సినిమాటికా ఎక్స్ పో కి రేవంత్ రెడ్డి నీ ఆహ్వానించిన పి.జి. విందా !

IMG 20251030 WA0422 e1761829525708

సినిమా అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసేది సాంకేతికత, సృజనాత్మకత, మరియు కొత్త ఆవిష్కరణలు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది.

హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని నవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో జరిగే ఈ “ సినిమాటికా ఎక్స్పో 2025” ద్వారా ప్రపంచ సినిమా దిశగా మన అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను నేను, మరియు ‘సినిక క్రియేటర్స్ కౌన్సిల్’ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నాము.

ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్, AI ఫిల్మ్‌మేకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు మరియు నెట్‌వర్కింగ్ సెషన్లు జరగనున్నాయి. ఈ సంవత్సరం మా థీమ్ “From Hollywood to Hyderabad: Building the Global Gateway of Cinema.” ఇది కేవలం నినాదం కాదు, భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టే మా దృక్పథం.

2023లో ఇండియాలో తొలిసారి ఫిల్మ్‌టెక్ ఎక్స్పోగా “సినిమాటికా” గుర్తింపు పొందింది. 2024లో వర్చువల్ ప్రొడక్షన్ మరియు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసి కొత్త దిశలో అడుగేసింది. 2025లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు “హాలీవుడ్ టు హైదరాబాద్” కాన్సెప్ట్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కొత్త మైలురాయిగా ఈ ఎడిషన్ నిలుస్తుంది.

సినిమా, టెక్నాలజీ, ఆర్ట్, మరియు కల్చర్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడం మా లక్ష్యం. “Where Filmmaking Meets the Future” ఈ నినాదం కేవలం మాట కాదు, మన దిశను నిర్వచించే దారి. ఇది ఒక ఎక్స్పో కాదు. ఇది మన సినిమా భవిష్యత్తు కోసం మన సమిష్టి కృషి అవసరం.

హైదరాబాద్ నుంచి హాలీవుడ్ దాకా, మన సృజనాత్మకతకు గ్లోబల్ వేదికగా నిలిచే ఈ ప్రయాణంలో ప్రతి సినీ ప్రొఫెషనల్, ప్రతి టెక్నీషియన్ భాగస్వామి కావాలి.

IMG 20251030 WA0348

సినీమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదిక!

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న పి.జి విందా. 2004లో పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాలుగా ఆయన తెలుగు సినిమా రంగానికి సేవ చేస్తూనే.. ప్రపంచంలో ఎక్కడ నూతన టెక్నాలజీ ఉన్నా.. అక్కడికి వెళ్లి నేర్చుకునే తత్వం ఆయనది.

అదే క్రమశిక్షణతో “సినిమాటికా ఎక్స్‌పో” అనే వేదికను స్థాపించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగనే ఈ సంవత్సరం కూడా సినిమాటికా ఎక్స్ పో కార్యక్రమం నవంబర్ 1, 2 న హైటెక్స్ లో, నవొటల్ లో జరుగనుంది. గత సంవత్సరం సినిమాటికా ఎక్స్ పో కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.

ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు పి.జి విందా తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధారణ లభించిందని, 100 మందికి పైగా ఇంటర్ నేషనల్ ఎగ్జిబీటర్స్, స్పీకర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిల్మ్ మేకింగ్ గురించి, నూతన కెమెరాల గురించి అలాగే వీఎఫ్ఎక్స్ గురించి తెలుసుకోవచ్చని చెప్పారు.

 

పి.జి విందా మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ నేర్చుకుంటే సినిమా ప్రపంచంలో అద్భాతాలు చేయొచ్చు అని చెప్పారు. ఓటీటీ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా ఈ వేదిక ద్వారా సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. గత సంవత్సరంలో వేలాది మంది బ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లూయెన్సర్స్ అలాగే ఫిల్మ్ మేకర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ స్కూల్స్ లో మొత్తం కలిపి 40 వేలకు పైగా ఔత్సాహికులు ఈ వేదికపై కనెక్ట్ అయ్యారని చెప్పారు.

తెలుగు పరిశ్రమ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. హైదరాబద్ లో మొదలైన ఈవెంట్ ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఈవెంట్ గా మారిందని చెప్పారు. దీనికి తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ కూడా సినిమాటికా ఎక్స్‌పో, ఇంతలా విస్తరించడానికి కారణం అని చెప్పారు.

IMG 20251030 WA0341

ఇక ఫిల్మ్ మేకింగ్ అంటే కేవలం కొందరికే కాకుండా ఆసక్తి ఉన్నవారందరికీ అందుబాటులో ఉండాలి. గ్రామాల్లో ఉన్న క్రియేటర్ల కోసం సినిమాటికా ఎక్స్‌పో అద్భుతమైన వేదిక అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు “హాలీవుడ్ నుంచి హైదరాబాద్ వరకు టెక్నాలజీ రూపొందించాలి” అన్నట్టు దానికోసం సినిమాటికా ఎక్స్ పో సపోర్ట్ గా ఉంటుందన్నారు పీజీ విందా.

 దీనికి అనుబంధంగా సినికా క్రియేటర్స్ కౌన్సిల్ పని చేస్తుందని చెప్పారు. సినిక ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ, ఈ వర్టికల్స్ ఫిల్మ్ మేకింగ్ లో మరియు క్రియేటివ్ ఆర్ట్స్ లో అన్నింటిని, అలాగే అన్ని విభాగాలకు సమాచారం, సదుపాయాలు అందించడానికి సినీకా క్రియేటర్స్ కౌన్సిల్ ముందుంటుందని చెప్పారు.

సినిమాటిక ఎక్స్ పో వచ్చే సంవత్సరం ఫిల్మ్ కార్నివాల్ ను నిర్వహించబోతుందని చెప్పారు. అంటే ప్రపంచ సినిమాలను ప్రదర్శిస్తారు. టెక్నికల్ డిపార్ట్ మెంట్, వీఎఫ్ ఎక్స్, ఎడిటర్స్, డైరెక్టర్స్ ప్రసంగాలు ఉంటాయని, వాటి ద్వారా నూతన ఫిల్మ్ మేకర్స్ ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ ఫిల్మ్ కార్నివాల్ ఫెస్ట్ 5 రోజులు నిర్వహిస్తామని, దానికోసం ప్రణాళిక సిద్దం అవుతుందని చెప్పారు.

ఈ సంవత్సరం సినిమాటిక ఎక్స్పో లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో సినిమాటికా ఎక్స్‌పో ఫిల్మ్ మేకింగ్ లో అద్భుతం కాబోతుందని చెప్పారు. అలాగే 2023, 2024 ఎడిషన్ లో ఏఐ గురించి ప్రస్థావించామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా నిపుణులచే AI సెషన్స్ వుంటాయని చెప్పారు. ఏఐ టూల్ వాడుకుంటే ఎన్నో అద్భుతాలను చేయొచ్చు అని కూడా చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంజా శ్రవణ్ మాట్లాడుతూ.. సినిమాటికా ఎక్స్‌పో, సినీకా క్రియేటర్ కౌన్సిల్ మద్దతుతో భవిష్యత్తులో జీసీసీ మోడల్ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్ లాగా పని చేస్తుందన్నారు. దాని ద్యారా భవిష్యత్తులో ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన కెమెరాలు, సాఫ్ట్ వేర్స్ అన్ని హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాయి అన్నారు. అంటే ఫిల్మ్ మేకింగ్ ఒకటే కాదు అన్ని క్రియేటివ్ ఆర్ట్స్ కి మన హైదరాబాద్ సిటీనే హాబ్ గా చేయొచ్చు.

ఇంతకుముందు రెండు సినిమాటిక ఎడిషన్స్ లో ఎంట్రీ ఉచితంగా ఇచ్చాము. 40 వేలకు పైగా సినీ ఔత్సహికులు వచ్చారు. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన సినిమాటిక ఎక్స్పో లో ఎంట్రీ అనేది ఫ్రీ గా ఇవ్వలేక పోతున్నాం. సాధారణ పౌరులను కంట్రోల్ చేయడానికి, కేవలం సినీ ఔష్టహికులను ప్రోత్సాహించడానికి కొద్దిగా ఫీజ్ పెట్టడం జరిగింది.

సినీ పరిశ్రమలోని అన్నీ అసోసియేషన్ సభ్యులకి, ఇండస్ట్రీలో పని చేసే వారికి మాత్రం ఎక్స్పో లో ఎంట్రీ పూర్తిగా ఉచితం అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *