Bubble Gum Movie Review & Rating: ప్రేక్షకులను అంటుకొని (ఆకట్టుకోని) రొటీన్ బబుల్ గమ్ స్టోరీ !

bubble gum review by 18F movies e1703864873157

మూవీ: బబుల్ గమ్ (Bubble Gum Movie)

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023

నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు

దర్శకుడు : రవికాంత్ పేరేపు,

నిర్మాతలు: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,

సంగీతం: శ్రీ చరణ్ పాకాల,

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు,

ఎడిటర్లు: రవికాంత్ పేరు, కె బాలకృష్ణ రెడ్డి, బాలు మనోజ్ డి, సెరి-గన్ని,

bubble gum review by 18F movies 11

బబుల్ గమ్ రివ్యూ (Bubble Gum Movie Review): 

తెలుగు సినీ పరిశ్రమ లో దేవదాస్ కనకాల అంటే తెలియని వారు ఉండరు. అలాంటి కనకాల ఫ్యామిలీ ఫిల్మ్ ఇన్స్టూట్ నడుపుతూ ఎంతో మంది సినీ కళా కారులను తయారుచేస్తూ, సినీ పరిశ్రమ కి అంకితమైన ఈ  ఫ్యామిలీ నుండి మూడో తరం వారసుడు గా, రాజీవ్ కనకాల- సుమ కనకాల ముద్దుల కొడుకు రోషన్ కనకాల ను హీరోగా మానస చౌదరి అనే తెలుగు అమ్మాయిని హీరోయిన్‌ గా పరిచయం చేస్తూ దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ముద్దుల చిత్రం ‘బబుల్ గమ్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

bubble gum review by 18F movies 7

మరి ప్రేక్షకులను ఈ బబుల్ గమ్ అనే ముద్దుల చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి  తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line): 

ఆది (రోషన్ కనకాల) హైదరాబాద్ ఓల్డ్ సిటీ గల్లీలలో పుట్టి పెరిగిన పక్కా నాటు కుర్రాడు. సంగీతం మీద ఇంటరెస్ట్ నో లేక పోరీలకోసమో తెలియదు కానీ, పబ్ లో డీజే కావాలనేది అతని గోల్. డీజే కావడం కోసం ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ కష్ట పడుతూ  డిజె కి అసిస్టెంట్ గా చేస్తూ డిజే అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

ఓ రోజు అనుకోకుండా దొస్తుల సహాయం తో పబ్ లో డిజేగా కన్సోల్ ఆపిరేట్ చేస్తున్నప్పుడు  జాహ్నవి (మానస చౌదరి) అనే రిచ్ గర్ల్ ని చూసి ప్రేమలో పడతాడు. జాహ్నవి ఓ పెద్దింటి అమ్మాయి. పైగా లవ్ అండ్ రిలేషన్స్ పై పెద్దగా నమ్మకం లేని అమ్మాయి. ఓ ఆరు నెలలలో హైయర్ స్టడీస్ కోసం ఫారన్ వెళ్ళడం కోసం ప్లాన్ చేసుకొని, ఈ కాళీ టైమ్ లో ఫ్రెండ్స్ తో పార్టీలు, పబ్బలు అంటూ తిరుగుతుంది.

మరి అలాంటి అమ్మాయి తాడు బొంగరం లేని అబ్బాయి ప్రేమలో పడిందా ?,

ప్రేమ లో పడితే వారి ప్రేమ కథలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ?,

చివరకు ఆది జాహ్నవి ఒకటి అయ్యారా ? లేదా ?,

ఇంతకీ ఆది తన గోల్ ను రీచ్ అయ్యాడా ? లేదా ?

అనే ప్రశ్నలకు జవాబులే మిగిలిన కథ.

bubble gum review by 18F movies 12

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఈ ‘బబుల్ గమ్’ కధ నే కొంచెం బొల్డ్ గా ఉన్నా, కధనం ( స్క్రీన్ ప్లే) బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే, సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. మెయిన్ క్యారెక్టర్స్ అయిన హీరో హీరోయిన్ పాత్రల జర్నీ సరిగ్గా డిజైన్ చేయకపోవడం,వాటి చుట్టూ అల్లుకొన్న కధనం కూడా ఫేక్ గా   బొల్డ్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

నిజానికి, ఈ జనరేషన్ లో ఇలాంటి బొల్డ్ ప్రేమ కథలను చూడటానికి యూవత ఆసక్తి చూపిస్తారు. RX100, బేబీ వంటి  సినిమాలు ఇలానే బొల్డ్ గా ఉంటూ మంచి ట్రీట్ మెంట్ వలన హిట్ అయ్యాయి.  ఐతే, అలాంటి కంటెంట్ కధనం తో పాటూ ఫ్రెష్ నెస్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఈ బబుల్ గమ్ సినిమాలో ఆ ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది.

ముఖ్యంగా రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా,మిగిలిన సీన్స్ ఆసక్తికరంగా లేకపోవడం సినిమా ఫ్లో కి మైనస్ గా అయ్యింది. దీనికి తోడు దర్శకుడు కొన్ని అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు అని చెప్పవచ్చు.

bubble gum review by 18F movies 9

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

 దర్శకుడు రవికాంత్ పేరేపు రాసుకొన్న కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ బబుల్ గమ్ సినిమా ఓకరకంగా కొంత బరువైన ప్రేమ కథలా ఉంది. ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఇప్పటి యువత కి నచ్చవచ్చు. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ కూడా బాగున్నాయి. ఇలా మొత్తానికి బబుల్ గమ్ సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పరంగా ఆకట్టుకుంటుంది.

 రోషన్ కనకాల తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ రోషన్ కనకాల ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

హీరోయిన్ మానస చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రల్లో నటించిన హర్ష వర్ధన్ – అను హాసన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు

bubble gum review by 18F movies 8

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సమకూర్చిన పాటలు బాగున్నాయి. చప్పగా సాగిపోతున్న కొన్ని సీన్స్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లేపే ప్రయత్నం చేసినా చాలా చోట్ల బోర్ ఫీల్ అవ్వడం తప్ప చేసేది ఏమి లేదు.

కెమెరామెన్ సురేష్ రగుతు అందించిన సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. గోవా లో తెరకెక్కించిన కొన్ని సీన్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

రవికాంత్ పేరు, కె బాలకృష్ణ రెడ్డి, బాలు మనోజ్ డి, సెరి-గన్ని కలిసి చేసిన ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

ఈ చిత్ర నిర్మాతలు మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్ లో క్వాలిటి సినిమా ని నిర్మించారు అని చెప్పవచ్చు.

bubble gum review by 18F movies 5

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

కనకాల ఫ్యామిలీ నుండి వచ్చిన మూడో తరం యూవకుడు రోషన్ కనకాల “బబుల్ గమ్’ అంటూ చేసిన  ఈ బోల్డ్ లవ్ డ్రామా సిన్మా లో కొన్ని ఎమోషన్స్, బోల్డ్ సీన్స్యువతని ఆకట్టుకుంటాయి అనుకోవాలి. అయితే రోషన్ కనకాల నటన ఈ  సినిమాలోని ఆది పాత్ర కి సరైన న్యాయం చేసాడు అని చెప్పవచ్చు.

ఐతే, ఈ బబుల్ గమ్ కథ, అందులోని కాన్ఫ్లిక్ట్ సీన్స్ న్యాచురల్ గయ లేకపోవడం మరియు కథనం కూడా స్లోగా సాగడం, రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

ఓవరాల్ గా ఈ చిత్రంలో లవ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించక పోయినా యూత్ ని కొంత మేరకు ఆకట్టుకుంటాయి అని నమ్మి తీసిన దర్శక నిర్మాతల ఆభిరుచి ని మెచ్చుకోవాలి.

చివరి మాట: బొల్డ్ గా సాగిన గమ్ స్టోరీ !

18F RATING: 2.5/5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *