Bharathanatyam Movie Hero Special Interview: ‘భరతనాట్యం’  హీరో సూర్య తేజ ఏలే స్పెషల్ ఇంటర్వ్యూ!

IMG 20240403 WA0135 e1712144684560

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే మా 18F మూవీస్  ప్రతినిది తో  సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

IMG 20240403 WA0092

హీరో కావాలనే స్పూర్తి ఎప్పుడు.. ఎలా మొదలైయింది? 

నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తివుండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం, నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో వున్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది.

ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది.

అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది.

IMG 20240330 WA03121

దర్శకుడిగా కెవిఆర్ మహేంద్ర గారికే ఈ కథ చెప్పడానికి కారణం?

కెవిఆర్ మహేంద్ర గారితో పరిచయం వుంది. నేను ఆయనకు ఒక డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ఇచ్చాను. అది ఆయనకు నచ్చింది. అప్పటికే ఆయన క్రైమ్ జోనర్ లో ఓ కథ అనుకుంటున్నారు. ఈ కథ ఆయనకు నచ్చుతుందనే నమ్మకంతో చెప్పాను. నా నమ్మకం నిజమైయింది. ఆయనకి నచ్చింది. కెవిఆర్ మహేంద్ర గారు చాలా క్లోజ్ గా వుంటారు. చాలా కామ్ గా వుంటారు. చాలా ఫ్రీడం ఇస్తారు. ఐడియాలని చాలా స్వేఛ్చగా షేర్ చేసుకుంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.

భరతనాట్యం’ ఆలోచన ఎప్పుడు జనరేట్ అయ్యింది ? ఇది ఫిక్షనల్ నా ? 

‘భరతనాట్యం’ ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా వుంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్.

‘భరతనాట్యం’ పేరు పెట్టడానికి కారణం ? 

ఈ కథకు ‘భరతనాట్యం’ పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది.

IMG 20240330 WA03111

 మిరు నటనలో శిక్షణ తీసుకున్నారా? 

వినయ్ వర్మ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. ఏడాది పాటు అన్నపూర్ణలో ఫిల్మ్ కోర్స్ చేశాను.

మీ నేపధ్యం గురించి ? 

మా నాన్న గారు (ధని ఏలే) సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ డిజైనర్ గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్ లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ రాస్తుంటాను. డిజైనింగ్, ఎడిటింగ్ లో అనుభవం వుంది. కోవిడ్ తర్వాత రైటింగ్ లోకి వచ్చాను.

భరతనాట్యం సినిమా  లో హీరోయిన్ కి ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ? 

ఇది లవ్ స్టొరీ కాదు. అన్ని పాత్రలు సమానంగా వుంటాయి. హీరోయిన్ పాత్ర మాత్రం కథలో కీలక పాత్ర పోషిస్తుంది.

మీరు కాకపొతే ఈ సినిమాలో హీరోగా ఎవరు బావుంటారు ? 

శ్రీవిష్ణు గారు, సందీప్ కిషన్ గారైతే బావుంటారు.

క్రైమ్ కామెడీల్లో ఈమధ్య అడల్ట్ కంటెంట్ వస్తుంది. ఈ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?

ఇది ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

IMG 20240402 190726

 ఈ  చిత్ర నీర్మాతల గురించి చెప్పండి ? 

-హితేష్ గారు ముందు నన్ను మనిషిగా నమ్మారు. కథ విని సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. హితేష్, పాయల్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఎక్కడా రాజీపడకుండా మంచి ప్యాడింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. ఒక చిన్న సినిమాకి ఈ స్థాయిలో పబ్లిసిటీ జరుగుతుందంటే అది నిర్మాత ప్రోత్సాహంతోనే సాధ్యపడుతుంది.

కథ రాయడం వేరు.. కథని లిరిక్ రైటర్స్ కి చెప్పడం వేరు..ఈ ప్రాసస్ గురించి చెప్పండి? 

-కాసర్ల శ్యామ్ గారు, అనంత శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు అద్భుతమైన పాటలు రాశారు. అనంత శ్రీరామ్ గారు చాలా ఫన్ పర్శన్. కథ వింటూ మాతో ట్రావెల్ అయ్యారు. భాస్కర భట్ల గారు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఈ ముగ్గురితో బ్యూటీఫుల్ జర్నీ. పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

IMG 20240330 WA03131

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఏం మనిపించింది ? 

సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. వివేక్ సాగర్ గారు ట్రెండీ ఆర్ఆర్ ఇచ్చారు. ఈ స్కేల్ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తారు.

మీ విషయంలో మీ నాన్నగారు ఆనందంగా వున్నారా ?

-నాన్నగారు చాలా ఆనందంగా వున్నారు. ఆయన కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది.

మీకు ఇష్టమైన రచయిత ఎవరు ? 

-నాకు పర్శనల్ గా కృష్ణ వంశీగారు, త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం. అలాగే చాలా మంది నుంచి స్ఫూర్తి పొందాను.

మీరు భవిష్యత్ లో రచయితగా కొనసాగుతారా నటుడి గానా ? 

-సినిమాల్లో ఉందామని అనుకుంటున్నాను. అది ఎలా అయినా పర్లేదు. రచయితగా కొన్ని కథలు వున్నాయి. ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది. చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నా తదుపరి సినిమాకి హెల్ప్ అవుతాయి.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ సూర్య తేజ బ్రో..

  * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *