నేను గురువుగా భావించే మావయ్యతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.: కథానాయకుడు సాయి ధరమ్ తేజ్

IMG 20230726 WA0181 e1690444096766

 

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్ కథానాయికలు.

జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మా 18F మూవీస్ విలేకరి తో బ్రో  కథానాయకుడు సాయి ధరమ్ తేజ్, బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

IMG 20230726 WA0102

బ్రో చేయడం ఎలా ఉంది?

సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో నవ్వు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఆయనతో(పవన్ కళ్యాణ్) కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం. కథ కూడా వినకుండానే సినిమా చేయడానికి అంగీకరించాను. మాతృక కూడా చూడలేదు. ఆ తర్వాత మొత్తం కథ విన్నాక చాలా బాగుంది అనుకున్నాను. ఇది నా కెరీర్ కి ట్రిబ్యూట్ ఫిల్మ్. నేను గురువుగా భావించే మావయ్యతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.

IMG 20230726 WA0179

మొదటిరోజు సెట్ లో అడుగుపెట్టినప్పుడు ఎలా అనిపించింది

మొదటిరోజు కంగారు పడ్డాను, వణికిపోయాను. మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు, నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కనపెట్టారు. దాంతో వెంటనే సెట్ అయిపోయాను. సముద్రఖని గారు కూడా బాగా సపోర్ట్ చేశారు.

కథతో పర్సనల్ గా ఏమైనా కనెక్ట్ అయ్యారా?

కథ ఓకే సమయానికి నాకు యాక్సిడెంట్ జరగలేదు. అది యాదృచ్చికంగా జరిగింది. టైం విషయంలో మాత్రం కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కుటుంబంతో సమయం గడపటాన్ని ఇష్టపడతాను. మా అమ్మగారితో గానీ, నాన్న గారితో గానీ రోజులో ఏదొక సమయంలో కాసేపైనా గడుపుతాను. నా దృష్టిలో కుటుంబసభ్యులు, స్నేహితులతో సమయం గడపటం కంటే విలువైనది ఏదీ లేదు.

20230726 112155

త్రివిక్రమ్ గారి గురించి?.. ఆయన మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
త్రివిక్రమ్ గారి లాంటి గొప్ప టెక్నీషియన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఏమైనా సలహాలు ఇచ్చినా కథ గురించే ఇస్తారు.

IMG 20230726 WA0182

సెట్ లో మెమొరబుల్ మూమెంట్ ఏంటి?
ప్రతి క్షణం మెమొరబుల్ మూమెంటే. మా మావయ్యతో అన్నిరోజులు సమయం గడిపే అవకాశం లభించింది. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నన్ను సరదాగా ఆటపట్టిస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు నాతో ఎంత సరదాగా ఉండేవారో, ఇప్పటికీ నాతో అలాగే ఉన్నారు. చిన్నప్పుడు నేను కళ్యాణ్ మావయ్యతో ఎక్కువ సమయం గడిపేవాడిని. దాంతో తెలియకుండానే ఆయనతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

షూటింగ్ ప్రారంభమైన మొదట్లో మీరు కాస్త ఇబ్బంది పడ్డారని ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా?
యాక్సిడెంట్ తర్వాత అప్పటికి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడు మాట ఇంత గట్టిగా వచ్చేది కాదు. దాంతో డైలాగ్ లు చెప్పేటప్పుడు ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసింది. డబ్బింగ్ విషయంలో బాగా కష్టపడ్డాను. అప్పుడు నాకు పప్పు గారు బాగా సపోర్ట్ చేశారు. విరూపాక్ష సమయంలో కూడా ఆయన బాగా సపోర్ట్ చేశారు.

20230726 012517 1

పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు?

పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ నాకు ఈ సినిమాకి మాత్రమే కాదు.. నా మొదటి సినిమా నుంచి ఉంది. మనం ఊపిరి పీల్చుకోవడానికి గాలి ఎలాగైతే ఉందో, ఆయన సపోర్ట్ కూడా నాకు అలాగే ఉంది.

పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేస్తున్నారని తెలియగానే చిరంజీవి గారు మరియు ఇతర కుటుంబసభ్యుల స్పందన ఏంటి?

అందరూ చాలా సంతోషపడ్డారు. చిరంజీవి గారైతే మీ గురు శిష్యులకు బాగా కుదిరింది అంటూ చాలా ఆనందపడ్డారు.

IMG 20230725 WA0089

మీ ఫ్యామిలీ హీరోలతో కాకుండా వేరే హీరోలతో పని చేయాలని ఉందా?

ఖచ్చితంగా ఉంటుంది. మంచి కథ దొరికితే నేను ఎవరితోనైనా చేయడానికి సిద్ధమే. ముఖ్యంగా రవితేజ గారు, ప్రభాస్ అన్నతో చేయాలని ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ అన్న, నా ఫ్రెండ్ తారక్, మనోజ్ ఇలా అందరితో చేయాలని ఉంది.

పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నారు.. ఆ ప్రభావం సెట్ లో ఏమైనా కనిపించిందా?

రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎన్ని పనులున్నా ఒక్కసారి సెట్ లోకి వచ్చారంటే సినిమాలోని ఆ పాత్రకు ఎలా చేయాలనే ఆయన ఆలోచిస్తారు. బయట విషయాలన్ని మర్చిపోయి, ప్రస్తుతం చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది చేయగలగడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను.

IMG 20230726 WA0178

తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు కదా.. ఏమైనా ఒత్తిడి అనిపించిందా?

మావయ్య తో కలిసి పని చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఏరోజు కూడా కొంచెం కూడా ఒత్తిడి అనిపించలేదు. అయన గడిపే సమయం నాకు చాలా విలువైనది. కాబట్టి ఒత్తిడి అనే మాటే ఉండదు.

కథానాయికలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ గురించి?

వైష్ణవ్ తో ఒక సినిమా చేసింది కాబట్టి కేతిక నాకు ముందుగానే తెలుసు. మన తెలుగు భాష కానప్పటికీ కేతిక గానీ, ప్రియా గానీ ముందే డైలాగ్ లు ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యేవాళ్ళు. అదిచూసి నాకు ముచ్చటేసింది. ఇద్దరిది కష్టపడి చేసే స్వభావం.

సినిమా ఎలా ఉండబోతుంది?

ఈ సినిమాలో సందేశం ఉంటుంది. ఈ క్షణంలో బ్రతకడం గురించి చెబుతుంది. మన కష్టం మనం పడితే అందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని చెబుతుంది. అదే సమయంలో కామెడీ, రొమాన్స్ ఇలా మిగతా అంశాలన్నీ కావాల్సిన మోతాదులో ఉంటాయి.

20230724 130239

థమన్ సంగీతం గురించి?

సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సంగీతం అద్భుతంగా ఉందని చెప్తారు. క్లైమాక్స్ లో ఆయన అందించిన నేపథ్య సంగీతానికి నేనైతే కంటతడి పెట్టుకున్నాను. సముద్రఖని గారు, థమన్ గారు కలిసి మ్యాజిక్ చేశారు.

త్రివిక్రమ్ గారి సంభాషణలు ఎలా ఉండబోతున్నాయి?

ఎప్పటిలాగే చాలా బాగుంటాయి. ముఖ్యంగా సినిమా చివరిలో నాకు, కళ్యాణ్ మావయ్యకి మధ్య సంభాషణలు కంటిపడేస్తాయి. తేలికైన పదాలు లాగే ఉంటాయి కానీ అందులో లోతైన భావం ఉంటుంది.

IMG 20230725 231917 scaled

కొద్దిరోజులు విరామం తీసుకోవాలి అనుకుంటున్నారా?

ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చిన్న విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. విరూపాక్ష తర్వాతే తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇంతలో బ్రో షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా మెరుగయ్యాను. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకొని మరింత దృఢంగా వస్తాను. ఇప్పటికే సంపత్ నంది గారి దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించాను.

DSC 3180 scaled

మిమ్మల్ని యాక్సిడెంట్ సమయంలో కాపాడిన అబ్దుల్ కి ఏమైనా సాయం చేశారా?
కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. నేను అతనికి కొన్ని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే అతను నా ప్రాణాన్ని కాపాడాడు. నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెప్పాను. ఈమధ్య కూడా అతన్ని కలిశాను. నా టీం అతనికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.

చిరంజీవితో గారితో కలిసి ఎప్పుడు నటిస్తారు?

ముగ్గురు మావయ్యలతో కలిసి నటించాలని నాకు ఎప్పటినుంచో ఆశ. నాగబాబు మావయ్యతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో నటించాను. కళ్యాణ్ మావయ్యతో బ్రో చేశాను. అలాగే చిరంజీవి మావయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

IMG 20230723 WA0049

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి?

వారిలో స్పెషాలిటీ ఉంది. అప్పుడు వెంకటేష్ గారు, చైతన్యతో కలిసి వెంకీమామ చేశారు. ఇప్పుడు కళ్యాణ్ మామ, నాతో కలిసి బ్రో చేశారు. ఆ బ్యానర్ లో సినిమా చేయడం కంఫర్ట్ గా ఉంటుంది. చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ బ్యానర్ లో సినిమా చేస్తాను.

థాంక్యూ అండ్ అల్ ద బెస్ట్ తేజూ గారూ…,

  1. * కృష్ణ ప్రగడ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *