బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, ‘నాంది’ సతీష్ వర్మల ”నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్1న విడుదల!

nenu student sir పోస్టర్ e1669734440200

 

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సర్!’. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

nenu student sir single

దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది,

తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించింది. ‘నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గణేష్, అవంతికల జోడి చూడముచ్చటగా వుంది.

nenu Student Sir ganesh first look

ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.

nenu student sir heroine

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *