Dakshina Movie Glimps here: సాయి ధన్సిక సైకో థ్రిల్లర్ ‘దక్షిణ’ నుండి గ్లిమ్స్ వచ్చేసింది!

IMG 20231111 WA0055 e1699693673599

 

హీరోయిన్ ఓరియెంటెడ్ నేపథ్యంగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఛార్మీ కౌర్ హీరోయిన్‌గా మంత్ర, మంగళ చిత్రాలకు ఓషో తులసిరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కల్ట్ కాన్సెప్ట్ బ్యానర్‌పై నిర్మాత అశోక్ షిండే దక్షిణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. భారీ స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు.

IMG 20231111 WA0053

సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కాంబినేషన్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది, సాయి ధన్సిక పేరు చెబితే కబాలి మూవీ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెను ‘దక్షిణ’ ఫేమ్ ధన్సిక అంటారు. ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుందని నిర్మాత అశోక్ షిండే అన్నారు.

IMG 20231111 WA0054

హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్‌తో సాయి ధన్సిక ప్రేక్షకులను ఈ సినిమాలో మెప్పిస్తుంది. ఈ చిత్రంలో బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు. ఇదొక సైకో థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *