మూవీ : దీపావళి (Deepavali Review)
విడుదల తేదీ : నవంబర్ 11, 2023
నటీనటులు: పూ రామన్, కాళీ వెంకట్, దీపన్ తదితరులు.
దర్శకుడు : ఆర్ఏ వెంకట్
నిర్మాత: ‘స్రవంతి’ రవి కిశోర్
సంగీతం: థీసన్
ఎడిటర్: జి ఆనంద్
దీపావళి తెలుగు రివ్యూ (Deepavali Movies)
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కిడ చిత్రం తెలుగు లో దీపావళి గా ఈ శుక్రవారమే తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. మరి ఈ దీపావళి చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
శీనయ్య (పూ రామన్) తన మీనమ్మ (పాండియమ్మ), తన మనవడు గణేష్ (దీపన్)తో ఊరికి దూరంగా కొండ కింద తన జీవనం సాగిస్తూ ఉంటాడు. వయస్సు పై పడటం వలన ఆదాయం ఎక్కువగా లేకపోవడం వలన కొన్ని ఆర్థిక ఇబ్బందులతో శీనయ్య కష్ట పడుతూ ఉంటాడు. ఇలాంటి స్థితిలో దీపావళి పండుగ సందర్భంగా తన మనవడు అడిగిన కొత్త డ్రెస్ కొని ఇవ్వాలని ఆశ పడతాడు.
ఈ క్రమంలో డబ్బులు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా శీనయ్యకి ఎవరూ అప్పు ఇవ్వరు. చేసేది లేక ఎప్పుడో దేవుడికి మొక్కుకుని, మనవడు గణేష్ ప్రాణంగా ప్రేమించే మేక ను అమ్మైనా దీపావళి పండక్కి మనవాడికి కొత్త బట్టలు కోనాలి అని నిర్ణయించుకొంటాడు. కానీ కొన్ని అనుకోకుండా జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో..
మేకను అమ్మడం ఇష్టం లేని గణేష్ ఏం చేశాడు ?,
ఇంతకీ శీనయ్య మేకను అమ్మాడా ? లేదా ?,
చివరకు, ఈ కథ ఎలా ముగిసింది ?
గణేష్ తల్లిదండ్రులు ఏమయ్యారు ?
అనే ప్రశ్నలకు ఇచ్చిన ఇచ్చిన జవాబులే మిగిలిన కధ ..!
కధనం పరిశీలిస్తే (Screen – Play) :
దీపావళి సినిమా కధ గా తీసుకొన్న పాయింట్ లో మంచి హ్యూమన్ ఎమోషనల్ డ్రామా ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగినట్టుగా కధనం ( స్క్రీన్ ప్లే) ను రాసుకోవడంలో దర్శక రచయిత ఆర్ఏ వెంకట్ కొద్దిగా నిరాశ పరచినట్టు అనిపిస్తుంది.
రాసికొన్న కధనం (స్క్రీన్ ప్లే) లో ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సీన్ ఒక్కటి కూడా లేదు అనిపిస్తుంది. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా కథనం లో క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ పెంచుతూ పోవాలి. కానీ, ఈ కథ యొక్క కధనం లో వచ్చే సీన్స్ లో తర్వాత రాబోయే సీన్ ఏమిటి అనేది సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి క్లారిటీగా అర్ధం అయిపోతుంది. అందువలన ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతూ అంతేనా అన్నట్టు సాగిపోయింది.
ముఖ్యంగా మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) కంటే రెండవ అంకం (సెకండ్ హాఫ్)లో సినిమా మీద ఇంటరెస్ట్ పెరగాలి. కానీ, ఈ సినిమాలో అది కూడా మిస్ అయింది. కథలో టెంపో పెంచకుండా సినిమాని సాగదీస్తూ వెరీ రెగ్యులర్ క్లైమాక్స్ తో ముగించారు. ఇక డబ్బింగ్ డైలాగ్స్ లో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొనే మంచి డైలాగ్స్ ఏపీ లేవు.
కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సింపుల్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా దర్శకుడు ఆర్ఏ వెంకట్ మంచి మెసేజ్ అండ్ ఎమోషన్ అయితే పండించాడు గానీ, కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
‘
దర్శకుడు ఆర్ఏ వెంకట్ దీపావళి పండగకి చిన్నపిల్లల ఆట – పాటలతో పాటు కొత్త బట్టలు కొనుక్కొనే పాయింట్ ని, తాతా -మనవల సంభంధాలను సినిమా కధ గా తీసుకొన్న పాయింట్ చాలా బాగుంది. ఈ పాయింట్ తో మంచి హ్యూమన్ ఎమోషనల్ డ్రామా తీసినా అవార్డు సినిమా గానే ఉంటుంది కానీ కమర్శ్సియల్ సక్సెస్ అనేది కస్టం.
దీపావళి కథలోని సహజత్వం, వాస్తవిక దృక్పథంతో సాగిన పాత్రల చిత్రీకరణ, అలాగే నటీనటుల నటన ఈ సినిమాలో చాలా బాగా ఆకట్టుకున్నాయి. అందుకే జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.
ప్రధాన పాత్రలో నటించిన పూ రామన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. ఆయన తన బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా మెప్పించాడు. ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ డైలాగ్ డెలివరీతో ఈ పాత్రలోని ఎమోషన్ మరింత బాగా ఎలివెట్ అయ్యింది.
మరో కీలక పాత్రలో నటించిన బాలుడు దీపన్ కూడా చాలా బాగా నటించాడు. ఇక ఈ సినిమాలో కర్రోడు మేక పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన పిల్లాడి పాత్రని బాగా ఎలివేట్ చేశాయి.
అలాగే వీర స్వామి.. ఆ పాత్ర తాలూకు మటన్ కొట్టు బిజినెస్ ప్లాన్ తో పాటు ఫ్యామిలీ పాత్రల మధ్య విబేదాలు, ప్రేమ, అనురాగాలు ఇలా మొత్తానికి ఈ సినిమాలో గుడ్ మెసేజ్ తో పాటు గుడ్ ఎమోషన్ కూడా ఉంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
దీపావళి సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా థీసన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటింగ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత స్రవంతి రవికిషోర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. చాలా షూటింగ్ న్యాచురల్ బాక్ డ్రాప్ లో చేయడం వలన అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
ఈ దీపావళి పండక్కి దీపావళి అంటూ వచ్చిన ఈ చైల్డ్ సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాలో మెయిన్ పాయింట్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ , క్లైమాక్స్ చాలా న్యాచురల్ గా అద్భుతంగా ఉన్నాయి. అయితే,స్లో నరేసన్ వలన ట్రీట్మెంట్ ముందే తెలిసిపోతుండడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం తో ప్రేక్షకులు కి కొంచెం బోర్ ఫీల్ రావచ్చు. ఐతే, సహజంగా సాగే కథ, కధనం అలానే పాత్రలు ప్రవర్తన మరియు నటన మాత్రం మెప్పిస్తాయి. ఓవరాల్ గా దీపావళి సినిమా బాగున్నా దియేటర్ కలెక్షన్స్ అంతాగా రాకపోవచ్చు. కాకపోతే అందరు చూడవలసిన మంచి మేలో డ్రామా .. !
చివరి మాట: తాతా మనవాళ్ళ ఎమోషనల్ డ్రామా!
18F RATING: 2.75 / 5
* కృష్ణ ప్రగడ.