చిత్రం: భీమా
విడుదల తేదీ : మార్చి 08, 2024
నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
దర్శకుడు: ఏ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
సంగీత దర్శకులు: రవి బస్రూర్
సినిమాటోగ్రాఫర్: స్వామి జె గౌడ
ఎడిటింగ్: తమ్మిరాజు
మూవీ: భీమా రివ్యూ (Bhimaa Movie Review)
మా 18F మూవీస్ టీం ఎప్పుడూ ఏ సినిమా అయినా మొదటి రోజు చూసేసి రివ్యూ రాసిపెట్టుకొని రెండవ రోజు లేదా మూడవ రోజు ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా కలిపి పబ్లిష్ చేస్తాము. ఈ విదానం వలన ఎక్కువ మంది రివ్యూ రీడర్స్ కి చేరుకోకపోయినా మాకున్న, మమ్మలను నిజాయితీగా ఫాలో అవుతున్న పాఠక దేవుళ్ళకు కరెక్ట్ సమీక్షను ఇస్తూ అదే టైమ్ లో మూవీ టీం కి కూడా మా సమీక్ష వలన నిరాశ లేకుండా చేస్తాము.
భీమా సినిమా గురించి చూస్తే.. మచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ అగ్ర – దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ భీమా ఈ శుక్ర వారమే మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది.
మరి ఈ మాస్ యాక్షన్ భీమా సినిమా ఎలా ఉంది, తెలుగు సినీ ప్రేక్షకుల అంచనాలు అందుకొందా? లేదా ? అనే అంశాలు మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !.
కధ పరిశీలిస్తే (Story Line):
పరశురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ మూవీ ప్రారంభం అవుతుంది. ఇక మొదటి 15 నిముషాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మున్ముందు కథ పై మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి. పోలీస్ ఆఫీసర్ అయిన భీమా (గోపీచంద్) తనదైన స్టైల్ లో క్రిమినల్స్ ని పట్టుకుని వారి ఆట కట్టించే హానెస్ట్ పోలీస్ అధికారి. అయితే మహేంద్రగిరి ప్రాంతా ప్రజలను బరాయబ్రాంతులకు గురి చేస్తూ తన అక్రమ కార్య- కలాపలతో ఏలుతున్న భవాని (ముకేశ్ తివారి) కి భీమా పెద్ద సమస్యగా మారతాడు.
ఒకానొక సమయంలో స్కూల్ టీచర్ గా పని చేస్తున్న విద్య (మాళవిక శర్మ) తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు భీమా. అయితే తన ప్రకృతి సిద్దమైన మందులతో ఎందరినో కాపాడుతున్న రవీంద్ర వర్మ (నాజర్) అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది. అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పనిచేయమని కోరతాడు. అదే పలు పరిస్థితులకు దారి తీస్తుంది, ఈ సమస్యే కధను అనేక మలుపులు తిప్పుతుంది.
మరి ఇంతకీ భీమాని రవీంద్ర వర్మ కోరింది ఏంటి?
. భవాని కి భీమాకి మధ్య వైరం ఎందుకు వచ్చింది ?
భీమా తన నిజాయితీ చివర వరకూ కొనసాగించడా ? లేదా ?
రవీంద్ర వర్మ అప్పగించిన పనితో భీమా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?
పోలీస్ తో పాటు మరో రూపం లో కనిపిస్తున్న మరో గోపీచంద్ ఎవరు ?
ఈ రెండు వైవిద్య పాత్రల మద్య ఉన్న సంబంధం ఏమిటి ?
చివరికి ఏమి జరిగింది అనే విశయం మొత్తం సస్పెన్స్ తో కూడిన ఈ భీమా సినిమాని దియేటర్ లో మాత్రమే చూడాలి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
కధ బాగున్నా కధనం (స్క్రీన్ – ప్లే) ఎందుకో కధకు తగ్గ పాయింట్స్ తో సాగలేదు అనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ తో మంచి ఇంట్రడక్షన్ సీన్ వచ్చినా అనంతరం కథనం రొటీన్ ఫార్ములలో స్లో గా సాగుతుంది. ఇలాంటి వాటిలో కొన్ని ఉదాహరణలు తీసుకొంటే పోలీస్ స్టేషన్ సీన్స్ తో పాటు వచ్చే లవ్ ట్రాక్ లో మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న కొన్ని వల్గర్ సైన్ లతో వచ్చే సీన్స్ అయితే కొంతమంది సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే అలరిస్తాయి.
ఇంకా మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) మొత్తం కూడా పోలీస్ అయిన భీమా పాత్ర పై నడిపించారు, అయితే అందులో లవ్ ట్రాక్ ఎక్కువగా ఉండడం పెద్ద మైనస్. ఐతే కథ లోని మెయిన్ పాయింట్ ని ఇంటర్వెల్ బ్లాక్ కి వచ్చే వరకు చూపించకపోవడం కూడా ప్రేక్షకులను నిరాశ్ర లో పెట్టారు అని చెప్పాలి.
కానీ ఇంట్రవెల్ బ్యాంక్ మాత్రం చాలా బాగా కుదిరింది. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) నిరాశ పరిచినా తర్వాత వచ్చే రెండవ అంకం (సెకండ్ హాఫ్) కోసమే ఎక్కువగా ఎదురుచూసేలా రాసుకున్నారు దర్శక రచయితలు. ఓవరాల్ గా చూస్తే మాటల రచయిత అజ్జి మహాకాళి స్ట్రాంగ్ పద జాలం తో రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నా, ఇందులో చూపించిన కొన్ని రొమాంటిక్ సీన్స్ మాత్రం అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ కావు.
దర్శకుడు Aహర్ష స్పెశాలిటీ ఏంటంటే బ్యాక్ అండ్ ఫార్త్ స్టైల్ స్క్రీన్‌ప్లే. అదే కధనాన్ని (స్క్రీన్ – ప్లే) ఈ సస్పెన్స్ కధకు కూడా అతిగా ఉపయోగించడం తో సామాన్య ప్రేక్షకులకు కధని అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది అనిపించి గందరగోళం ఏర్పడింది. అందుకే మొదటి రోజు తర్వాత దియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు Aహర్ష రాసుకొన్న కధ ను స్ట్రెయిట్ గా చెప్పడం కంటే ఆ కధను బ్యాక్ అండ్ ఫార్త్ స్టైల్ స్క్రీన్‌ప్లే తో చెప్పడం లో దిట్ట. తన స్ట్రెంత్ కి తగ్గట్టుగానే ఓక మాస్ కధను టాలీవుడ్ లో ఓక మాస్ హీరో అయిన గోపీచంద్ తో తియ్యడం మెచ్చుకోతగ్గ విశయం. అలానే ఇటీవల కాలంలో గోపీచంద్ నటించిన మంచి మాస్ యాక్షన్ పాత్రల్లో భీమా ఒకటి. దీనిని దర్శకుడు హర్ష మాస్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ గా తియ్యగాలిగాడు అని చెప్పవచ్చు.
యాక్షన్ తో కూడిన కథలో మంచి ఫాంటసీ ఎలిమెంట్ ని జొప్పించి దర్శకుడు ఏ హర్ష భీమా సినిమా ని బాగానే తెరకెక్కించారు. మాస్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ పోర్షన్స్ ఎంతో బాగున్నాయి.
అలానే హీరో గోపీచంద్ కూడా భీమా పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఇక తన పాత్రలో ఉన్న మరొక కోణాన్ని సైతం గోపీచంద్ సూపర్ గా ప్రదర్శించి ఆడియన్స్ ని అలరించారు. కాకపోతే గోపీచంద్ గత చిత్రాల మూస లోనే ఈ సినిమా కూడా ఉన్న ఫీల్ వస్తుంది.
ఓక హీరోయిన్ మాళవిక శర్మ పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో ఆమె సీన్స్ మరింత బాగున్నాయి. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) లొని సీన్స్ కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా తన ఫెరఫార్మెన్స్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.
మరో పాత్రలో కనిపించిన ప్రియ భవానీ శంకర్ కూడా తన పాత్ర పరిడి మేరకు నటించి మెప్పించింది.
నరేష్, ముఖేష్ తివారీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు. ఇక మూవీలో లాస్ట్ అరగంట అయితే ఎంతో బాగుంటుంది. ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు, కీలకమైన ట్విస్ట్ మరియు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు చక్కగా కుదిరాయి మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పండుతాయి.
వెన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా తెరకెక్కించారు. మిగిలిన నటి నటులు తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మ్యూజిక్ దర్శకుడు రవి బస్రూర్ అందించిన ఇంపాక్ట్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైవోల్టేజ్ సీన్‌లను మరొకస్థాయికి తీసుకువెళ్లింది. భీమా సినిమా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇంత ఇంపాక్ట్ ఫుల్ గా ఉన్నాయి అంటే దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అని చెప్పక తప్పదు.
స్వామి జె గౌడ అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నైట్ సీన్స్ బాగున్నాయి.
తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ కూడా బాగా సెట్ అయ్యింది. యాక్షన్ సీన్స్ మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ షార్ప్ ఎడిట్ తో బాగా ఎలివేట్ అయ్యాయి.
నిర్మాత కేకే రాధామోహన్ సినిమా కి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు మంచి మాస్ సినిమాకి కావాల్సిన యాక్షన్ సీన్స్ కి కావలసిన సెట్స్ వేయించడం లో ఎక్కడ ఖర్చుకి రాజీ పడకుండా నిర్మించారు అని చెప్పవచ్చు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
మా 18F మూవీస్ టీం ఎప్పుడూ ఏ సినిమా అయినా మొదటి రోజే లేదా కినేయం క్రూ + మీడియా తో ప్రీమియర్ షో చూసి రివ్యూ రాసిపెట్టుకొని విడుదల అయిన రెండవ రోజు లేదా మూడవ రోజు ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా కలిపి పబ్లిష్ చేస్తాము. ఈ విదానం వలన ఎక్కువ మంది సినిమా సమీక్షలు చదివే ప్రేక్షకులకి ( రివ్యూ రీడర్స్) చేరుకోకపోయినా మాకున్న రెగ్యులర్ పాఠక దేవుళ్ళకు నికార్ష్అయిన సమీక్ష ఇవ్వాలి అనే మా ఈ చిరు ప్రయత్నాన్ని ఆశీస్వాదించండి.
మచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులు చూడగలిగే యాక్షన్ మాస్ డ్రామా మూవీ అని చెప్పాలి. భీమా, రామా అనే రెండు పాత్రలలో గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన మరియు ఫాంటసీ ఎలిమెంట్ కొంతవరకూ పరవాలేదు.
ఓవరాల్ గా భీమా సినిమా హై లైట్స్ గురించి చెప్పాలి అంటే మాస్ అంశాలు, ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ మరియు VFX తో కూడిన రిచ్ విజువల్స్ మాత్రమే. అయితే మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) లో వచ్చే హీరో హీరోయిన్ మద్య లవ్ ట్రాక్ కొంత వల్గర్ గా అనిపించే అంశం. ఆ లవ్ సీన్స్ లో వచ్చే కొన్ని డైలాగ్‌లు ఈ భీమా సినిమాని కొందరి ప్రేక్షకులకు మాత్రమే పరిమితం చేస్తుంది.
ఈ భీమా కోసం తీసుకొన్న కోర్ పాయింట్‌ని హైలైట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నా దానిని మరింతగా ఎలివేట్ చేసే అవకాశం స్క్రీన్ ప్లే లో ఉన్నప్పటికీ, దర్శకుడు మాస్ ఎలిమెంట్స్ కి ప్రదాన్యం ఇవ్వడం వలన కధకి పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వలేక పోయాడు అని చెప్పవచ్చు.
మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) కన్నా రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో వచ్చే కామిడీ సీన్స్ పర్వాలేదనిపించినా, దర్శకుడు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్‌తో సెకండ్ హాఫ్ ని బాగానే నడిపించాడు. మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు అయితే ఈ వారాంతంలో భీమాను చూడవచ్చు. ఇంత మాస్ సినిమా లో కూడా కొన్ని డైలాగ్స్ చాలా అర్దవంతంగా చక్కగా ఉన్నాయి .
మీకు ఎక్స్పెక్ట్ఎసన్స్ ఎక్కువ.. మాకు బడ్జెట్ తక్కువ అంటూ గోపీచంద్ చెప్పే ఓక డైలాగ్ ఈ భీమా సినిమా ప్రేక్షకుల ఎక్స్పెక్ట్ఎసన్స్ కి రీచ్ అవ్వడం కష్టమే..
చివరి మాట: భీమా ! రొటీన్ ఫార్ములా రామా !
18F RATING: 2.5 / 5
* కృష్ణ ప్రగడ.