Bharatha Natyam Movie Director Special Interview: భరతనాట్యం’ చాలా ఫ్రెష్ గా వుంటుంది అంటున్న డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర !

IMG 20240401 WA0216 e1711992688784

 దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం లో సూర్య తేజ ఏలే డెబ్యు హీరో గా ‘భరతనాట్యం’  మూవీ నీ పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ భరత నాట్యం చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది. నేపథ్యంలో దర్శకుడు కె వి ఆర్ మహేంద్ర మా 18F మూవీస్ విలేకరీ తో సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘దొరసాని’ తర్వాత కొంచెం గ్యాప్ రావడానికి కారణం? ‘భరతనాట్యం’ ఎలా మొదలైయింది?

-‘దొరసాని’ తర్వాత ఓ ప్రముఖ హీరోతో ఓ క్రైమ్ డ్రామా అనుకున్నాం. స్క్రిప్ట్ కూడా మొదలుపెట్టాం. స్క్రిప్ట్ జరుగుతున్న సమయంలో కరోనా స్టార్ట్ అయ్యింది. కరోనా కారణంగా సహజంగానే అన్నీ ఆగాయి. ఇదే సమయంలో కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్ళింది. దాని తర్వాత మరో స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న సమయంలో సూర్య తేజ ‘భరతనాట్యం’ ఐడియా చెప్పాఋ. చాలా బావుందనిపించింది. దీనికి కూడా దాదాపు ఇరవై నెలలు సమయం తీసుకొని స్క్రిప్ట్ చేశాం.

IMG 20240401 WA0266

‘దొరసాని’ సినిమా మీరు అనుకున్నంత తృప్తిని ఇచ్చిందా?

-‘దొరసాని’సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎన్ని సినిమాలైన చేయొచ్చు కానీ దొరసానికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. దర్శకుడిగా అది నాకు తృప్తిని ఇచ్చింది.

‘దొరసాని’లో చేయనివన్నీ ‘భరతనాట్యం’లో చేస్తున్నట్లుగా అనిపిస్తోంది?

-దొరసాని ఆర్గానిక్ పిరియాడిక్ పొయిటిక్ లవ్ స్టొరీ. ఖచ్చితంగా కొన్నిటికి కట్టుబడే ఆ సినిమా చేయాలి. భరతనాట్యంకు ఆ బౌండరీలు లేవు. ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ఏ అంశాలు కావాలో అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో కుదిరాయి. అలాగే దొరసాని నుంచి వచ్చిన అనుభవం కూడా హెల్ప్ అయ్యింది. అలాగే చాలా మంది మంచి నటీనటులు ఇందులో కుదిరారు.

ఇది ఒక హీరో, హీరోయిన్ కథలా వుండదు. వైవా హర్ష, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ వీళ్ళంతా గత చిత్రాలకు భిన్నమైన పాత్రలు చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత నటీనటులకు కొత్త తరహ పాత్రలు రాయబడతాయి. వైవా హర్ష చెలరేగిపోయాడు. అజయ్ ఘోష్ సినిమా స్కేల్ ని పెంచారు. సలీం ఫేక్ లాంటి పాత్రని వూహించలేం. కొత్తరకం పాత్రలతో సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది.

IMG 20240401 WA0265

ఈ ప్రయాణంను చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా ఫ్రెష్ గా వుంటుంది. కొత్త హీరో, హీరోయిన్ తో చేసినట్లు ఎక్కడా అనిపించదు. చాలా పెద్ద డ్రామా వుంటుంది. మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది. పాత్రలకు ఎదురైన పరిస్థితులు ప్రేక్షకులని నవ్విస్తాయి. డార్క్ కామెడీ హిలేరియస్ గా వుంటుంది. అన్ని పాత్రలు ఉన్నప్పటికీ వాటి లక్ష్యం ఒకటే వుంటుంది. చక్రంలో ఇరుసు చుట్టూ తిరిగిటినట్లు ఆ లక్ష్యం చుట్టూనే తిరుగుతాయి.

క్రైమ్ కామెడీకి ‘భరతనాట్యం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ?

-‘భరతనాట్యం’ ఒక డ్యాన్స్ ఫాం. నృత్య కళ. కానీ ఆ పేరుని ఇక్కడ క్రైమ్ వరల్డ్ కి పెట్టాను. ఒక సరైన కారణంతో ఈ పేరుని పెట్టాను. ఆ టైటిల్ ఈ కథకు యాప్ట్. ప్రేక్షకుడు సినిమా చూసి బయటికి వస్తున్నపుడు ఈ కథకు ‘భరతనాట్యం’ టైటిల్ జస్టిఫీకేషన్ క్లియర్ గా తెలుస్తుంది. భరతనాట్యం నృత్యాన్ని స్టేజ్ పై ప్రదర్శిస్తున్నపుడు చూసే ప్రేక్షకుడికి ఆనందం. ఈ కథ కూడా ప్రేక్షకుడికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే ‘భరతనాట్యం’ ఆర్ట్ ఫామ్ ద్వారా కాదు.

IMG 20240401 WA0213 1

సూర్య తేజ ఈ కథ చెప్పినపుడే తనే హీరోగా చేయాలని అడిగారా ?

-ఈ కథ ఐడియాని తయారు చేసుకున్నపుడు హీరోగా తాను చేస్తానని అనుకోలేదని చెప్పారు. అయితే సబ్ కాన్సియస్ లో తను కథానాయకుడి పాత్రలో వున్నాడేమో అని నేను భావించాను. ఎందుకంటే ఒక రచయిత ప్రతి పాత్రలోకి వెళ్ళగలడు.

ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. మంచి స్క్రీన్ ప్లే మాటలు చేయగలిగితే కమర్షియల్ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యే ప్రాజెక్ట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. దాదాపు ఇరవై నెలలు కేటాయించి ప్యాక్డ్ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది.

‘భరతనాట్యం’ కథని ఒక లైన్ లో చెప్పాలంటే ?

-కథలు చెబుతూ దర్శకుడు కావాలని కలలు గంటూ ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ సహాయ దర్శకుడు.. ఒక విచిత్రమైన పరిస్థితిలో పడి అది క్రైమ్ వరల్డ్ కి దారితీసి ఆ డేంజర్ మూమెంట్ నుంచి ఎలా బయటపడ్డాడనేది లైన్.

IMG 20240330 WA0312

ఈ కథకు సూర్యనే హీరోగా తీసుకోవడానికి కారణం ?

-ఈ కథకు కొత్త హీరో అయితేనే యాప్ట్. ఎవరైనా కొత్త వాళ్ళనే పెట్టాలి. సూర్య ఈ కథ లైన్ తో వచ్చారు. ఒక రచయితకి తను అనుకుంటున్న కథ ప్రపంచమంతా తెలిసుంటుంది. ఆ వరల్డ్ అంతా తనలో వున్నప్పుడు తనకంటే బెస్ట్ ఆప్షన్ మరొకరు దొరకరు. తనలో మొత్తం సమాచారం వుంది. నేను యాక్ట్ చేయించాలి.

మిగతా క్రైమ్ కామెడీలకు ఈ సినిమాకి మధ్య ఎలాంటి కొత్తదనం వుంటుంది ?

-‘భరతనాట్యం’లాంటి ఎలిమెంట్ తో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇలాంటి ఎలిమెంట్ తో ఇదివరకూ కథ రాలేదు. చాలా ఫ్రెష్ గా వుంటుంది. పాత్రలన్నీ చాలా యూనిక్ గా ఫ్రెష్ గా కుదిరాయి. నా సెన్సిబిలిటీస్, సహజత్వం ఉంటూనే అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్ వుంటుంది. బిలీవబులిటీ వుంటుంది.

IMG 20240330 WA0313

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ?

-వివేక్ సాగర్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. చాలా ఆర్గానిక్ గా ఫ్రెష్ గా వుంటుంది. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ముఖ్యం. అయితే తను అన్ని సినిమాలు చేయరు. ఆయనకు కథ చెప్పి ఒప్పించాం. చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.

‘భరతనాట్యం’ ఫస్ట్ కాపీ చూసే వుంటారు కదా.. ఎలా అనిపించింది ?

-చాలా బావుంది. రెండుగంటల నాలుగు నిమిషాలు చాలా ప్యాక్డ్ గా కట్ చేశాం. ఫస్ట్ హాఫ్ బెస్ట్ వుంటుంది. ది బెస్ట్ సెకండ్ హాఫ్. కడుపుబ్బా నవ్వించే లాంగ్ సీక్వెన్స్ లు వుంటాయి.

DSC 3623 copy 1024x683

ఈ భరత నాట్యం చిత్రం నిర్మాతల గురించి ?

-నిర్మాత పాయల్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని తెర మీదకే తీసుకోస్తున్నారనే నమ్మకం వారిలో కలిగింది. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అవుట్ పుట్ చూసి చాలా ఆనందంగా వున్నారు.

ఈ సినిమాతో పాటు పెర్లాల్ గా మరికొన్ని సినిమాలు వుస్తున్నాయి కదా ?

-మంచి కంటెంట్ వున్న సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. మన దగ్గర బావుంటే రెండు మూడు సినిమాలు చూస్తారు. సమ్మర్ లో సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్. ఆ స్లాట్ లో వస్తున్నాం కాబట్టి తప్పకుండా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో వున్నాం.

IMG 20240401 WA0264

మి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?

-మూడు అద్భుతమైన కథలు సిద్ధంగా వున్నాయి. క్రైమ్ డ్రామాలు తరహా కథలు. ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి చేయాలనే ఆలోచన వుంది. నాకు క్రైమ్ డ్రామా జోనర్ ఇష్టం.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ మహీంద్ర గారూ..

  * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *