శరత్ బాబు తనయుడి “దక్ష” సినిమా ఓటీటీలో విడుదల ! 

IMG 20250316 WA02431 e1742140367500

సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ “దక్ష” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు Bcineet OTT, Hungama OTT, మరియు Tollywood Times YouTube ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.

IMG 20250316 WA0241

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ & యాక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ,

“మాకు థియేటర్‌లో మంచి స్పందన లభించినట్లుగానే, ఇప్పుడు విడుదలైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ‘దక్ష’ తప్పకుండా నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. నిర్మాతలకు సహాయపడేలా ప్రతి రూపాయి విలువైనదని భావిస్తున్నాము. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ నమోదుచేశారు,” అని తెలిపారు.

IMG 20250316 WA0236

దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ  “మంచి కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్‌ఫుల్ విజువల్స్ మా సినిమాకి ప్రధాన బలాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది,” అని తెలిపారు.

IMG 20250316 WA0237

ఈ చిత్రంలో ఆయుష్, అఖిల్, అను, నక్షత్ర, రియా, రవి రెడ్డి, శోభన్ బోగరాజు, పవన్ కీలక పాత్రలు పోషించగా, శివ కాకు మాటలు అందించారు. లలిత్ కిరణ్ సంగీతం సమకూర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *