Bhola Shankar Court Issue: “భోళా శంకర్” వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు గురువారం వెలువడనున్న తీర్పు

IMG 20230808 WA0046 e1691608639256

“భోళా శంకర్” సినిమా వివాదంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇరుపక్షాల మధ్య జరిగిన వాదోపవాదనలు ముగిశాయి. తీర్పు గురువారం వెలువడనుంది. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే.

Agent Issue e1691608482369

ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) స్పందిస్తూ, “ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి,, నా వద్ద నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకుని, అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా వారు నన్ను మోసగించారు.

Agent Issue 2 e1691608577523

మూడు రాష్ట్రాలకు కాకుండా కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందు నా డబ్బులు చెల్లిస్తామని, లెటర్ అఫ్ అండర్ టేకింగ్ ఇచ్చి కూడా వారు సమాధానం చెప్పడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో నేను న్యాయం కోసం కోర్టుకు ఎక్కాను” అని చెప్పారు.

Agent Issue 1 e1691608526272

అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ వారు ఇచ్చిన అండర్ టేకింగ్ లో తదుపరి సినిమా విడుదలకు ముందు బత్తుల సత్యనారాయణకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. వారి తదుపరి సినిమా భోళాశంకర్ కావడంతో, మా క్లయింటు డబ్బులు ఇచ్చేంతవరకు సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోర్టులో కేసు వేయడం జరిగింది.

ఆ మేరకు సిటీ సివిల్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. గురువారం తీర్పు వెలువడుతుంది” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *