బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ పాలకొల్లులో సాంగ్ షూట్!

IMG 20241120 WA0304 e1732111503635

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ పాలకొల్లు లో సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అదితి శంకర్ పై క్యూట్ లవ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.

IMG 20241120 WA0307

విజయ్ పోలాకి మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల చార్ట్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. మేకర్స్ షేర్ చేసి స్టిల్స్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుంగీ, షేడ్స్ తో రగ్గడ్ అండ్ మ్యాసీ అవాతర్ లో, హీరోయిన్ అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్నారు.

ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

IMG 20241120 WA0308

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.

తారాగణం:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది

సాంకేతిక సిబ్బంది:

స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల, నిర్మాత: కేకే రాధామోహన్,సమర్పణ: డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్), సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం ,ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి ,ఎడిటర్: చోటా కె ప్రసాద్,సంగీతం: శ్రీ చరణ్ పాకాల,డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్,సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి,ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ,పబ్లిసిటీ డిజైనర్: సుధీర్, పీఆర్వో: వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *