Chiranjeevi@Allu Studio : ఆయన లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదేమో !

allu studio 2

 

ఆల్లు స్టూడియో: హైదరాబాద్‌, కోకాపేటలో ఏడెకరాల్లో నిర్మించిన అల్లు స్టూడియోను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు.

chiru allu studio inagirated 1

మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు ‘రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి..ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఘనత, అప్యాయత లభిస్తుంది.. రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు..

నాడు నటుడిగా ఎదగాలని అనుకొన్న ఆల్లు రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగింది..

Allu studios ఓపెనింగ్ 2

అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా , మనవలకు స్టార్డమ్ దక్కింది. అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాడమే కాకుండా పది మందికి పని కల్పించే సంస్త గా ఉండాలి అని ఆశిస్తున్నాను.

అల్లు స్టూడియో : అల్లు వారికి కృతజ్ఞత , గుర్తింపు గా ఉండాలని నిర్మించినట్లుంది. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వటం నాకు ఆనందంగా వుంది.

ఇప్పుడు ముంబై లో సల్మాన్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కు వెళ్లుతున్నాను. సాయంత్రం అల్లు రామలింగయ్య గారి శతజయంతి సభలో ఇంకా ఎక్కువగా మాట్లాడతాను’ అని వ్యాఖ్యానించారు.

Allu studio opening 1
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ మా నాన్నగారు శత జయంతి చనిపోయి 18 ఏళ్లయింది,  కానీ, మా అందరికీ, సినీ ప్రేకశకులకు అనేక మధ్యమల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారు.

అల్లు స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదు.. గీతా ఆర్ట్స్ , అల్లు స్టూడియో , ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’ అని అన్నారు.

aa speech

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అల్లు స్టూడియోస్ ను ఆవిష్కరించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు. మా తాతగారి శత జయంతి ఓ ప్రత్యేక మైన రోజు.. స్టూడియో అనేది లాభాపేక్ష కోసం పెట్టలేదు..

తాతగారి కోరిక, వారి జ్ఞాపకంగా స్టూడియో పెట్టాము.. ఇక్కడ చిత్రీకరణలు జరిగితే తాతాగారికి ఆనందంగా ఉంటుంది.. తాతగారు చనిపోయి18 ఏళ్లయినా, మా నాన్న గారికి వారిపై ప్రేమ పెరుగుతోంది.

allu studio Family

నాపై అభిమానాన్ని చూపిస్తున్న మెగాభిమానులకు, నా ఆర్మీ కి ధన్యవాదాలు..’ అనిఅల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *