Color Swathi comes as a Teacher: క‌ల‌ర్స్ స్వాతి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘టీచర్’ !

IMG 20240417 WA0230 scaled e1713353849383

ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది టీచర్‌. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు.

IMG 20240417 WA0248

అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో అసలు సందేహం లేదు.

IMG 20240417 WA0160

ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి వస్తోంది టీచర్‌. ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.

నటీనటులు:

స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:

రచన – దర్శకత్వం: ఆదిత్య హసన్‌, కెమెరా: అజీమ్‌ మహమ్మద్‌, సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్‌ సదాశివుని, ఎడిటర్‌: అరుణ్‌ తాచోత్‌, ఆర్ట్ డైరక్టర్‌: తిపోజి దివ్య, లిరిక్స్ : కందికొండ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రేఖ బొగ్గారపు, లైన్‌ ప్రొడ్యూసర్‌: వినోద్‌ నాగుల, సహ నిర్మాతలు: శ్రావిన్‌, రాజశేఖర్‌ మేడారం, ప్రొడక్షన్‌: ఎంఎన్‌ఓపీ – అమోఘ ఆర్ట్స్ సహకారంతో, పీఆర్‌ఓ : నాయుడు – ఫణి (బియాండ్‌ మీడియా),
సమర్పణ: రాజేశ్వర్‌ బొంపల్లి, నిర్మాత: నవీన్‌ మేడారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *