మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది.
ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ…అందరికి నమస్కారం. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృద్వి ఇందులో ఎంటర్తినింగ్ గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు.
ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్ తో చేశారు. ఇందులో సునీల్ తో మళ్ళీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య కిషోర్ మురళీధర్ గారు గెటప్ శీను సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్ళతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను.
అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్స్ట్ శివ నిర్మాణంతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.
మా డైరెక్టర్ కిషోర్ తిరుమ ప్రమోషన్స్ లో డాన్స్ ఇరగదీసారు. ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్ లో కలుద్దాం.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్ లో నా సినిమా ఖచ్చితంగా ఉంటుంది ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. మిరపకాయ వచ్చిన మిస్టర్ బచ్చన్ వచ్చిన ఒకేలా ఉండే వ్యక్తి రవితేజ. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారిలో తర్వాత రవితేజ గారిలో చూశాను. ఆయన డైరెక్టర్స్ గా పరిచయం చేసిన వాళ్ళందరూ ఈరోజు స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు.
నాకు డైరెక్టర్ జన్మ పునర్జన్మ ఇచ్చింది ఆయనే. మళ్ళీ రవితేజ గారితో బ్లాక్ బస్టర్ తీస్తాను. అది నా ప్రామిస్. ఈ సినిమాలో అందరూ నాకు నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూసిన వెంటనే బ్లాక్ బస్టర్ ఫీలింగ్ వచ్చింది. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్. తప్పకుండా ఈ సినిమా తనకి బ్లాక్ బస్టర్ అవుతుంది.
చాలా సంవత్సరాల క్రితం జనవరి 11న మిరపకాయ రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ జనవరి 13న ఈ సినిమా వస్తుంది. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది.సంక్రాంతికి చాలా గట్టిగా కొడుతున్నాం.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ… మాలాంటి ఎంతో మంది డైరెక్టర్స్ అయ్యారంటే రవితేజ గారు పెట్టిన బిక్ష. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న మమ్మల్ని డైరెక్టర్లు చేశారు. త్వరలోనే ఆయనతో సినిమా చేస్తాను. రవితేజ గారు ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్న సినిమాలు చేశారు. పవర్ సినిమా టైంలో డైరెక్టర్ కిషోర్ డైలాగ్స్ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. కచ్చితంగా తన నిజాయితీ తన హార్డ్ వర్క్ ఈ సినిమాకి పే చేస్తుంది.
ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ అభినందనలు. ప్రసాద్ మూరెళ్ల రవితేజ గారిని చాలా అందంగా చూపించారు. బీమ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందని ఓ పర్సన్ చెప్పారు. ఆయనే చెబితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరికీ ఆల్ ది బెస్ట్.
డింపుల్ హయాతి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో నేను చేసిన బాలమణి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా కొత్తదనం ఆడియన్స్ ఫీల్ అవుతారు. మా నిర్మాత సుధాకర్ గారు సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగా హిట్ అయ్యాయి. రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. ఆయనతో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది డైరెక్టర్ గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది
హీరోయిన్ ఆశిక రంగనాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది అద్భుతమైన జర్నీ. మా నిర్మాత సుధాకర్ గారికి థాంక్యూ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. రవితేజ గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. విక్రమార్కుడు లో ఆయన రెండు క్యారెక్టర్స్ ని ప్లే చేసిన ప్లే చేసిన విధానం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అలాంటి సూపర్ సార్ తో నేను నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా వండర్ఫుల్ జర్నీ. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు
ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. జనవరి 13 న మా బీఎండబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైట్ కి వెళ్ళండి. కచ్చితంగా అదిరిపోతుంది.
మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి యాక్టర్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. జనవరి 13న తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈవెంట్ చూస్తుంటే సంక్రాంతి ఎర్లీగా వచ్చింది అనిపిస్తుంది. రవితేజ గారు అంటేనే సరదా. ఆ సరదా 13వ తేదీన 70mm స్క్రీన్ మీద వస్తుంది. సరదాగా ఫ్యామిలీతో అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా కంటెంట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. కిషోర్ గారు రాసే ప్రతి కథ అందరూ రిలేట్ చేసుకునేలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇందులో ఫన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నాకు ఇన్స్పిరేషన్. రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఏ డ్రింక్ లేదు. ఇది చాలా మంచి ఫన్ రైడ్. నిర్మాత సుధాకర్ గారు రాజీ పడకుండా సినిమాని నిర్మించే ప్రొడ్యూసర్. కచ్చితంగా కిషోర్ గారు బ్లాక్బస్టర్ కొట్టాలని తపనతో పని చేశారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.