BANARASH MOVIE TELUGU REVIEW & RATING: బనారస్ వారణాసి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కధల లో ఈ “బనారస్” సినిమా కధ ప్రత్యేకత ఏంటి ?

BANARASH MOVIE TELUGU REVIEW BY 18F

మూవీ: బనారస్

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

నటీనటులు: జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్ తదితరులు

దర్శకుడు : జయతీర్థ

నిర్మాతలు: తిలక్ రాజ్ బల్లాల్, ముజమిల్ అహ్మద్ ఖాన్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటర్: కె.ఎం. ప్రకాష్

BANARASH MOVIE TELUGU REVIEW BY 18F MOVIES

కన్నడ రంగం నుండి  జైద్ ఖాన్  ని హీరోగా పరిచయం చేస్తూ సినీయర్  దర్శకుడు జయ తీర్దా తీసిన  పాన్ ఇండియా మూవీ బనారస్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం శుక్ర వారం థియేటర్ల లోకి వచ్చింది. అది ఎలా ఉందో పరిశీలించి చూద్దామా.

banaras hero zaid khan heroine

కధ (STORY) ని పరిశీలిస్తే:

సిద్ధార్థ్ (జైద్ ఖాన్) ప్రేమలో ధని (సోనాల్ మోంటెరో) పడుతుంది అని అతని ఫ్రెండ్స్  తో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ లో భాగం గా ధనిని లవ్ లో పడేస్తాడు. సిద్ధార్ద్ ప్రేమ ను పూర్తిగా నమ్ముతుంది ధని.

సిద్ధార్థ్ కారణం గా ధని ఒక సమస్యలో పడి తన స్వంత ఊరు వారణాసి వెళ్ళిపోతుంది. దని కాలేజ్ లోనూ, ఊరి లోనూ కనిపించక పోవడం తో తన తప్పును తెలుసుకున్న సిద్ధార్ద్ ఆమెకు క్షమాపణ చెప్పడానికి బనారస్ కి వెళ్తాడు.

banaras team

సిద్ధార్థ్ ధనికి క్షమాపణ చెప్పాడా?

ధని సిద్ధార్థ్  ని  క్షమించిందా? 

సిద్ధార్థ్ కి బనారస్ లో ఎదురైన సమస్యలు ఏంటి ?

కొత్త ఊరు వారణాసి లో సిద్ధార్థ్  కి ఎవరు హెల్ప్ చేశారు ?

 సిద్దార్థ్‌కి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

ఈ సమస్యలు నుండి సిద్ధార్థ్ ఏమి నేర్చుకున్నాడు ?

ఇంతకీ సిద్ధార్థ్  దని ల ప్రేమ కధ కి ముగింపు ఏంటి ?

టైమ్ ట్రావెల్ నిజంగా చేయవచ్చా ?

అనే అంశాలు తెలియాలంటే వెండితెర పై బనారస్  సినిమా చూడాల్సిందే.

BANARAS POSTER

కధ కధనాన్ని (SCREEN-PLAY) పరిశీలిస్తే:

అసలు సమస్య ఏమిటంటే మెయిన్ ప్లాట్‌ను సరిగ్గా చెప్పక  చేయకపోవడం. డైరెక్టర్ అసలు స్టోరీ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పై అంతగా దృష్టి పెట్టలేదు.

వీటి కారణం గా లవ్ ట్రాక్ కాస్త లాగ్ అనిపిస్తుంది.

అసలు కథ ఇంటర్వల్ టైమ్ లో స్టార్ట్ అవుతుంది.

సెకండాఫ్‌లోని ఇంట్రెస్టింగ్ గా సాగే సన్నివేశాల కోసం ఎదురు చూస్తాం. అయితే అసలు ట్విస్ట్ వచ్చినప్పుడు కొంచెం డిజప్పాయింట్ అవ్వక తప్పదు.

తీసుకున్న పాయింట్ కి స్క్రీన్ ప్లే కి అసలు పొంతన ఉండదు. అంతేకాక సినిమాలో చాలా జానర్‌లు మరియు కాన్సెప్ట్‌లను జోడించడానికి ప్రయత్నించాడు దర్శకుడు.

అందువలన సినిమా వీటన్నింటి మధ్య ఎక్కడో మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. సినిమా ఏ విధంగా సాగింది అనేది కొంత వరకూ అర్దం కాదు. సినిమాలో ఎమోషన్స్ మీద ఇంకా బాగా సీన్స్ ఉండి ఉంటే మరికొంత మంది కి నచ్చేది.

క్లైమాక్స్ లో ఫిలసాఫికల్ అప్రోచ్ ఉన్నప్పటికీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా కాకుండా క్లైమాక్స్ ఇంతేనా అన్నట్టు ఉంది.

BANARAS 6

బనారస్ నటుల నటన పరిశీలిస్తే:

బనారస్ అంటూ ప్రేక్షకుల ముందుకు తొలిసారిగా వచ్చాడు జైద్ ఖాన్. బనారస్ సినిమా తన  మొదటి సినిమానే అయిన చాలా ఈజ్ తో సులువుగా నటించడం మాత్రమే కాకుండా, కీలక సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు.

మొదటి నుండి చివరి వరకు సినిమా లో చాలామెచూరిటీ తో  నటించారు. అంతేకాక తను చాల స్టైలిష్ గా కనిపించాడు. రాబోయే రోజుల్లో జైద్ ఖాన్ (Zaid Khan) నుండి మంచి చిత్రాలు ఆశించవచ్చు.

సోనాల్ మోంటెరో (Sonal Montoro) ఈ చిత్రం లో అందంగా ఉంది. తన పాత్రలో బాగా సరిపోయింది. సినిమా చాలా ఎగ్జైటింగ్‌గా స్టార్ట్ అవుతుంది. సినిమా మొదటి పది నిమిషాలు సన్నివేశాల్లో ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచింది.

 చిత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ డీసెంట్ గా ఉంది.

సుజయ్ శాస్త్రి, అచ్యుత్ కుమార్, దేవరాజ్ లు తమ తమ పాత్రల్లో చాలా డీసెంట్‌గా నటించారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. డైలాగ్‌లు, ఫన్ పోర్షన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

BANARAS POSTER 2

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:

మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. బనారస్ లో ఉన్న అందమైన లొకేషన్స్ ను చాలా బాగా చూపించారు. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా చక్కగా కుదిరింది.

దర్శకుడు జయ తీర్థ దర్శకత్వం పర్వ లేదు అనే స్థాయిలో ఉంది. అతను స్క్రీన్‌ ప్లే పై ఇంకా బాగా  దృష్టి పెట్టి ఉండాల్సింది. భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే అతని ఆలోచన బాగానే ఉంది, కానీ అతను చాలా అంశాలను చూపించడం వల్ల సినిమా కధనం సగటు ప్రేక్షకుడికి పరీక్ష ల సాగుతుంది.

బనారస్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు అతను కొన్ని అంశాలకే పరిమితం చేసి ఉండాల్సింది. అయితే, జయతీర్థ నటీనటుల నుండి సరైన పెర్ఫార్మెన్స్ లను రాబట్టడం లో విజయం సాధించారు అని చెప్పాలి.

BANARASH REVIEW

18 f  టీం ఒపీనియన్:

 బనారస్ చిత్రం ఇంట్రెస్టింగ్ గా సాగే లవ్ సన్నివేశాలతో వారణాసి స్తల ప్రాముక్యం, చూపిస్తూ స్క్రీన్ ప్లే రెండవ అంకం లో టైమ్ లూప్ సీన్స్ తో సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది.

వారణాసి లో  బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమా లు వచ్చినా ఈ బనారస్  సినిమా లో వారణాసి ఘాట్స్ ని గంగా నది ని కొత్తగా  చూడవచ్చు. ఫ్యామిలీ తో వీక్ ఎండ్ చక్కగా ఎంజాయ్ చేసే సినిమా ఈ బనారస్.

18F MOVIES RATING: 2.75/5

 

  • కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *