కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో! 

IMG 20250924 WA0480 e1758717596687

హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నేషనల్ బ్రాండ్ అయిన కాన్ప్లెక్స్ సినిమాస్ సౌజన్యం లో  లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

https://x.com/18fMovies/status/1970746540374532160?t=SRM4_DIvCt2fAedQFbbOww&s=19

ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుకుంటున్నాను.  ఈ కార్యక్రమానికి సినీ హీరో సిద్దు, నిర్మాతలు చినబాబు, నాగవంశీ గార్లు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. ‘‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్. థియేటర్ చాలా బాగుంది. స్క్రీన్ చాలా నచ్చింది. ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

IMG 20250924 WA0481

విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను ఈరోజు ప్రారంభించాం. ఇదొక గుజరాత్ బ్రాండ్. దేశ వ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే మొదటి థియేటర్.

 యూఎస్‌లో మాస్టర్స్ చేసిన మేం ముగ్గురం కలిసి ఇక్కడ ఈ థియేటర్‌ను ప్రారంభించాం. ఆడియెన్స్‌కి లగ్జరీ సీటింగ్, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాలని ఈ థియేటర్‌ను ప్రారంభించాం.

ఈ ఏం పి ఎం మాల్ లో మూడు స్క్రీన్ లలో కలిపి 171 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. మరి కొన్ని నెలల్లో రెండు స్క్రీన్లను యాడ్ చేస్తాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాల్లో స్క్రీన్లను ప్రారంభించాలని అనుకుంటున్నాను. అన్ని చిత్రాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోని ఇక్కడ లాంఛ్ చేస్తాము.

పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ మూవీతో మా స్క్రీన్లను ప్రారంభించబోతోన్నాం. అందరూ వచ్చి మా థియేటర్‌ను సందర్శించండి’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *