది.
ఎంచుకొన్న కధ, దాన్ని నడిపిన కధనం, సినిమాను డైరెక్ట్ చేసిన విధానం బాగుండటం వలన థియేటర్ లో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే రెండవ అంకం (సెకండాఫ్) లోని కొన్ని సన్నివేశాలు మరియు విజువల్ ఎఫెక్ట్లు కొంచెం లాజిక్ లేకుండా కేవలం భయపెట్టడం కోసమే అన్నట్టు ఉన్నాయి.
హార్రర్ చిత్రాలను ఇంటెన్సివ్ సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఈ వారాంతం డిమోంటి కాలనీ 2 మిమ్మల్ని అలరిస్తుంది అనడం లో ఎలాంటి సందేశం లేదు. ఈ డిమోంటి కాలనీ 2 చిత్రం మంచి సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్స్ లో మాత్రమే చూడవలసిన సినిమా !