Beautiful Love Story LAMBA SINGI Movie Releases On : అందమైన ప్రేమకథ “లంబసింగి” సిన్మా విడుదల ఎప్పుడంటే! 

IMG 20240307 WA0199 e1709810709203

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.

IMG 20240307 WA0200

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక.

IMG 20240307 WA0209

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

IMG 20240307 WA0201

తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

 

నటీనటులు: 

భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం: నవీన్ గాంధీ,నిర్మాత: ఆనంద్.టి, బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్, కెమెరామెన్: కె.బుజ్జి,సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్,ఎడిటర్: కె.విజయ్ వర్ధన్,లిరిక్స్: కాసర్ల శ్యామ్

Song:https://youtu.be/bolpLcEFBgE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *