varasudu pongal release poster

 

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’/ వారిసు చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది.

Vijay new still from Varasudu 3

 ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వారసుడు’ స్టిల్స్ వైరల్ గా మారాయి. ఇలా ఇంకా షూటింగు లో ఉన్న వారసుడు సంక్రాంతి బరిలోకి వస్తాడా ! రాడా అని ట్రేడ్ పండితులు బెట్టింగులకు దిగారు.

Vijay new still from Varasudu 9

ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య, యువ రత్న బాలయ్య బాబు వీర సింహా రెడ్డి, అక్కినేని ఆకిల్  ఏజెంట్ సినిమాలు సంక్రాంతి రిలీజ్ అని అప్పుడే ప్రి రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసేశారు.

vijay new still

వారసుడు ఒరిజినల్ గా తమిళ సినిమా కాబట్టి, విజయ్ తమిళ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ, వారిసు / వారసుడు ప్రోడుకర్స్ యిన దిల్ రాజు పి వి పి లు ఎలాగైనా సంక్రాంతి (తెలుగు / తమిళ ) కి రిలీజ్ చేయాలి అని వంశీ తో స్పీడ్ గా వర్క్ చేయిస్తున్నట్టు సమాచారం.

Vijay new still from Varasudu 7

వారసుడు లో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు.

Vijay new still from Varasudu 8

అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.

Vijay new still from Varasudu 4

2023 సంక్రాంతికి వారసుడు/వారిసు ని విడుదల చేస్తున్నట్లు దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల తో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.

Vijay new still from Varasudu 6

వారసుడు/వారిసు  చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.

Vijay new still from Varasudu 2

భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.

Vijay new still from Varasudu

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.

Vijay new still from Varasudu 5

తారాగణం:

విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
పీఆర్వో: వంశీ-శేఖర్

https://www.youtube.com/watch?v=dq3a8XpWhv0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *