తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కథతో పాటు మెసెజ్ ఇస్తూ తెరకెక్కిన చిత్రం ‘బీఫోర్ మ్యారేజ్’.
మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాత. గా హనుమ బ్యానర్‌పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్.
భరత్ – నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్‌లలో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.