Deepavali Movie Tittle Launched: ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తాజా సినిమా ‘దీపావళి’ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల

IMG 20231109 WA0154 e1699530754503

 

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన  తాజా సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య సమర్పకులు. ఈ చిత్రానికి ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఇది. దీపావళి పండగ సందర్భంగా ఈ శనివారం (నవంబర్ 11న) తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

IMG 20231109 WA0156

”కొట్టు కొట్టు విజిల్ కొట్టు…

బాధలన్నీ పక్కనెట్టు…

వచ్చే వచ్చే దీపావళి

కొట్టు కొట్టు అదరగొట్టు…

పండగంటే ఇంతేనంటూ…

ఇంటికొచ్చే దీపావళి

కమ్ముకువచ్చిన చీకటినంతా తరిమేటట్టునీ

కళ్ళతో రంగుల వెలుగులు చూడరా గంతులు వేస్తూ

పేల్చరా పేల్చు టపాసులే మోతెక్కెట్టూ

ఈ ఊరూ వాడా మొత్తం దద్దరిలెట్టట్టు

తరాజువ్వల్లాగా నవ్వులు పంచుకుంటూ దూసుకెళ్లే జోరేలే దీపావళి”

IMG 20231109 WA0157

అంటూ సాగిన ఈ గీతానికి గోసాల రాంబాబు సాహిత్యం అందించగా… థీసన్ సంగీతం అందించారు. పండగ ప్రత్యేకత తెలిపేలా ఈ పాట సాగింది. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా ‘దీపావళి’ పాటలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘చిట్టి కన్నా…’ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.

IMG 20231109 WA0155

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ‘దీపావళి‘ ప్రీమియర్ షోలు వేశారు. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు పలువురు మీడియా ప్రముఖుల ప్రశంసలు ఈ సినిమా అందుకుంది. సహజత్వానికి దగ్గరగా మానవ సంబంధాలు, అనుబంధాలను హైలైట్ చేస్తూ… భావోద్వేగభరితంగా సినిమా సాగిందని, ముఖ్యంగా తాత – మనవడు, మనవడు – మేక పిల్ల మధ్య సన్నివేశాలు కంటతడి పెట్టించాయని చాలా మంది ప్రశంసించారు. దీపావళి పండక్కి మనవడికి కొత్త దుస్తులు కొని ఇవ్వాలని దేవుడికి మొక్కుకున్న మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతారు. ఆ తర్వాత ఏమైందనేది చిత్రకథ.

 

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : రాంబాబు గోసాల, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, సమర్పణ : కృష్ణ చైతన్య, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *