సినిమారంగంలో ఎంతో అనుభమున్న తాము ఎప్పుడూ సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే నిలబడతామనీ, అందులో ఎటువంటి అపోహకు అవకాశం వుందని నటుడు, నిర్మాత మాదాల రవి స్పష్టం చేశారు. సోమవారంనాడు ఫిలింఛాంబర్ పెద్దల సమక్షంలో చిత్రపురి కమిటీ, అధ్యక్షుడు అనిల్ వల్లభనేని చిత్రపురిలో నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను అన్ని విభాగాలకు చెందిన వారు విడుదల చేసారు.

ఈ సందర్భంగా మాదాలరవి మాట్లాడుతూ, సినిమా రంగంలో అన్ని విభాగాల్లో చిత్రపురి కూడా భాగం కాబట్టి ఫిలిం ఛాంబర్ ఆధర్యంలో చిత్రపురి కమిటీ సమావేశం జరిగింది. దానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధిగా నేను హాజరయ్యాను. చిత్రపురి ఇండ్ల నిర్మాణంలో గతంలోనే వివాదాలున్నాయి. ఇప్పుడు ఇందులో ఏదైనా వివాదం వున్నా అది ఇండస్ట్రీ పరపతికి దెబ్బతీస్తుంది. అందుకే ఎటువంటి వివాదాలు లేకుండా సినీ కార్మికులకు ఉపయోగపడేలా, సినిమా రంగానికి మంచి పేరు తెచ్చేలా చిత్రపురి కమిటీ చేయాలి.

చిత్రపురి సభ్యులుగా తొమ్మిదివేలమంది వున్నారు. అందులో ఇంచుమించు ఐదు వేల మందికి ఇండ్లను కేటాయించారు. అందులో మిగిలినవారికి కొత్త ప్రాజెక్ట్ లో ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా వెయింటింగ్ లిస్ట్ లో వున్న నిజమైన సినీకార్మికులకు న్యాయంచేయండి. ఆ తర్వాత కొత్త సభ్యలుకు అవకాశం ఇవ్వాలి. చిత్రపురి కమిటీతో ఫిలింఛాంబర్ పెద్దలు అందరూ కలిసి సినీ కార్మిలకు న్యాయం జరుగుతుందని అన్నారు కాబట్టి నేను ఈ సమావేశానికి హాజరైన తెలుగు సినిమా రంగం ఆదర్శవంతంగా నిలుస్తుందని ఆశిస్తూ మాట్లాడాను..అని తెలిపారు.