DAYAA OTT PRE-release: దయా వెబ్ సిరీస్ ఒక సినిమాలా ఆపకుండా చూసేస్తారు – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెబ్ సిరీస్ టీమ్

Dayaa pre release all artist e1691080647994

జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీషన్, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా

dayaa pre release

సినిమాటోగ్రాఫర్ వివేక్ మాట్లాడుతూ – ఈ వెబ్ సిరీస్ కు ఎంతో ఎంజాయ్ చేస్తూ పనిచేశాం. ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టెక్నీషియన్స్ గా మేమంతా ఇంత ఎఫర్ట్ పెట్టి ఔట్ పుట్ ఇచ్చామంటే అందుకు కారణంగా స్క్రిప్ట్. సేనా పతి సినిమా నుంచి దయా వరకు దర్శకుడు పవన్ అన్న రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ప్రతి డిపార్ట్ మెంట్ టాలెంట్ ను బయటకు తీసే వెబ్ సిరీస్ ఇదని చెప్పడానికి గర్వపడుతున్నా. అన్నారు.

dayaa special interview ఆఫ్ jd 7 1

నటుడు జోష్ రవి మాట్లాడుతూ – ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా కాకుండా సక్సెస్ మీట్ లా ఉంది. డైరెక్టర్ పవన్ గారి ప్రతి సినిమాలో నటిస్తూ వస్తున్నాను. ఈ దయాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను నటుడిగా వచ్చిన ప్రతి అవకాశం కాదనకుండా నటిస్తూ వస్తున్నాను. కానీ నటుడిగా పేరు తెచ్చే సినిమా చేయాలని మనసులో ఎప్పుడూ ఉండేది. ఆ డ్రీమ్ ఈ వెబ్ సిరీస్ తో తీరింది. అందుకు పవన్ గారికి థాంక్స్ చెబుతున్నా. ఈషా క్యారెక్టర్ కదిలించేలా ఉంటుంది. జేడీ నా అభిమాన హీరో. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ వివేక్. ఆయన ఎక్స్ లెంట్ విజవల్స్ ఇచ్చారు. అన్నారు.

DAyaa kamal kamaraju speech
నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ – దయాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ ఎంతో స్పెషల్. నా ప్రతి సినిమా సెట్ లో ఈ వెబ్ సిరీస్ గురించే మాట్లాడేవాడిని. ఇతనేంటి ప్రతిసారీ దయా అని చెబుతుంటాడు అని వాళ్లు అనుకుని ఉంటారు. డ్రీమ్ బిగ్ అంటారు. అలా ఆలోచించి ఉండకపోతే దయా వెబ్ సిరీస్ లేదు. ఇందులో ప్రతి లొకేషన్ ఒరిజినల్ గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ జెన్యూన్ గా ఉంటుంది. అన్నారు

Dayaa Gayatri Gupta speech
నటి గాయత్రి గుప్తా మాట్లాడుతూ – డైరెక్టర్ పవన్ తో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఒక షూటింగ్ లో ఉన్నట్లు అనిపించదు. బ్రహ్మానందం మీమ్స్ చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో..పవన్ తన సెట్ ను అంత కూల్ గా, ఫన్ గా ఉంచుతాడు. ప్రేమ్ ఇష్క్ కాదల్ నుంచి దయా వరకు అతను జర్నీ ఇన్సిపిరేషన్ గా ఉంటుంది. కమల్, జోష్ రవి, జేడీ గారు..ఇలా అందరి క్యారెక్టర్స్ బెస్ట్ ఇచ్చారు. అని చెప్పింది.

Dayaa pawan speech
డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ – దయా అనేది ఒక వెబ్ సిరీస్ లా కాదు ఒక సినిమాలా మూడు గంటల పాటు ఆపకుండా చూస్తారు. నేను గ్యారెంటీ ఇస్తున్నా. మీరు ఆపకుండా చూడకపోతే ఫిలింనగర్ లో ఎక్కడ కనిపించినా నన్ను అడగొచ్చు. నా కథల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది అని అంటారు. ఎందుకు ఉండదు. నేను ఇంట్లో అమ్మా, నాన్న ఇద్దరితో కలిసి పెరిగాను. నాన్నతోనే ఉండలేదు కదా. ఈ వెబ్ సిరీస్ లో జేడీ, ఈషా, కమల్, రమ్య, జోష్ రవి.. ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇది అప్ కమింగ్ యాక్టర్స్ కు ఒక గైడ్ లాంటి వెబ్ సిరీస్. కొత్త ఆర్టిస్టులు వీళ్ల పర్మార్మెన్సులు పాఠంలా నేర్చుకోవచ్చు. దయా వెబ్ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ వివేక్ అందించిన విజువల్స్ అసెట్ అవుతాయి. అన్నారు.

Dayaa Esha speech
హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ – ఈ ఫంక్షన్ మాకొక సెలబ్రేషన్ లా అనిపిస్తోంది. దయా స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయగలనా, నన్ను ఈ క్యారెక్టర్ లో ఊహించుకోగలరా అని అనుకున్నాను. దయా తర్వాత ఇకపై ఇలాంటి ఆఫర్సే వస్తాయా అనే భయం కూడా ఉండేది. నేను సిరీస్ మొత్తం చూశాను. చూశాక మేమొక సూపర్ వెబ్ సిరీస్ చేశామని అర్థమైంది. నా క్యారెక్టరే కాదు జేడీ, జోష్ రవి, గాయత్రి, కమల్..ఇలా అందరి క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. ఎవరు ఎంత సేపు స్క్రీన్ మీద ఉన్నారనేది కాదు ఎంత ఇంపాక్ట్ గా నటించారనేది చూస్తారు. అని చెప్పింది.

daya JD speech
హీరో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ – దయా వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ ప్రశ్నలతో ముగుస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవు..ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. దయా కథ ఒక సీజన్ తో ఆగదు, సెకండ్ సీజన్ కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. అలాగే సెకండ్ సీజన్ కు మీరే కథలు ఊహించుకుంటారు. ఈ సిరీస్ లో చివరి సీన్ తో నా ఫస్ట్ సీన్ షూటింగ్ చేశాడు పవన్. ఈ కథ మీద అతనికున్న గ్రిప్ అలాంటిది. నేను అన్ని భాషల్లో మంచి దర్శకులతో పనిచేశాను.

dayaa special interview ఆఫ్ jd 3 1

మా గురువు వర్మ తర్వాత నేను వర్క్ చేసిన బెస్ట్ డైరెక్టర్ పవన్. దయా అంటే పవన్ ..పవన్ అంటే దయా. రేపు ఈ సిరీస్ లో అతని టాలెంట్ చూస్తారు. గాయత్రి, ఈషా క్యారెక్టర్స్ చూస్తే పవన్ కు వుమెన్స్ మీద ఉన్న గౌరవం తెలుస్తుంది. ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచే దయా స్ట్రీమింగ్ మొదలవుతుంది. తప్పకుండా చూడండి. అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర కాస్ట్ అండ్ క్రూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *