V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “దర్శిని”.వికాస్.జి.కే , శాంతి హీరో హీరోయిన్లు గా సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా దర్శిని మూవీ టీమ్ కి ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని కలిసి సాంగ్స్, టీజర్ చూపించారు.
ఈ సందర్భంగా మినిస్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ: సాంగ్స్ చూసాను, టీజర్ చూసాను చాలా బాగున్నాయి, సినిమా విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను , టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భం గా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతు: ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించాం అని, ముఖ్యంగా థ్రిల్లర్ ప్రేక్షకులని ఈ చిత్రం బాగా అలరిస్తోంది అని అన్నారు, మా పోస్టర్ లాంచ్ చేసిన మినిస్టర్ గారికి ధన్యవాదాలు అని అన్నారు.
నిర్మాత డా.ఎల్వీ సూర్యం మాట్లాడుతు: ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది, మినిస్టర్ గారి మాటలు మాకు ప్రోత్సాహం వచ్చేలా అయ్యాయి అని అన్నారు.
హీరో వికాస్.జి.కే మాట్లాడుతూ ” కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమా పోస్టర్ లుక్ నుండి, సాంగ్స్, టీజర్ వరకు ప్రేక్షకులకు నచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు,
మినిస్టర్ గారు బిజీ టైమ్ లో సైతం మాకు టైమ్ కేటాయించి మాకు సపోర్ట్ చేశారు మాకు ఇది రెట్టింపు ఉత్సాహన్ని ఇచ్చింది అని అన్నారు. నిజాని అంజన్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.