Bade Miya Chota Miya Release Date Changed : అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ల ‘బడే మియా చోటే మియా’  విడుదల ఇప్పుడంటే! 

IMG 20240409 WA0306 e1712663878718

పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బడే మియా చోటే మియా. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి ఈ చిత్రం అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రాబోతోంది. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, ప్రోమ్స్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్టన్ అవతారంలో హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కనిపిస్తున్నారు.

IMG 20240409 WA0308

ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి.

బడే మియా చోటే మియా ఇద్దరూ మీ హృదయాల్ని కొల్లగొట్టడమే కాదు.. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే మూమెంట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం చిత్రం కాదు.. రోలర్ కోస్టర్ రైడ్ లాగా థ్రిల్లింగ్ సీన్స్,  ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందించే విజువల్ వండర్. కాబట్టి ఆడియన్ మీ క్యాలెండర్ లో డేట్ సెట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి.

IMG 20240409 WA0307 1

వశు భగ్నానీ, పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్ లో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

IMG 20240409 WA0305

రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్, ఆలయ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *