Bigg Boss Seven Contestant Gautam Krishna Solo Boy Update: సోలో బాయ్ గా బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి! 

Bigg Boss Seven Gautam Krishna who is coming to us as Solo Boy 3 e1713084938801

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

నేడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిత చౌదరి గారు మాట్లాడుతూ : నన్ను అమ్మగా, అక్కగా, చెల్లిగా, వదినగా అన్ని పాత్రల్లోనూ ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా గౌతమ్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో గౌతమ్ కి తల్లి పాత్రలో చేస్తున్నాను. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు అందరి గురించి ఆలోచిస్తాడు. సెవెన్ హిల్స్ సతీష్ గారు ఈ సినిమాని ఎంతో పాషన్ తో నిర్మించారు. డి ఓ పి గా త్రిలోక్ పనితీరు చాలా బాగుంది. ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది అదేవిధంగా ఈ సోలో బాయ్ సినిమాలో కూడా ఒక మంచి ఫీల్ ఉంది. ప్రేక్షకుల సినిమా ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Bigg Boss Seven Gautam Krishna who is coming to us as Solo Boy 2

డైరెక్టర్ పి. నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ : నాకు ఈ అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి రుణపడి ఉంటాను. ముందుగా గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమాలో నటించిన పోసాని కృష్ణ మురళి గారు, అనిత చౌదరి గారు, భద్రం గారు, సూర్య గారు ఎవరికి పాత్ర కి చాలా బాగా నటించారు. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

డిఓపి త్రీలోక్ మాట్లాడుతూ : గౌతమ్ కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశాన్నిచ్చిన ఒక ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గారికి డైరెక్టర్ నవీన్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Bigg Boss Seven Gautam Krishna who is coming to us as Solo Boy 4

ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ : ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా మీడియా అలాగే ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఆదరిస్తారు. ఈ సోలో బాయ్ సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి కృతజ్ఞతలు.

అదేవిధంగా మంచి క్యారెక్టర్స్ అని చెప్పగానే ముందుకు వచ్చి మేము చేస్తాము అని వచ్చిన పోసాని కృష్ణ మురళి గారికి, అనిత చౌదరి గారికి కృతజ్ఞతలు. భద్రం, సూర్య కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. అదేవిధంగా నా తమ్ముడు గౌతమ్ కృష్ణ. ఈ సినిమాతో నాకు సొంత తమ్ముడిలాగా సపోర్ట్ ఇచ్చాడు. గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా బాగా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని అన్నారు.

Bigg Boss Seven Gautam Krishna who is coming to us as Solo Boy 2 e1713085000640

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్న ఇలా నాకు ఒక టీం ఉంది నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు అనగానే కథ విని సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్న. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌ ని తీసుకొస్తున్నాం.

అదేవిధంగా అనితా చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :

గౌతం కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు

సాంకేతిక బృందం:

కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరి, సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు, సంగీతం – జుడా సంధ్య, కో-డైరెక్టర్ – కినోర్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్, లిరిక్ రైటర్స్ – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి, కొరియోగ్రాఫర్: ఆటా సందీప్, బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్, నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, దర్శకత్వం – పి. నవీన్ కుమార్, పి ఆర్ ఓ : మధు VR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *