బెల్లంకొండ, అనుపమ ల ‘కిష్కిందపురి’ టీజర్ రివ్యూ! 

IMG 20250815 WA0340 scaled e1755275008366

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’లో పవర్ ఫుల్ ఎమోషనల్ అవతార్ లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ‘’కిష్కిందపురి’ టీజర్ మిస్టీరియస్, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో అదిరిపోయింది.

Kishkindhapuri Review!

మొదటి షాట్ నుంచే ఓ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక వింటేజ్ మాన్షన్‌లోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. ఇంతలో రేడియో నుంచి ఒక మెసేజ్ ప్రసారం చేస్తుంది. ఇది కథలో పారా‌నార్మల్ ఎనర్జీ తో పాటు డిఫరెంట్ టైమ్‌ లైన్స్ ని ప్రజెంట్ చేసింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ రోల్‌లో అదరగొట్టారు. అనుపమ పరమేశ్వరన్ ఆయన లవ్ ఇంటరెస్ట్‌గా కనిపించింది. టీజర్‌లో ఈ ఇద్దరి క్యారెక్టర్లను పరిచయం చేశారు.

టెక్నికల్ గా టీజర్ అద్భుతంగా వుంది. చిన్మయ్ సలస్కర్ కెమెరా వర్క్ ఓ సస్పెన్స్, హారర్ ని ఎలివేట్ చేసింది. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్ డిజైనర్‌గా మనీషా ఏ దత్, ఆర్ట్ డైరెక్టర్‌గా డి. శివ కామేష్, నిరంజన్ దేవరమనే దితర్, క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, కో-రైటర్‌గా దరహాస్ పాలకోలు వర్క్ చేస్తున్నారు.

థ్రిల్ల్స్, ఎమోషన్స్, సూపర్‌న్యాచురల్ సస్పెన్స్ తో టీజర్‌తో ‘కిష్కిందపురి’ పై క్యురియాసిటీని పెంచింది. కిష్కిందపురి ఈ ఏడాది థియేటర్స్‌లో చూడాల్సిన మస్ట్-వాచ్ మూవీ.

తారాగణం:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్

సాంకేతిక సిబ్బంది:

రచన & దర్శకత్వం – కౌశిక్ పెగళ్లపాటి , నిర్మాత – సాహు గారపాటి, బ్యానర్ – షైన్ స్క్రీన్స్, సమర్పణ – శ్రీమతి. అర్చన, సంగీతం – చైతన్ భరద్వాజ్, DOP – చిన్మయ్ సలాస్కర్ , ప్రొడక్షన్ డిజైన్ – మనీషా ఎ దత్, ఆర్ట్ డైరెక్టర్ – డి శివ కామేష్, ఎడిటర్ – నిరంజన్ దేవరమానే, సహ రచయిత – దరహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్: కె బాల గణేష్, స్టంట్స్ – రామ్ క్రిషన్, నటరాజ్, జాషువా, కో-డైరెక్టర్ – లక్ష్మణ్ ముసులూరి , క్రియేటివ్ హెడ్ – కనిష్క.జి, ప్రొడక్షన్ కంట్రోలర్- సుబ్రహ్మణ్యం ఉప్పలపాటి,  కాస్ట్యూమ్ డిజైనర్- లంకా సంతోషి, Vfx-DTM, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టి సందీప్, PRO – వంశీ-శేఖర్,పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ & భాను, మార్కెటింగ్ – ఫస్ట్ షో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *