మూవీ: చద్రముఖి2
విడుదల తేదీ :సెప్టెంబర్ 28, 2023
నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేష్ తదితరులు.
దర్శకుడు : పి. వాసు
నిర్మాత: సుభాస్కరన్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
ఎడిటర్: ఆంథోనీ
మూవీ రివ్యూ: చద్రముఖి2 (Chabdramukhi 2 Movie)
లారెన్స్ మాస్టారు భయపడేలా, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భయపెట్టేలా ప్రముఖ దర్శకుడు P వాసు పాత టైటిల్ తో రెండవ భాగం అంటూ తెరకెకకినచ్చిన సినిమా ‘చంద్రముఖి-2’. ప్రముఖ నిర్మాన సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సీక్వెల్ తో రాఘవ లారెన్స్ హిట్ కొట్టాడా ? లేదా ? అన్నది మా 18 F మూవీస్ టీం రివ్యూ చదివి తెలుసుకొందామా !.
కథ ని పరిశీలిస్తే (Story line):
రంగనాయకమ్మ (రాధిక శరత్ కుమార్) కుటుంబం లోని ఓక కూతురు చనిపోవడం మరో కూతురికి కార్ ఆక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో ఉండటం వంటి రకరకాల సమస్యలతో బాధపడుతుంటుంది. తమ కుల దేవతకు జీవించి ఉన్న ఫ్యామిలీ సభ్యులు మొత్తం వెళ్ళి పూజలు చేస్తే సమస్యలు దూరమవుతాయని పూజారి (రావు రమేష్) చెప్పడం తో తమ కుల దైవం ఉన్న వెటైపాలెం బయలుదేరి వెళతారు. ఆ గుడి దగ్గరలోని ప్రదేశం లో ఉన్న ఓక భవనాన్ని (అంతపురం) అద్దెకు తీసుకొంటారు. రంగనాయకమ్మ పెద్ద కూతురు అల్లుడు చనిపోవడం తో వారి ఇద్దరు పిల్లలకు కేర్ టేకర్‌గా మధన్ (లారెన్స్ రాఘవ) వ్యవహరిస్తుంటాడు.
అంతపురం పక్కనే ఉండే లక్ష్మీ (మహిమ నంబియార్) కి చిన్నప్పుడు నుండి ఆ అంతఃపురం లోపల ఉండే గదులు చూడాలి అనే కోరికతో అక్కడ కు వచ్చి తొలిచూపులోనే మధన్ తో ప్రేమలో పడుతుంది . ఇదిలా ఉండగా, అంతపురానికి యజమాని అయిన బసవయ్య (వడివేలు) ఆ అంతపురంలో దక్షిణ ప్రాంతానికి వెళ్లకూడదని వచ్చిన గెస్ట్ లు అందరిని హెచ్చరిస్తాడు. కానీ వీల్ చైర్ లో ఉన్న దివ్య (లక్ష్మీ మీనన్) దక్షిణ ప్రాంతంలో ఉన్న వరండాలో దొరికిన గజ్జె ల మువ్వ చైన్ కి లాకెట్ లా వేసుకొని ధరించడం వలన చంద్రముఖి ఆత్మ దివ్య లోకి వస్తుంది. మరో సంధర్బం లో మధన్ అనుకొకుండా దక్షిణ ప్రాంతం లొని దర్బార్ హలులోకి వెళ్ళి వెట్టై రాజు (రాఘవ లారెన్స్ ) సింహాసనం మీద కూర్చోవడం తో వెట్టై రాజు ఆత్మ మదన్ లోకి ప్రవేసిస్తూంది.
చంద్రముఖి కి వెట్టై రాజు కి మద్య విరోధం ఏంటి ?
రెండు ఆత్మలు ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి ?,
ఇంతకీ చంద్రముఖి వెట్టై రాజు మీద తన పగను ఎలా తీర్చుకుంది ?,
చివరికీ దివ్యని చంద్రముఖి వదిలి పెట్టిందా ? లేదా ?,
ఫైనల్ గా మధన్, రాధిక ఫ్యామిలీని చంద్రముఖి నుండి ఎలా సేవ్ చేశాడు ?
వెట్టై రాజు ఎవరు ? ఎందుకు చంద్రముఖి వెట్టై రాజుని చంపాలి అనుకొంటుంది?
ఈలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే వెండి తెర పై ఈ సినిమా చూడాల్సిందే.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
దర్శకుడు పి. వాసు 16 సంవత్సరాలు క్రితం నిర్మించిన చంద్రముఖి కధ లో కొన్ని మార్పులతో నాగవల్లి అనే సినిమా తీసినా ఇప్పుడు మరలా చంద్రముఖి 2 అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు. పాత చంద్రముఖి కధలొని పాత్రలు మార్చి అదే కధనం (స్క్రీన్ – ప్లే ) తో తెరకెక్కించిన కొన్ని హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీన్స్ లో కంటిన్యూటి మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన చంద్రముఖి లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే ఈ రెండో పార్ట్ లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ అందరి ప్రేక్షకులకు కలుగుతుంది.
రెండవ అంకం ( సెకండాఫ్) మొదలైన 10 నిమిషాల తర్వాత గాని సినిమా చూసే ప్రేక్షకులు అసలు కథలోకి వెళ్ళరు . దీనికి తోడు అక్కడక్కడ తమిళ్ నేటివిటీ సినిమాలో ఎక్కువుగా కనిపిస్తోంది. అలాగే వడివేలు కామెడీ కూడా బాగా విసిగించింది. అసలు అనవసరమైన వర్కౌట్ కానీ కామెడీ ట్రాక్స్ ను తీసేసి ఉంటే.. సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. ఓవరాల్ గా హర్రర్ సీన్స్, సెకండ్ హాఫ్ లో ప్లాష్ బ్యాగ్ ఎలిమెంట్స్ బాగున్నా.. మిగతా కంటెంట్ అంతా రొటీన్ ఫార్ములా కధనం లో సాగిపోతుంది.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకుడు పి. వాసు చంద్రముఖి కి సీక్వెల్ గా భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్ గా తీసుకోని చంద్రముఖి హిట్ టైటిల్ తో పార్ట్ 2 అంటూ మన ముందుకు వచ్చాడు. ఇక ఈ జోనర్ లో సినిమా అంటేనే.. కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.
హీరో గా రాఘవ లారెన్స్ ఇటువంటి హర్రర్ ఎంటర్టైన్మెంట్ తో ముణి (కాంచన) సిరీస్ లో నటించి మెప్పించాడు. అలానే P వాసు దర్శకత్వం లో శివ లింగ సినిమా కూడా హర్రర్ సినిమా నే. ఈ చంద్రముఖి -2 లో కూడా కామిడీ తో పాటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగానే పండించాడు. ఈ సినిమాలోనూ రాఘవ లారెన్స్ నటనే హైలైట్ గా నిలుస్తోంది.
కంగనా రనౌత్ పాత్ర చిన్నదే అయిన తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోంది. ముఖ్యంగా కంగనా కొన్ని హర్రర్ సన్నివేశాల్లోను క్లైమాక్స్ లోను తన నటనతో మెప్పించింది.
అలాగే తల్లి పాత్రలో నటించిన రాధిక శరత్ కుమార్ కూడా ఎప్పటిలాగే తనదైన శైలిలో అద్భుతంగా నటించింది.
ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేష్ వడివేలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
ఎం. ఎం. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలానే పాటలు టూన్స్ బాగున్న లిరిక్స్ అర్దం కాక పాటలు అంతగా గుర్తుండవు.
ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి. .
ఆంథోనీ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాత సుభాస్కరన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సిన్మా మొత్తం చాలా రిచ్ గా కనిపించింది.
18F మూవీస్ టీం ఒపీనియన్:
కంగనా లారెన్స్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ చంద్రముఖి 2’ సిన్మా పాత హారర్ రివెంజ్ డ్రామా లనే సాగిపోతుంది. కొన్ని హారర్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో లారెన్స్ – కంగనా రనౌత్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. కాకపోతే పురాతన కధ కధనం వలన బోర్ ఫీల్ వస్తుంది. కామెడీ ట్రాక్స్, హర్రర్ ఎలిమెంట్స్ మరియు స్లో ఫస్ట్ హాఫ్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద చంద్రముఖి చూడని ప్రేక్షకులు ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే.. ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నచ్చుతాయి. అల్ రెఢీ చంద్రముఖి 1 చూసిన వాళ్ళు యావైడ్ చేయడం బెటర్.
టాగ్ లైన్: ఆత్మల తో ఆట చాలు వాసు !
18FMovies రేటింగ్: 2.5 / 5
* కృష్ణ ప్రగడ.