పిల్లల కోసం వస్తున్న యానిమేషన్ మూవీ ‘కికి అండ్ కొకొ’ టిజర్ రివ్యూ!

IMG 20251227 WA0459 e1766851495152

ప్రపంచవ్యాప్తంగా హలీవుడ్ అనిమేషన్ చిత్రాలకున్న ఆదరణ అంత ఇంత కాదు! అన్ని జోనర్ చిత్రాలకు ఎంత విలువ ఇస్తారో? అనిమేషన్ చిత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే మన భారతీయ అనిమేషన్ చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఏడాది జూలై లో విడుదల అయిన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం హృదయాన్ని హత్తుకునే ఓ ఇండియన్ అనిమేషన్ సినిమా ‘కికీ & కోకో’ రుపొందుకుంటుంది.

పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా రూపొందుతున్న యానిమేషన్ మూవీ “కికి అండ్ కొకొ”. ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఈ యానిమేషన్ చిత్రానికి ధరణి నిర్మాత కాగా పి. నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలనటి శ్రీనిక కొకొ పాత్రలో నటిస్తోంది. మీనా చాబ్రియా సీయీవోగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న యానిమేషన్ మూవీ “కికి అండ్ కొకొ” త్వరలో థియేటర్స్ తో పాటు 9 భాషల్లో ఓటీటీలోకి రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన భారతీయ అన్ని భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రానికి సంబంధించిన టిజర్ విడుదల ప్రెస్ మీట్ లో ఈ యానిమేషన్ మూవీ హైలైట్స్ తెలిపారు చిత్రబృందం.

ఈ కార్యక్రమంలో బాలనటి శ్రీనిక మాట్లాడుతూ – నేను ‘కికి అండ్ కొకొ’ చిత్రంలో కొకొ క్యారెక్టర్ లో నటించాను. మూవీలో నాకు కికి మంచి ఫ్రెండ్. ఇలాంటి ఫ్రెండ్ నాకు నిజంగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు యానిమేషన్ సినిమాలంటే చాలా ఇష్టం. “కికి అండ్ కొకొ” సినిమాలో నటిస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. నేను పెద్దయ్యాక మంచి యాక్టర్ కావాలని అనుకుంటున్నా! అన్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ గోకుల్ రాజ్ భాస్కర్ మాట్లాడుతూ – నేను మలయాళ యానిమేషన్ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. యానిమేషన్ చిత్రాల్లో ఫాంటసీ ఎక్కువగా ఉంటుంది. అయితే “కికి అండ్ కొకొ” యానిమేషన్ సినిమా ద్వారా ఫాంటసీని కాకుండా రియాలిటీని మన పిల్లలకు చూపించబోతున్నాం. మన లైఫ్ లోని అన్ని భావోద్వేగాలను మా ఆర్ట్ ద్వారా పిల్లలకు చెప్పబోతున్నాం. సినిమాను ఎంతో ప్రేమించే తెలుగు ఆడియెన్స్ కు మా “కికి అండ్ కొకొ” సినిమాను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఇది “కికి అండ్ కొకొ” ఇంట్రడక్షన్ మాత్రమే కాదు ఇందులోని పాత్రల ద్వారా ఒక ఎమోషన్ ను పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అన్నారు.

డైరెక్టర్ పి.నారాయణన్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ మన పిల్లలు హింసకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. యానిమేషన్ చిత్రాల్లో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అంటూ ఒక ఫాంటసీ చూపిస్తున్నారు. వండర్ వుమెన్ నిజంగా ఉంటుందా లేదా అనేది దేవుడికే తెలియాలి. మేము మా “కికి అండ్ కొకొ” యానిమేషన్ సినిమాలో పిల్లలకు జీవితాల్లోని రియాల్టీ చూపించాలని ప్రయత్నిస్తున్నాం. మనల్ని మనం ఇష్టపడటం, పెద్దలను గౌరవించడం, తప్పు చేస్తే సారీ చెప్పడం, సాయం చేస్తే కృతజ్ఞత తెలపడం, మనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేయడం ఇలాంటి మంచి అలవాట్లను పిల్లలకు పరిచయం చేయాలని అనుకుంటున్నాం. మార్పు అనేది మన నుంచే ప్రారంభం కావాలి. మానవత్వం, వాస్తవికత అనే అంశాలు కలిపిన కథతో మంచి చేయాలి,

మంచిగా ఉండాలి, వినయంతో జీవించాలి అనే మంచి విషయాలను చూపిస్తూ ఎంటర్ టైన్ మెంట్, ఎడ్యుకేషన్ కలిపి ఎడ్యుటైన్ మెంట్ లా “కికి అండ్ కొకొ” సినిమా ఉంటుంది. మా సినిమాతో షేరింగ్ కేరింగ్ అనేవి పిల్లలు తెలుసుకోవాలని భావిస్తున్నాం. “కికి అండ్ కొకొ”లో మంచి కంటెంట్ ఉంది. దీన్ని సిరీస్ లా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అన్నారు.

IMG 20251227 WA0345

సీయీవో మీనా చాబ్రియా మాట్లాడుతూ – నాకు మూవీస్ అంటే ఇష్టం. తెలుగులో ఏ హీరో కోసం చూసినా రెండు మూడేళ్లు ఆగాల్సిందే. అందుకే మా డైరెక్టర్ పి.నారాయణన్ యానిమేషన్ మూవీ చేద్దామనే ప్రపోజల్ తీసుకొచ్చారు. “కికి అండ్ కొకొ” చేయాలని ప్లాన్ లో ఉండగా, మా క్రియేటివ్ డైరెక్టర్ గోకుల్ చాలా ఫాంటసీ కాన్సెప్ట్స్ చెప్పారు. కానీ మేము అవన్నీ వద్దుకుని పిల్లలు తమ నిజం జీవితంలో చూసి నేర్చుకుని ఆచరించేలా మన యానిమేషన్ సినిమా ఉండాలని నిర్ణయించాం. పిల్లలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు,

ఎలా ప్రవర్తించాలి అనే వాస్తవిక అంశాలను చెబుతూ “కికి అండ్ కొకొ” సినిమా నేపథ్యాన్ని తయారుచేశాం. మా చిన్నతనంలో పెద్దవాళ్లు నీతి కథలు చెప్పేవారు. వాటిలోని మంచిని నేర్చుకునేవాళ్లం. ఇప్పటితరం పిల్లలకు అవన్నీ లేవు, చాలా ఫాస్ట్ లైఫ్ కు అలవాటు పడుతున్నారు. వారికి మంచి నేర్పే క్రమంలో ఎడ్యుటైన్ మెంట్ లా మా “కికి అండ్ కొకొ” సినిమా ఉంటుంది. మాకు కలర్ పెన్సిల్ అనే బ్రాండ్ ఉంది. దాని ద్వారా యాప్స్, బుక్స్ పిల్లల కోసం తీసుకొస్తున్నాం. అలాగే “కికి అండ్ కొకొ” సినిమా నుంచి నెలకొక మర్చండైజ్ తీసుకురాబోతున్నాం.

వచ్చే ఏడాది థియేట్రికల్ గా రిలీజ్ చేసి ఓటీటీలోనూ “కికి అండ్ కొకొ” యానిమేషన్ మూవీని తీసుకొస్తాం. మా సినిమా పిల్లల కోసమే కాదు పిల్లల వంటి మనసున్న పెద్దలకు, పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవాల్సిన పేరెంట్స్ కోసం నిర్మించాం. అన్నారు.

ప్రొడ్యూసర్ ధరణి మాట్లాడుతూ – మా “కికి అండ్ కొకొ” యానిమేషన్ సినిమా ద్వారా పిల్లలకు మన ఎమోషన్స్, వ్యాల్యూస్ ను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. జీవితంలోని వాస్తవికతను, మంచిని బాల బాలికలకు నేర్పాలనేది మా సినిమా ముఖ్య ఉద్దేశం. థియేటర్ తో పాటు ఓటీటీలోనూ మా యానిమేషన్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. అన్నారు.

నటినటులు : శ్రీనిక

పాత్రధారులు :

కికీ అనే బుజ్జి కుక్క పాత్ర, కోకో అనే చిన్నారి పాత్ర.,

టెక్నికల్ టీం :

డైరెక్టర్ : పి.నారాయనణ్, నిర్మాత ల్: ధరణి, కాన్సెప్ట్, క్రియేటివ్ డైరెక్టర్ : గోకుల్ రాజ్ భాస్కర్,, రచయితలు : అశ్విన్ విశాల్ తియోదొర్, విశ్మయ మణి,, డైరక్షన్ టీం : హరి రారోత్,, కంటెంట్ స్టార్ట్జిస్ట్ : శ్రీ హరి పి, శ్రీ అరవింద్ పి,, అనిమేషన్ స్టూడియో : ఇయాగి స్టూడియో, ప్రొడక్షన్ హౌస్ : ఇంసిగ్నియా క్రియేటివ్,,సి యం ఓ : మీనా చాబ్రియా,, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : జి.యం.కార్తికేయన్,,పి ఆర్ ఓ : రాంబాబు వర్మ లంకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *