BELLAM KONDA GANESH, NAANDHI SATISH VARMA’S NENU STUDENT SIR MOVIE TRAILER OUT: : డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదగా నేను స్టూడెంట్ సర్!’ సినిమా టీజర్ లాంచ్ !

SAVE 20221112 185704

బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, ‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ2 ఎంటర్ టైన్ మెంట్స్ ”నేను స్టూడెంట్ సర్!’ టీజర్ లాంచ చేసిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక

తొలి సినిమా ‘స్వాతిముత్యం’తో ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు.

KC SPEECH 1

ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తుంటే గణేష్ రెండవ చిత్రం, తన తొలి చిత్రానికి పూర్తి భిన్నంగా వుంది. గ్రాండ్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ టీజర్ ను విడుదల చేశారు.

ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ మెంట్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రతి యువకుడిలాగే గణేష్ కూడా ఎంతో ఆశపడి ఐ ఫోన్ కొంటాడు. కానీ ఫోన్ దొంగిలించబడుతుంది.

ఆ తర్వాత ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. అయితే అక్కడ పోలీసు అధికారులే దొంగలించారని గణేష్ చెప్పడం సర్ ప్రైజింగా వుంది.

IMG 20221112 154133IMG 20221112 152340

IMG 20221112 152340కృష్ణ చైతన్య ఒక విలక్షణమైన కథ అందించారు. స్క్రీన్ప్లే అద్భుతంగా ఉంది. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి టేకింగ్ బ్రిలియంట్ గా వుంది. టీజర్ కంటెంట్, ప్రెజెంటేషన్ తో అలరించింది.

గణేష్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్-ప్యాక్డ్ టీజర్ లో హీరోయిన్ అవంతిక దాసాని తో పాటు కీలక పాత్రలు పోషించిన సముద్రఖని, సునీల్ , శ్రీకాంత్ అయ్యంగార్ లతో సహా ప్రముఖ నటీనటులందరూ కనిపించారు.

ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ ‘నాంధి’ సతీష్ వర్మ తన సినిమాలకు కథలను ఎంపిక చేసుకోవడంలో మంచి అభిరుచిని కలిగి ఉన్నాడని టీజర్ ద్వారా తెలుస్తుంది. నాంది లానే నేను స్టూడెంట్ సర్! కంటెంట్ రిచ్ మూవీగా ఉండబోతోంది.

మహతి స్వర సాగర్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిత్ మదాడి అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందించారు.

విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలను పెంచింది.

SAVE 20221112 185714

టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. సతీష్ గారు తీసిన ‘నాంది’ సినిమా చూశాను. ఎక్కడా రాజీ పడకుండా మంచి కంటెంట్ తో తీశారు.

ఇప్పుడు సతీష్ గారి సంస్థలో గణేష్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. నేను స్టూడెంట్ సర్! టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో గణేష్ కి మరో విజయం రావాలని కోరుకుంటున్నాను.

అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతుంది. వాళ్ళ అమ్మగారు భాగ్యశ్రీలానే అవంతిక కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు రాఖీ తో పాటు ఈ చిత్రానికి పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ బెస్ట్ విశేష్” తెలిపారు.

IMG 20221112 154528

హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. స్వాతిముత్యం లాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చానని ప్రేక్షకులు యాక్సప్ట్ చేయడం నాకు చాలా నచ్చింది.

అయితే ఆ సినిమా విడుదల కాకముందే నన్ను బలంగా నమ్మి ఇంత ఖర్చు చేసి నేను స్టూడెంట్ సర్! నిర్మించిన సతీష్ గారికి కృతజ్ఞతలు. కథని బలంగా నమ్మితేనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతాం. కథలో విషయం వుంది కాబట్టే నేనూ యాక్సప్ట్ చేశాను.

IMG 20221112 152107

రాఖీ ఉప్పలపాటి లాంటి అంకిత భావంతో పని చేసే దర్శకుడు దొరకడం మా అదృష్టం. అవంతిక దస్సాని చాలా చక్కగా నటించింది. అసలు ఆమె తెలుగు అమ్మాయి కాదనే భావనే రాదు. ఇందులో రవితో నేను చేసే కామెడీ చాలా బాగా పండుతుందని నమ్ముతున్నాను.

టీజర్ లాంచ్ చేసిన వివి వినాయక్ గారికి కృతజ్ఞతలు. నేను స్టూడెంట్ సర్! ఖచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది” అని చెప్పారు.

SATISH VARMA SPEECH

నిర్మాత ‘నాంది’ సతీష్ వర్మ మాట్లాడుతూ..నా మొదటి సినిమా ‘నాంది’ చాలా సక్సెస్ అయ్యింది. ‘నేను స్టూడెంట్ సర్!’ సినిమాలో చాలా మంచి కంటెంట్ వుంది.

టీజర్ ఎంత ఇంటరెస్టింగా అనిపించిందో సినిమా కూడా ఇంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ముందుముందు కూడా మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను.

టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన వివి వినాయక్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మా సినిమాని చక్కగా ప్రమోట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు” తెలిపారు.

KRISHNA CHAITANYA WRITER

దర్శకుడు రాఖీ ఉప్పలపాటి మాట్లాడుతూ.. ‘నేను స్టూడెంట్ సర్!’ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. నేను తేజ గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను.

నేను స్టూడెంట్ సార్ బాగా వచ్చిందని చెప్పడానికి కారణం మా నిర్మాత సతీష్ గారు. ఆయన లాంటి నిర్మాత దొరకడం చాలా అదృష్టం. గణేష్ ఎప్పుడూ కథలోనే వుంటారు. అవంతిక దస్సాని అంకితభావంతో పని చేసే నటి.

SAVE 20221112 185724

కృష్ణ చైనత్య ఈ చిత్రానికి కథ ఇవ్వడంతో పాటు చాలా స్వేఛ్చని కూడా ఇచ్చారు. డైలాగ్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారు ఎప్పుడూ అందుబాటులో వుంటారు.

డీవోపీ అనిత్ మధాడి, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ ఇలా అందరి సహకారం వలన సినిమా అద్భుతంగా వచ్చింది” అన్నారు.

KC SPEECH

కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. నేను స్టూడెంట్ సార్! లాక్ డౌన్ సమయంలో రాసుకున్న కథ. గణేష్, సురేష్ గారు, సతీష్ గారికి నచ్చింది. రాకేశ్ చాలా మంచి డైరెక్టర్. ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను.

చాలా బావుంటుంది. రాకేశ్ ఈ కథని ఓన్ చేసుకొని తెరకెక్కిం చారు. యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్” చెప్పారు.

SAVE 20221112 185655 e1668273741501

హీరోయిన్ అవంతిక దస్సాని మాట్లాడుతూ.. నేను స్టూడెంట్ సర్! సినిమాతో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది. మా అమ్మగారిని సౌత్ చిత్ర పరిశ్రమ ఎంతగానో ఆదరించింది.

నన్ను కూడా స్వాగతిస్తారని కోరుకుంటున్నాను.
జెమినీ సురేష్, రవి శివతేజ, శశి, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

నటీనటులు:

బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో వంశీ-శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *