Chaari 111 Mlvie Trailer Review : గూఢచారి గా ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’ ట్రైలర్‌ ఎలా ఉందంటే ! 

IMG 20240210 WA0030 e1707723832580

చారి… బ్రహ్మచారి… రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్ చేయడం అతని నైజం. అతడిని ‘ఏజెంట్ 111’ అని పిలుస్తారు.

‘బాండ్… జేమ్స్ బాండ్’ టైపులో తనను తాను ‘చారి… బ్రహ్మచారి‘ అని పరిచయం చేసుకోవడం చారికి అలవాటు. ఒక సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేస్తాడు అతడు. ఆ తర్వాత ఏమైందనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.

IMG 20240208 WA00741 1

‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు.  మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.

IMG 20240208 WA00791

ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో ‘చారి 111’ ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు.

మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

IMG 20240208 WA00731

 

 ఈ ‘చారి 111’ ట్రైలర్ చివరలో ‘వయలెన్స్… వయలెన్స్… వయలెన్స్… ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా’ అంటూ ‘కెజియఫ్’లో రాకీ భాయ్ టైపులో ‘వెన్నెల’ కిశోర్ చెప్పిన డైలాగ్ థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ వేయించడం గ్యారంటీ. సంయుక్తా విశ్వనాథన్ అందంగా కనిపించారు.

యాక్షన్ సీన్లు అదరగొట్టారు. ‘నువ్వు ఎప్పటికీ కమెడియనే. హీరో కాదు‘ అంటూ ‘వెన్నెల’  కిశోర్ మీద పంచ్ కూడా వేశారు. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి ఇతర పాత్రల్లో కనిపించిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

IMG 20240212 WA0071

ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమేనని, సినిమాలో దీనికి మరింత వినోదం ఉంటుందని దర్శకుడు టీజీ కీర్తి కుమార్, నిర్మాత అదితి సోనీ తెలిపారు. ప్రేక్షకుల్ని ‘చారి 111’ కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘చారి 111’ పాటలు విడుదల కానున్నాయి.

 

వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *