DASARA Movie Telugu Review: రా అండ్ రాస్థిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ దసరా

dasara రివ్యూ పోస్టర్ e1680327310633

మూవీ : దసరా 

విడుదల తేదీ : మార్చి 30, 2023

నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్

దర్శకుడు : శ్రీకాంత్ ఓదెల

నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి

సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటర్: నవీన్ నూలి

దసరా సినిమా రివ్యూ (DASARA Movie Review):

నేచురల్ స్టార్ గా పిలవబడే నాని ఇప్పటివరకు నటుడిగా చేసిన సినిమాలు ఒకవైపు ఈ దసరా సినిమా ఒకవైపు.  నాని యాక్టింగ్ కెరియర్ లో దసరా ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోతుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాలలోని సినీ ప్రేక్షకులను కూడా మెప్పించాలి అనే కసి తో నటించిన సినిమా ఈ దసరా.

తన మొదటి  పాన్ ఇండియా సినిమా ఎలా ఉండాలి అనుకొనే టైమ్ లో సింగరేణి నల్ల బంగారం గుట్టల మద్యలో పుట్టి పెరిగిన మణి హరం ఓదెల శ్రీకాంత్ దొరకడం నాని కి ఆదృష్టం. సింగరేణి గనుల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మునుపెన్నడూ లేని విధంగా నాని కష్టపడ్డారు. ఈ ధరణి పాత్ర కోసం కస్ట పడి నటించడమే కాదు, గత నెల రోజులుగా దసరా సినిమా ని తన భుజాలమీద వేసుకొని దేశ నాలుములలోనూ తిరుగుతూ ఈ దసరా సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు.  దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. నాని మొదటి సారి పూర్తిగా రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించారు. టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీ టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కధ ను పరిశీలిస్తే (story line):

తెలంగాణ ప్రాంతం లోని గోదావరిఖని తాలూకు వీర్లపల్లి అనే ఊరిలో ఈ దసరా సినిమా కధ మొదలవుతుంది. ఈ గ్రామానికి చెందిన ధరణి (నాని ) సూర్యం (దీక్షిత్ శెట్టి), వెన్నెల( కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ధరణి (నాని) సూర్యం ఇంకా కొంతమంది స్నేహితులు కలిసి ఆ ఊరు నుండి పోయే బొగ్గు తో పోయే ట్రైన్ బోగీలను దోచుకుంటూ సిల్క్ బార్ లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే ఊర్లో అంగన వాడి టీచర్ గా పని చేసే వెన్నెల  ( కీర్తి సురేష్) ను ధరణి  ప్రాణంగా ఆరాదిస్తూ ప్రేమిస్తుంటాడు. అదే వెన్నెల ను తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సూర్యం (దీక్షిత్ శెట్టి) కూడా  ప్రేమిస్తున్నాడు అని తెలిసి, తన ప్రేమను చంపుకుని వారిద్దర్నీ కలపడానికి ప్రయత్నం చేస్తాడు.

ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామా ఏమిటి ?,

సూర్యం (దీక్షిత్ శెట్టి) కీర్తి పెళ్లి చేసుకొన్నారా ?

సూర్యం కి వచ్చిన ఆపద ఏమిటి ? సూర్యం ఎలా చనిపోయాడు ?,

తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి (నాని) ఎలా పగ తీర్చుకున్నాడు ?,

చివరకు ధరణి (నాని) – వెన్నెల( కీర్తి సురేష్) ఒక్కటి అయ్యారా ? లేదా ?,

సూర్యం – వెన్నెల  మధ్యలో ధరణి (నాని) అనుభవించిన మానసిక వేదన ఏమిటి ?

వెన్నెల కు వచ్చిన కస్టం ఏమిటి ? అనేది మిగిలిన కథ. ఈ ప్రశ్నలు మీకు కొంచం అయిన ఇంటరెస్ట్ కలిగితే దసరా సినిమా తప్పక చూడండి. రంగస్థలం, పుష్ప లఅనే ఈ దసరా సినిమా కూడా విజువల్ వండర్ అని చెప్పవచ్చు.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (screen – Play):

దసరా కధ లోని ధరణి పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం (స్క్రీన్ – ప్లే ) విషయంలో, కథను  పెట్టడంలో మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆకట్టుకోలేకపోయారు. పాత్రల మధ్య ఎమోషన్స్ ను ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు. కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా మిస్ అయ్యాయి. మలుపులు లేని కథనం కూడా కొన్ని చోట్ల నీరసంగా సాగింది.

ఇక సినిమాలో సెకండాఫ్ ఐతే మరీ స్లోగా ఉంది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… చాలా సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. ఈ సినిమా ఓ బార్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు ఎక్కువగా మందు సీన్స్ నే పెట్టారు. సినిమాలో హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు కూడా పూర్తి సినిమాటిక్ గానే సాగాయి. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అండ్ కాన్ ఫ్లిక్ట్ ఇంకా బలంగా ఉండాల్సింది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

శ్రీకాంత్ ఓదెల  సింగరేణి నల్ల బంగారం గుట్టల మద్యలో పుట్టి పెరిగిన మణి హరం ఓదెల శ్రీకాంత్. తన చిన్నప్పటి అనుభవాలను సినిమా కధ గా మార్చుకొని తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల సినీ ప్రేక్షకులు మెచ్చే విధంగా దసరా సినిమా తీర్చు దిద్దడం లో మొదటి ప్రయత్నం లొం సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.

శ్రీకాంత్ ఓదెల కధా రచయితగా కొంచెం  తడబడినా చిత్ర  దర్శకుడిగా మాత్రం  బాగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా దసరా ను తన మొదటి చిత్రంగా తీసినా, సినిమా చూసిన వారికి మాత్రం శ్రీకాంత్ కి  ఫిల్మ్ మేకింగ్ లో ఎంతో అనుభవం ఉంది అనిపిస్తుంది.

యాక్టర్ నాని: ఈ దసరా కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, నాని పాత్రలోని షేడ్స్ ను, కీర్తి సురేష్ తో సాగే లవ్ ట్రాక్ ను, అలాగే గోదావరిఖని పక్కనే ఉన్న వీర్లపల్లి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా శ్రీకాంత్ ఓదెల ప్రతి పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు.

హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో వచ్చిన నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. ధరణి పాత్రకు నాని ప్రాణం పోశారు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో నాని అద్భుతంగా నటించాడు. ధరణి పాత్ర లో నాని  పిరికివాడిలా, పచ్చి తాగుబోతులా చాలా సహజంగా కనిపించాడు. నాని – కీర్తి సురేష్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫ్రెష్ గా ఉంది.

కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా అందంగా నల్ల బంగారం లా వెన్నెల పాత్ర లో మెరిసిపోయింది.  నటన పరంగానూ కీర్తి సురేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది అని చెప్పవచ్చు.

దీక్షిత్ శెట్టి సూర్యం పాత్ర లో  నానికి స్నేహితుడి గా  చాలా బాగా నటించాడు. బాగా మెట్యురిటీ తో చక్కటి నటనతో ఆకట్టుకొన్నాడు. మరో  కీలక పాత్రలో నటించిన షైన్ టామ్ చాకో పర్ఫార్మెన్స్ సెటిల్డ్‌ గా చాలా బాగుంది.

సముద్రఖని దసరా సినిమాలో కొత్తగా కనిపించాడు. తన నట కెరీర్ లో నిలిచిపోయే గెటప్ ఇది. సాయి కుమార్ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

ఎన్నో తమిళ సినిమాల కు అద్భుతమైన ట్యూన్ లు, బీజియం లు ఇచ్చిన  సంతోష్ నారాయణన్ శ్రీకాంత్ ఓదెల మధిలోని పల్లి వాతావరణానికి తెలంగాణ యస లోని ఫోక్ పాటల పదాలకు తన స్వరాలను మిక్స్ చేసి  అందించిన సంగీతం అద్భుతంగా  ఆకట్టుకుంది. ఇంకా సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం (bgm) దసరా సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది.

సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. గ్రాండియర్ విజువల్స్ న్యాచురల్ లొకేషన్ లో ఘాట్ చేసినంత అందంగా చూపించాడు.

నవీన్ నూలి తన ఎడిటింగ్  ఎక్స్పెరియన్స్ తో కొన్ని సీన్స్ హృదయానికి అత్తుకొనెలా  చేశాడు.  సినిమాలోని స్లో సీన్స్ ను ఇంకా ట్రిమ్ చేసి  ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.

నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని పల్లె కధ లా వదిలేయకుండా దర్శకుడు అడిగినవి అన్నీ ఇచ్చి జాతీయ స్థాయి సినిమా గా  భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

18F మూవీస్ టీం ఒపీనియన్:

చిన్న పల్లెలో కొందరి స్నేహితుల మద్యలో కధ గా స్టార్ట్ అయ్యినా, దసరా సినిమా మాత్రం  హై వోల్టేజ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా నిలిచిపోతుంది. ఇప్పటివరకూ నాని ని చూడని గెట్ అప్ లో మరియు యాక్టింగ్ లో చూడవచ్చు.

ఈ సినిమాలో నానితో పాటు వెన్నెల గా కీర్తి సురేష్, సూర్యంగా దక్షిత్ మరియు  మిగిలిన లీడింగ్ ఆర్టిస్ట్ లు అందరూ తమ నటనతో బాగా ఆకట్టుకున్నారు. డిఫరెంట్ షేడ్స్ తో రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో నాని అద్భుతంగా నటించాడు.

అలాగే నేపథ్యం, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. శ్రీకాంత్  కథనంలో (స్క్రీన్ ప్లే )  కొన్నిచోట్ల ఆసక్తి పెంచే అంశాలు ఇంకా ఎమోషనల్ గా రాసుకొని ఉంటే మరో రేంజ్ సినిమా అయ్యేది ఈ దసరా.

ఓవరాల్ గా ఈ సినిమా నాని ఫ్యాన్స్ తో పాటు సినీ  ప్రేక్షకులకు కూడా మంచి సినిమా  అనుభూతిని ఇస్తోంది.

టాగ్ లైన్: రా అండ్ రాస్థిక్ యాక్షన్ ఎంటర్టైనర్    

18f Movies రేటింగ్: 3.75 / 5

* కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *