Bhagavanth Kesari Movie Review & Rating: బాలయ్యా కేసరి గా మెప్పించడా! ఒప్పించాడా!

InShot 20231019 065549721 e1697678859527

మూవీ: భగవంత్ కేసరి

విడుదల తేదీ : అక్టోబరు 19, 2023

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, పి. రవిశంకర్, ఆర్. శరత్‌కుమార్

దర్శకుడు : అనిల్ రావిపూడి

నిర్మాతలు: హరీష్ పెద్ది, సాహు గారపాటి

సంగీతం: ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్

ఎడిటర్: తమ్మిరాజు

మూవీ రివ్యూ: భగవంత్ కేసరి (Bhagavanth Kesari)

20231017 205709 నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగార్వల్ హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన “భగవంత్ కేసరి”.చిత్రం సాలిడ్ బజ్ నడుమ దసరా ఫెస్టివల్ సీజన్ కి మొదటి చిత్రంగా విడుదల అయ్యింది ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ రూపం లో ఆడియెన్స్ లో ఉత్కంఠ రేపుతూ వచ్చిన చిత్రం అంచనాలు అందుకుందో లేదో మా 18F మూవీస్ సమీక్షలో చదివి  తెలుసు కుందామా!

కధ పరిశీలిస్తే: 

ఈ చిత్ర  థలోకి వెళ్తే..నేలకొండ భగవంత్ కేసరి(నందమూరి బాలకృష్ణ) తన కూతురు కాని కూతురు విజ్జి విజయలక్ష్మి(శ్రీలీల) ని ఆర్మీలో చేర్చి  ఒక దృఢమైన మహిళగా నిలపాలి అని తాపత్రయ పడుతూ ఉంటాడు. విజ్జి పాప కు ఆర్మీ లో , చేరడం ఇష్టం లేకుండా జాలీ గా గడిలేస్తున్న టైం లో  బిసినెస్ లో నెంబర్ వన్  కావాలి అనుకుంటున్న ఓ డ్రగ్ మాఫియా లీడర్ రాహుల్ సాంగ్వి (అర్జున్ రాంపాల్) ఓ క్రైమ్ కేస్ లోకి శ్రీలీల ఇరుక్కుంటుంది.

విజ్జి ప్రాణాలకు హాని తలపెట్టనట్టు తెలుసుకొన్న భగవంత్ కేసరి ఏం చేశాడు?

అసలు భగవంత్ కేసరికి విజ్జి కి సంబంధం ఏంటి?

రాహుల్ సాంగ్వికి భగవంత్ కేసరికి ముందే శత్రుత్వం ఉందా?

రాహూల్ సంగ్వి క్రైమ్ లోకీ విజ్జీ పాప ఏలా వెళ్తుంది?

కాత్యాయని (కాజల్ అగర్వాల్) కి భగవంత్ కి ఉన్న సంబంధం ఏమిటి?

భగవంత్ కేసరి జైల్ కి ఎందుకు వెళ్తాడు?

లాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ భగవంత్ కేసరి చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

కథనం (స్క్రీన్ – ప్లే) పరిశీలిస్తే:

20231019 061737

 దర్శకుడు అనీల్ రావిపూడి గత చిత్రాల కామెడీ ట్రాక్ నుంచి బయటకి వచ్చి చేసిన ఈ కంప్లీట్ మాస్ చిత్రం కథ విషయంలో పర్వాలేదు అనిపించినా కథనం (స్క్రీన్-  ప్లే) లో కొత్తదనం లేకుండా నెక్స్ట్ సీన్ ఎంటి అనేది సినిమా చుసే ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. కథనం మొత్తం చాలా రొటీన్ ప్లాట్ ని, స్క్రీన్ ప్లే ని నడిపించాడు.

అయితే రొటీన్ అయినప్పటికీ మాస్ ఆడియెన్స్ కి మెయిన్ గా బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని హైలైట్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు ఆని చెప్పవచ్చు.

ఈ సినిమాలో నడిచే కథనం కానీ పలు సీక్వెన్స్ లు ఎమోషన్స్ ఆల్రెడీ మనం చాలా చిత్రాల్లో చూసినట్టే అనిపిస్తుంది.

ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్ శ్రీలీల పై కొన్ని ఎమోషన్స్ చాలా రొటీన్ గా ఉన్నాయి. అలాగే పలు యాక్షన్ సీక్వెన్స్ లలో అయితే కావాలనే పెడతారో ఏమో కానీ అవి కొంచెం ఓవర్ గా ఉన్నాయి.

అలాగే సినిమా రన్ టైం కూడా పెద్దది దీనితో కొన్ని అనవసర సన్నివేశాలు ఎడిటింగ్ లో  తగ్గించాల్సింది. కొన్ని సీక్వెన్స్ లు ఇరికించినట్టు కూడా అనిపించవచ్చు. ఇంకా సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా లేవు. అలానే కొన్ని చోట్ల కామెడీ కూడా అంత వర్కౌట్ కాదు.

ఓవరాల్ గా అనిల్ రావిపూడి పాత్రల మెక్ ఓవర్ మీద, డైలాగ్స్ మీద పెట్టిన శ్రద్ధ సీన్లు కొత్త కథనం తో డిఫరెంట్ ప్రజెంటేషన్ తొ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశీలిస్తే:

IMG 20231018 WA0018

 దర్శకుడు అనీల్ రావిపూడి బాలయ్యా, శ్రీలీల కెరాక్టర్స్ నీ ప్రెసెంట్ చేయడం లో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. చిత్రంలో మొట్టమొదటిగా ఇంప్రెస్ చేసే విశయం ఏమైనా ఉంది అంటే అదీ ఖచ్చితంగా బాలయ్య సరికొత్త మేకోవర్ ఆని చెప్పవచ్చు.

అనిల్ రావిపూడి కధ, కథనం మీద కంటే పాత్రల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది. అలానే దర్శకుడు అనిల్ సమాజంలో ఆడవారి ముఖ్యంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానిమీద డిజైన్ చేసిన ఓ చిన్నపాటి సందేశం కూడా బాగుంది.

ఇంక బాలయ్యా ను భగవంత్ కేసరి  పాత్ర లో చూడడం ఆడియెన్స్ కొత్తగా అనిపిస్తోంది. భగవంత్ పాత్రకు న్యాయం చేసాడు ఆని చెప్పవచ్చు.

ఇక బాలయ్య ఫ్యాన్స్ సహా మాస్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అండ్ ట్రీట్మెంట్ అంతా కూడా కొత్తగానే ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే తెలంగాణ యాస భాషలో అయితే బాలయ్య తన సరికొత్త నడవడికతో చాలా ఈజ్ గా కేసరి రోల్ ని ఫుల్ చేసారని చెప్పాలి. అలాగే ఎమోషన్స్ ని కూడా బాలయ్య బాగా పండించారు.

నటిగా శ్రీలీల కూడా బాలయ్యా తో పోటీ పడి నటించింది  బాలయ్యా, శ్రీలిల మధ్య పలు ఎమోషన్స్ కానీ తండ్రి కూతుర్లుగా వారి బాండింగ్ ఆన్ స్క్రీన్ పై చూసేందుకు చక్కగా ఉంది.

విలన్ పాత్రలో కనిపించిన హిందీ నటుడు అర్జున్ రాంపాల్ సాలిడ్ విలనిజంతో తన లుక్స్ అండ్ యటిట్యూడ్ తో ఇంప్రెస్ చేస్తాడు.

అలాగే హీరోయిన్ గా చేసిన  కాజల్ అగర్వాల్    పాత్ర పరిధి మేరకు డీసెంట్ లుక్స్ అండ్ నటనతో ఆకట్టుకుంటుంది.

ఇక ఫైనల్ గా శ్రీలీల అండ్ బాలయ్యపై వచ్చే ఓ క్రేజీ క్లైమాక్స్ సీక్వెన్స్ సాలీడ్ గా ఉంది. అందులో శ్రీలీల నుంచి ఇన్ని రోజులు కేవలం లుక్స్ డాన్స్ వరకే పనికొస్తుంది అనేవాళ్ళకి తనతో ఓ సాలీడ్ యాక్షన్ ఫ్లిక్ కూడా చేయొచ్చు అనే రేంజ్ లో నాచురల్ పెర్ఫార్మన్స్ రాబట్టింది.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

20231019 062007

చిత్రం టెక్నికల్ విశాయాలలో మొదటిగా చెప్పుకో వలసింది షైన్ స్క్రీన్ వారి నిర్మాణ విలువలు అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. చాలా గ్రాండియర్ గా అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు.

యస్ తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లాస్  అని సం చెప్పాల్సిందే. బాలయ్యతో తనకున్న ట్రాక్ రికార్డుని ఈ సినిమాతో మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. అలాగే తన సాంగ్స్ కూడా బాగున్నాయి.

సి రామ్ ప్రసాద్ విజువల్స్ బాగున్నాయి. కానీ గ్రాఫిక్స్ మాత్రం అసలు బాగలేవు. చాలా సీన్లు CG చేసినట్లు తెలిసిపోతుంది.

తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కొన్ని చోట్ల సీన్ డైలాగ్ కంప్లీట్ అవ్వకుండా ఎడిట్ అయిపోయింది.

18F మూవీస్ టీం ఒపినియన్:

20231019 062123

ఓవరాల్ గా చుసినట్టు అయితే బాలయ్య “భగవంత్ కేసరి” గా శ్రిలిల  విజ్జిపాప గా  తమదైన ఎమోషనల్ రోల్స్ లో కాస్త కొత్తగా కొన్ని ఊహించని ఎలిమెంట్స్ తో అద్భుతంగా నటించి మెప్పించారు.

ఈ సినిమాలో మాస్ యాక్షన్ కానీ బాలకృష్ణ చెప్పే డైలాగులు కానీ NBK ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. అలానే క్లైమాక్స్ లో శ్రీలీల సర్పరైస్ ఎపిసోడ్ తో సినీ ఇండస్ట్రీలో చాలా మందిని ఆశ్చర్యపరచవచ్చు.

90’s లో జరిగే రొటీన్ కధ లా ఉన్నా, కాజల్ అగర్వాల్ ఎపిసోడ్ లాంటి విజయాలు పక్కన పెడితే  ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరిస్తుంది. ముఖ్యంగా NBK ఫాన్స్ కి దసరా పండగే.

చివరి మాట: యాక్షన్ ఎమోషనల్ డ్రామా!

18F MOVIES RATING: 3 / 5

*కృష్ణ ప్రగడ.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *