నిర్మాతలు బన్నీవాస్‌, వంశీ నందిపాటి ల స్పెషల్ ఇంటర్వూ! 

IMG 20251221 WA0368 e1766319283503

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మీ

ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది తెలిసిందే.. కాగా ఈ నెల 25న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాస్  మా 18F మూవీస్ మీడియా ప్రతినిథితో మాట్లాడారు.. ఆ విశేషాలివి.

వరుసగా మీ ఇద్దరూ రెండు బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నారు.. ఇది మూడో సినిమా కూడా కంటెంట్‌ నమ్మకంతో చేస్తున్నారా? అబ్లిగేషన్‌తో చేస్తున్నారా?

బన్నీవాస్‌ : ఇది అబ్లీగేషన్‌ కాదు. ఒకవేళ తీసుకున్నా ఇది కంటెంట్‌ నచ్చితేనే మాత్రమే తీసుకున్నాం. సినిమా నచ్చకపోతే వెంటనే వాళ్లకు వేరే ప్రత్యామ్నాయ మార్గం చెబుతాం. ఈసినిమా కంటెంట్‌ మీద నమ్మంతోనే అసోసియేట్‌ అయ్యాం.

ఈసారి ‘ఈషా’లాంటి హారర్‌ జోనర్‌లోకి వెళ్లారు ఎందుకని?

IMG 20251210 WA0192

వంశీ నందిపాటి: సినిమా బాగుంది. మొదటి పది నిమిషాల్లోనే మీకు మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో.. అందరికి అర్థమవుతుంది. సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తిగా భయంగా ఉంటుంది. హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ ఈ సినిమా ఇది. చివరి 15 నిమిషాలు, సినిమా చాలా కొత్తగా ఉంటుంది.

మీనుంచి సినిమా అనగానే అందరిలో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా?

బన్నీ వాస్‌: నా సొంత సినిమాల్లో ఫెయిల్‌ అయినా డిస్ట్రిబ్యూషన్స్‌లో ఫెయిల్‌ కాలేదు. ఈ సినిమా విషయంలో ఫెయిల్‌ కాను అనే నమ్మకం ఉంది. ఇది ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తప్పకుండా రీచ్‌ అవుతుంది. మిత్రమండలి ఫెయిల్‌ అయినా ప్రేక్షకుల తీర్పును అంగీకరించి మరుసటి రోజే ఆ సినిమా గురించి మరిచిపోయాను. నేను వంశీ కలిసి చేసిన ఏ సినిమా కూడా ఫెయిల్‌కాదనే నమ్మకం ఉంది. ఈషా కూడా ఫస్ట్‌కాపీ చూసి తీసుకున్నాం. తప్పకుండా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది.

లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాల తరహాలోనే ఇది కూడా ఉంటుందా?

వంశీ నందిపాటి : లిటిల్‌హార్ట్స్‌, రాజువెడ్స్‌ రాంబాయితో కంపేర్‌ చేయకూడాదు.దానితో పోల్చకూడదు. ఈ రెండు సినిమాల విషయంలో ఏది అనుకున్నామో అదే జరిగింది. ఈషా విషయంలో కూడా మేము అనుకున్నది జరుగుతుంది. తొలిపదిహేను నిమిషాలు అదిరిపోతుంది. పతాక సన్నివేశాలు స్టనింగ్‌గా ఉంటాయి.

2026 మీ ప్లానింగ్‌ ఎలా ఉంది?

బన్నీవాస్‌ ఈ మద్య చిన్నసినిమాల పబ్లిసిటి చాలా ఇన్నోవేటింగ్‌గాచేస్తున్నారు.కంటెంట్‌ బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి. 2026లో నా సినిమాలు మూడు ఫిబ్రవరిలో అనౌన్స్‌ చేస్తాను. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, బన్నీవాస్‌ వర్క్స్‌లో కూడా రెండు సినిమాలు ఉంటాయి.

నాగచైతన్యతో సినిమా అన్నారు?

బన్నీవాస్‌: నాగచైతన్య సినిమా స్టోరీ రన్‌ అవుతుంది. అది లాక్‌ అయితే ఉంటుంది. ఇట్స్‌ ఏ మ్యూజికల్‌ ఫిలిం. దానికి రాక్‌లైన్‌ వెంకటేష్‌ గారు మెయిన్‌ ప్రొడ్యూసర్‌

IMG 20251220 WA0151

హార్ట్‌ వీక్‌ ఉన్నవాళ్లు, ఈ సినిమా చూడకూడదు అన్నారు.. ఇలాంటి హారర్‌ సినిమాలకు ప్రత్యేకమైన లిమిటెడ్‌ ఆడియన్స్‌ ఉంటారు కదా?

వంశీ నంది పాటి: ఇది కేవలం హారర్‌ సినిమానే కాదు అందరికి వర్కవుట్‌ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఆడియన్స్‌ ఉంటారు. ఈ సినిమా లాస్ట్‌ 20 నిమిషాలు హారర్‌ సినిమాలా ఉండదు.ఓ మంచి విషయం చెప్పారని ఫీల్‌ అవుతారు.

లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి ఈ సినిమాలను మీరు ముందుకు తీసుకెళ్లిన విధానం అందర్ని ఇంప్రెస్‌ చేస్తుంది అసలు మీ ప్లానింగ్‌ ఏమిటి?

వంశీ నందిపాటి మేము మోర్‌ దెన్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ చేసే వర్క్‌ చేస్తున్నాం. ఎడిట్‌ రూమ్‌ దగ్గర్నుంచీ మేము అనుకున్న మార్పులు చేసి..సినిమాను ఓ ప్లానింగ్‌ ప్రకారం విడుదల చేస్తున్నాం. ఆర్‌ఆర్‌తో పాటు మ్యూజిక్‌లో కూడా ఇన్‌వాల్వ్‌ అవుతాం.. సినిమాను మార్కెటింగ్‌ చేసి.. నాన్‌థియేట్రికల్‌ను కూడా క్లోజ్‌ చేసి.. సినిమాలను విడుదల చేస్తున్నాం మాదొక కొత్త ట్రెండ్‌.. ఫిల్మ్‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నాం.

నిజంగా దెయ్యాలు ఉంటాయా? ఈ సినిమాలో ఏమీ చెబుతున్నారు.?

సినిమా చూస్తే తెలుస్తుంది.

పార్ట్‌-2 ఉంటుందా?

వంశీ నందిపాటి: లేదు చాలా క్లారిటీగా క్లైమాక్స్‌ ఉంటుంది. లాస్ట్ పదిహేను నిమిషాలు అందరూ కనెక్ట్‌ అవుతారు. చాలా రియల్‌లైఫ్‌ ఇన్‌సిండెట్స్‌ చాలా ఈ సినిమాలో ఉంటాయి. ఇది మన లైఫ్‌లో కూడా జరిగిందా అనే ఫీల్‌ కలుగుతుంది?

ట్రైలర్‌ కట్‌ బాగుంది ? సినిమా ఆ తరహాలో ఉంటుందా?

బన్నీవాస్‌: ఇది ఓ మంచి చిత్రం. సినిమా చూసిన వారు ఓ గుడ్‌ సినిమా చూశామనే ఫీల్‌ ఉంటుంది. ఈ గుడ్‌ సినిమా జనాల్లోకి ఎంత వెళుతున్నానేది విడుదల తరువాత తెలుస్తుంది. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది.

వంశీ నందిపాటి: ఈ జానర్‌ నుంచి ఏది ఎక్స్‌పెక్టేషన్స్‌ చేస్తారో అవి అన్ని ఈ చిత్రంలో ఉంటాయి.

సినిమాకు ముందుగానే ప్రీమియర్స్‌ ఉంటాయా?

వంశీ నందిపాటి: కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రీమియర్స్‌ వేస్తాం.

IMG 20251221 WA0367

ఈటీవీ విన్‌తో కలిసి సినిమాల చేస్తారా?

వంశీ నందిపాటి: ఈటీవీ వాళ్లతో కంటిన్యూ అవుతాం.. మంచి కంటెంట్‌ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్లతో అసోసియేట్‌గా ఉంటాం.

వంశీ నందిపాటి గారు 2026లో మీ ప్లానింగ్‌ ఏమిటి?

పోలీమేర-3 ఫిబ్రవరిలో లేదా మార్చిలోఉంటుంది. ఏషియాన్‌ సునీల్‌, బీవీ వర్క్స్‌తో కలిసి ఈసినిమా ఉంటుంది.

ఈషా ప్రాజెక్ట్‌లోకి మీరు ఎంటర్‌ అయినా తరువాత చేసిన మార్పులేమిటి?

బన్నీవాస్‌ : చిన్న చిన్న మార్పులు, ఓ ఆరు నిమిషాలు నిడివి తగ్గించాం. ఆర్‌ఆర్‌లో చిన్న చిన్న మార్పులు చేశాం. మనం చెప్పే మార్పును అంతా తొందరగా ఒప్పుకునే దర్శకుడు కాదు. అయిన కూడా కన్వీన్స్‌ అయినా మార్పులు మాత్రమే చేశాం.

ఈ సినిమాను థియేటర్‌లో ఎలా ఉండబోతుంది?

థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ చాలా బాగుంటుంది. సినిమా ఎవరినీ డిజప్పాయింట్‌ చేయదు.

సినిమా ప్రొడక్షన్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ అవ్వడం.. హిట్‌ కొట్టడం ఎలా ఉంది?

ఇప్పుడు మేము వెళుతున్న జర్నీ బెటర్‌.. ఫస్ట్‌కాపీ చూసిన తరువాత మా జడ్జిమెంట్‌ బాగుంటుంది. ఇది మా ఇద్దరికి బాగుంది.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ వాసు –  వంశీ గారు,

  కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *