నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ గురించి సోషల్ మీడియా లో రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. అసలు బాలయ్య మనస్సు లో ఏముంది అన్నది ఇప్పటి వరకూ అఫిసియల్ గా వచ్చింది ఏంటంటే అప్పుడు ఎప్పుడో బాలకృష్ణ హీరో గా సింగీతం శ్రీనివాస రావు తీసిన ఆదిత్య 369 కి సీక్వల్ గా బాల కృష్ణ దర్శకత్వం లో బాలయ్య తో పాటు మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగినది.
అప్పట్లో బాలయ్య కూడా మీడియా లో చెప్పాడు. కధ రెఢీ అవుతుంది అని. కానీ ఈ వార్తా వచ్చి సాంవత్శరాలు గడుస్తున్నా ఫాలో అప్ స్టోరీ రాలేదు. ఇప్పుడు మరలా మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ కొన్ని గాలి వార్తలు వస్తున్నాయి. అవి నమ్మాలా లేక గాలికి వదిలేయాలా అనేది వార్తా చదివే ప్రేక్షకుడి ఇస్టం.
ప్రస్తుతం ఇనిపిస్తున్న పేర్లు పరిశీలిస్తే మొదట వరసలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మోక్షజ్ఞను లాంచ్ చేసేది వేరే దర్శకుడు అని మరో మీడియాలో వార్ వ్రాసారు. బాలకృష్ణకు కూడా ఆ డెరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో.. మోక్షజ్ఞను ఆ రా అండ్ రస్టిక్ డైరెక్టర్ తోనే లాంచ్ చేయాలని చూస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే…
న్యాచురల్ స్టార్ నాని ని రాస్థీక్ అండ్ రఫ్ లుక్ లో చూపించిన కుర్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మోక్షజ్ఞ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నారట. అది బాలయ్యకు వినిపించారని తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో… బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడితోనే లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఇక మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీ… బాలయ్య తీయబోయే ఆదిత్య 999 సినిమాతోనే ఉంటుందనే వార్తలు కూడా ఇప్పటి వరకూ ఎవరు ఖండించలేదు.
మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో.. తెలియాలంటే.. బాలయ్య ద్వారా వచ్చే అఫిసియల్ వార్తా కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.