Bellamkonda Sreenivas signs 3 back to back Action Films : బ్యాక్ టు బ్యాక్ మూడు యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్!

IMG 20240409 WA0147 e1712654904172

తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్‌ సినిమాలతో బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ దూసుకుపోయాడు. ఈ సినిమాల్లో.. అతని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా శ్రీనివాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి (2024) పది సంవత్సరాలు  పూర్తైంది.

మొదటి నుండి శ్రీనివాస్ తన సిక్స్-ప్యాక్ బాడీతో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్‌ హీరోల లీస్ట్‌లో చేరిపోయాడు. ఇందుకు తన కఠినమైన వ్యాయామం, దినచర్యలు, తన అంకిత భావమే కారణం అని చెప్పాలి. ఫిట్‌నెస్ విషయంలో అతను చాలా నిబద్ధతతో ఉంటాడు.

ఇక ఈహీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శ్రీనివాస్‌..14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ‘టైసన్ నాయుడు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు‌ మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.

వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని అంటున్నారు.

యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్‌ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *