చిత్రం: భజే వాయు వేగం ,
విడుదల తేదీ : మే 31, 2024,
నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు,
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి,
నిర్మాతలు : యూవీ కాన్సెప్ట్స్,
సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల,
సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్,
ఎడిటింగ్: సత్య జి.
మూవీ: భజే వాయు వేగం రివ్యూ (Bhaje Vaayu Vegam Movie Review)
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన చిత్రం “భజే వాయు వేగం” ట్రైలర్ చూస్తే ఓ సాలిడ్ యాక్షన్ డ్రామానే అనిపిస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ తోనే మంచి యాక్షన్ థ్రిల్స్ ని మేకర్స్ ప్రామిస్ చేశారు. ఈ శుక్రవారం మంచి పోటీ విడుదల అయ్యింది.
మేకర్స్ ప్రామిస్ చేసినట్టు గానే సాలిడ్ యాక్షన్ అండ్ థ్రిల్స్ ని ప్రేక్షకులకు అందించిందా ! అందరి అంచనాలు అందుకుందో లేదో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
వరంగల్ లోని రాజన్న పేట గ్రామంలో వెంకట్ (కార్తికేయ) తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆ కష్ట సమయంలో ఊర్లో వారి అప్పులని తీర్చి లక్ష్మయ్య (తనికెళ్ళ భరణి) వెంకట్ ని అక్కున చేర్చుకుంటారు. అయితే తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్) తో సమానంగా పెంచి పోషిస్తారు. అయితే ఇద్దరినీ ఉన్నత స్థానాల్లో చూడాలని పెద్ద కొడుకు రాజుకి మంచి ఉద్యోగం, చిన్నోడు వెంకట్ ని క్రికెటర్ చెయ్యాలని తన తాహతుకు మించి కష్టపడతూ హైదరాబాద్ కి పంపిస్తారు.
అయితే ఇంకో పక్క హైదరాబాద్ ని ఏలుతున్న ఇద్దరు అన్నతమ్ములు డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహితిస్వ) లు హైదరాబాద్ కి వలస వచ్చి సిటీ ని తమ కంట్రోల్ లో పెట్టుకుంటారు. అయితే ఇంత పవర్ ఫుల్ వ్యక్తులకు అతి సామాన్యులు అయ్యిన వెంకట్, రాజులకి మద్య చిన్న వైరం మొదలవుతుంది.
అసలు వెంకట్-రాజుల కి డేవిడ్-జార్జ్ కి మద్య గోడవకి కారణం ఏమిటి ?,
ఈ క్రమంలో తండ్రి లక్ష్మయ్య ని కాపాడుకోడానికి వెంకట్-రాజు ఏమి చేశారు?
హైదరాబాద్ లో రన్ అవుతున్న ఏ 56 డ్రగ్ రాకెట్ ని నడిపిస్తుంది ఎవరు?,
వెంకట్-రాజు ల కధలో ఇందు (ఐశ్వర్య మీనన్) పాత్ర ఏంటి?
అసలు వెంకట్, రాజు లు తమ తండ్రిని కాపాడుకోవడంలో ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెంటనే వెండితెరపై చూడాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు ప్రశాంత్ రెడ్డి రాసుకున్న కధ, ఆ కధ కు తను రాసుకొన్న కధనం (స్క్రీన్ – ప్లే) లొని కొన్ని అంశాలు తను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. కానీ కొన్ని చోట్ల సీన్స్ లో లాజిక్స్ మాత్రం బలహీనంగా అనిపిస్తాయి. మొదటి అంకం (ఫస్టాఫ్) లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు సినిమా నీరసంగా యావరేజ్ మూవీ లా అనిపిస్తుంది.
కానీ, రెండవ అంకం (సెకండాఫ్) స్టార్ట్ ఏయిన దగ్గర నుండి కధనం వేగంగా పరిగెడుతుంది. ఈ రేసి స్క్రీన్ – ప్లే కోసం దర్శకుడు సినిమాటిక్ గా ఆలోచించి కొన్ని లాజిక్స్ వదిలేశాడు. అలాగే ఉన్న ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులకు ముందే అర్ధం అయిపోతాయి.
ఇంకా రెండవ అంకం (సెకండాఫ్) లో హీరోయిన్ పాత్ర కూడా తేలిపోయి కధనం తో పొంతన కనిపించదు. అలాగే క్లైమాక్స్ లో సీక్వెల్ కి రెఢీ అవ్వండి అంటూ లీడ్ చూపించడం అవసరమా అనిపిస్తుంది.
ఈ చిత్రంలో లాజికల్ ఎర్రర్స్ ముందుగానే కరెక్ట్ చేసుకొని ఉంటే సినిమా రిజ ల్ట్ మరో లెవెల్ లో ఉండేది. చిన్న చిన్న టెక్నికల్ లోపాలు ఉన్నా, నటి నటుల పెర్ఫార్మెన్స్ తో వాటిని మార్చిపోయి అయిగా మంచి రేసి క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ప్రేక్షకుడికి.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు ప్రశాంత్ రెడ్డి, తను మంచి డెబ్యూ మూవీ ఇచ్చాడు అని చెప్పవచ్చు. మెయిన్ గా తను కథనం (స్క్రీన్ – ప్లే ) నడిపిన విధానం మెప్పిస్తుంది. రెండవ అంకం (సెకండాఫ్) లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కానీ తాను సినిమాని తెరపై ఆవిష్కరించిన విధానంలో ఎక్కడా ఇది తన తొలి సినిమాలా అనిపించకుండా తెరకెక్కించారు. ఉన్న ఆ కొన్నిలాజికల్ ఎర్రర్స్ ని కూడా కరెక్ట్ చేసుకుని ఉంటే మరంత బెటర్ సినిమా ఆశించవచ్చు.
కార్తికేయ తన రోల్ ని చాలా బాగా చేసాడు. చాలా సెటిల్డ్ గా గత సినిమాలకి మించి మంచి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ని కూడా తాను అందించాడు. సెటిల్డ్ నటన తో పాటుగా యాక్షన్ సీన్స్ లో కూడా మంచి డైనమిక్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు అని చెప్పవచ్చు.
హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ కూడా డీసెంట్ నటన కనబరిచింది. తన పాత్ర పరిది లో నటించి మెప్పించింది అని చెప్పవచ్చు.
ఇంకా రాహుల్ టైసన్ కూడా తన రోల్ కి పూర్తి న్యాయం చేశాడు.
సీనియర్ నటులు తనికెళ్ళ భరణి తన అనుభవం తో మంచి పాత్రని చేసి ఎమోషనల్ గా మెప్పిస్తారు. ఇక మరో నటుడు రవి శంకర్ అయితే తన రోల్ లో ఆశ్చర్యపరుస్తారు అని చెప్పాలి. విలన్ పాత్రలో అదరగొట్టేసారు. అలాగే కొన్ని సీన్స్ లో తన కన్నింగ్ నెస్, కొన్ని హావభావాలతో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని అందించారు.
రవి శంకర్ అన్నయ్య పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు శరత్ లోహితిస్వ కూడా మంచి రోల్ చేసి తన రోల్ కి న్యాయం చేసారు.
ఇక వీరితో పాటుగా ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. చాలా సీక్వెన్స్ లలో యాక్షన్, ఎమోషన్ అయినా కూడా తన స్కోర్ తో మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి.
అలాగే మరో మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ అందించిన సాంగ్స్ కూడ బాగున్నాయి.
ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. నాచురల్ గా మంచి విజువల్స్ చూపించారు.
ఎడిటర్ సత్య జి ఎడిటింగ్ బాగుంది. చాలా సీన్స్ క్రిస్పీ గా కట్ అయి సీన్ వేగాన్ని పెంచాయి.
ఈ చిత్రంలో యూవీ కాన్సెప్ట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
టాలెంటెడ్ హీరో కార్తికేయ సాహసం తో చేసిన ఈ “భజే వాయు వేగం” సిన్మా టైటిల్ కి తగ్గట్టే రేసీ స్క్రీన్ ప్లే తో మాంచి యాక్షన్ ప్లీక్ గా ఉంది. కార్తికేయ, రాహుల్ తో పాటూ ప్రధాన తారాగణం అంతా కూడా బాగా నటించారు.
మెయిన్ గా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా బాగా పికప్ అయ్యి సెకండాఫ్ కూడా మెప్పించే విధంగా ఉంది. యాక్షన్, మాస్ మూమెంట్స్ అలాగే తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ని ఆశించేవారికి కూడా మంచి ట్రీట్ ఇస్తుంది.
ప్రేక్షకులు లాజిక్స్ పక్కన పెట్టి, ఈ సినిమా చూస్తే సూపర్ స్పీడీ ఫిల్మ్ చూసిన ఫీల్ వస్తుంది.